worker died
-
ఆత్మహత్యకు యత్నించి.. చివరికి..
పెద్దపల్లి: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటూ జీడీకే–1వ గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు తాటికొండ సంజీవ్(30) ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. ఈనెల 23న సంజీవ్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. సంజీవ్‌కు ఆరునెలల కిత్రం ములుగుకు చెందిన అమ్మాయితో వివాహం కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. మృతుడి తల్లి విజయ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ సుగుణాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..!
ప్రతిరోజూ నాన్నా నాన్నా అని పిలిచే తన తండ్రికి ఏం జరిగిందో తెలియక ఆ పిల్లలు అమాయకంగా చూస్తుంటే అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి ‘మాలాగా కూలీ నాలీ చేసుకొని బతకకుండా... ఉద్యోగం వస్తే కొడుకుకు కష్టాలు తప్పుతాయనుకున్న. అప్పు తెచ్చి డబ్బులు ఇచ్చిన. ఉద్యోగం వచ్చిందని అందరం సంబరపడ్డం. నాలుగు నెలలకే ఆ ఉద్యోగం పోయింది. మోసపోయేసరికి.. నా కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నువ్వుపోయినవు.. నీ పిల్లలు ఏమైపోవాలె బిడ్డా..’ అంటూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హరీశ్ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కలకాలం తోడుంటానని బాసలు చేసి అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ మహిళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు రోడ్డున పడ్డారు. భర్త అకాలమరణం తట్టుకోలేక భార్య రవళి పిల్లలను ఒళ్లో పెట్టుకుని రోదించిన తీరు అందరినీ కదిలించింది. ఉద్యోగం వచ్చిందని ఎంతో ఆశతో వెళ్లిన ఆ యువకుడు.. విగతజీవిగా తిరిగిరావడంతో విషాదం అలుముకుంది. కరీంనగర్‌క్రైం/కరీంనగర్‌టౌన్/శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన ముంజ శోభ–రవి దంపతులకు ఒక్కగానొక్క సంతానం ముంజ హరీశ్(32). అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగం ఇపిస్తానని ఓ దళారీ చెప్పడంతో ఆశపడి, అప్పుచేసి రూ.7 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఉద్యోగం వచ్చినప్పటికీ నాలుగు నెలల్లోనే తొలగించడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురయ్యాడు. తాను మోసపోయానని కుమిలిపోయాడు. ఉద్యో గం ఎలాగూ లేదు.. కనీసం తాను ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని దళారులను వేడుకున్నాడు. వారు చేతులెత్తేయడంతో పరిస్థితిని తలుచుకొని కుంగిపోయిన హరీశ్ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయింది. తన వాట్సాప్ స్టేటస్‌లో మా త్రం తనకు డబ్బులు వస్తే తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల ని.. బై.. బై.. అంటూ.. తాను ఏదో చేసుకుంటున్నట్లు పోస్ట్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించారు. వారు వెంటనే లొకేషన్ ట్రేస్ చేసి శని వారం ఉదయం కమాన్‌పూర్ మండలం సిద్దపల్లి శివారులోని బావిలో మృతదేహాన్ని గుర్తించారు. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత హరీశ్ మృతదేహాన్ని పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు వందల సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. గొడవలు జరిగే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమై అదనపు బలగాలను ఆసుపత్రి వద్ద మోహరించారు. అయినప్పటికీ ఆగ్రహానికి గురైన బంధువులు, గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మిన్నంటిన రోదనలు చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి దూరమైన హరీశ్‌ను తలచుకుంటూ కుటుంబసభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఆసుపత్రి ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి. హరీశ్ ఆత్మహత్య విషయం తెలిసి ఆసుపత్రికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ కాంగ్రెస్ ఇన్చార్జి ఆది శ్రీనివాస్, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మృతుడి బంధువులు, గ్రామస్తులు, స్నే హితులతో కలిసి మంచిర్యాల చౌరస్తాలో సుమా రు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నేతలను సీటీసీకి తరలించారు. మోహరించిన పోలీసులు పోలీసుల పహారా మధ్య శనివారం ముంజ హరీశ్ మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆçస్పత్రినుంచి అంబాల్‌పూర్ గ్రామానికి తీసుకువచ్చారు. కారకులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్–వరంగల్ రహదారిపై రాస్తారోకో చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్ తరలించారు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంపై పడి రోదించారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తుండడంతో హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ జనార్దన్, ఎస్సై చంద్రశేఖర్, 60 మంది పోలీసులు మోహరించారు. -
పార్కులో యువకుడి దారుణహత్య..!
సాక్షి,ఖమ్మంఅర్బన్: నగరంలోని వెలుగుమట్ల పట్టణ అటవీ పార్కులో పని కోసం వచ్చిన యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు...పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన అబ్దుల్(32), వెలుగుమట్ల పార్కులో పనులకు వచ్చాడు. అక్కడే నివాసముంటున్నాడు. కోల్‌కత్తాకు చెందిన వహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి, వెలుగుమట్ల అటవీ పార్కులో డిజైనింగ్ పనుల కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆరు నెలల నుంచి పనులు చేయిస్తున్నాడు. పార్కులోనే చిన్న గదిలో వర్కర్లు అబ్దుల్, జాకీర్ ఆలీ ఉంటున్నారు. పనులను పర్యవేక్షించేందుకు వాచర్లు వెంకటేశ్వర్లు, దస్తు, ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి అధికారి వేణుమాధవ్ శుక్రవారం ఉదయం వచ్చారు. పొద్దుపోయినప్పటికీ పనులకు అబ్దుల్, జాకీర్ ఆలీ రాలేదు. వాచర్ వెంకటేశ్వర్లును ఆ వర్కర్ల గది వద్దకు అధికారి వేణుమాధవ్ పంపించారు. ఆ గదిలో, విగతుడిగా అబ్దుల్ కనిపించాడు. అటవీ అధికారి ఇచ్చిన సమాచారంతో సీఐ సాయిరమణ, ఎస్ఐ మొగిలి వచ్చారు. మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించారు. అక్కడ, అబ్దుల్‌తోపాటు ఉంటున్న జాకీర్ ఆలీ కనిపించలేదు. అతడి సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. రాత్రి వేళ వారిద్దరూ గొడవపడి ఉంటారని, అబ్దుల్‌ను రాయితో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. హత్య ప్రదేశాన్ని నగర ఏసీపీ జి.వెంకట్రావు, ఎఫ్ఆర్ఓ రాధిక పరిశీలించారు. ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. అటవీ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతోంది. అబ్దుల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆపరేషన్.. 48 గంటలు
కోల్‌బెల్ట్: సింగరేణి యంత్రాంగం చేపట్టిన 48 గంటల ఆపరేషన్ తర్వాత గని కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ టీం సభ్యులు శుక్రవారం గుర్తించారు. సపోర్ట్‌మెన్ కార్మికుడు సత్యనారాయణ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–1 గనిలో బుధవారం మొదటి షిఫ్టుకు హాజరయ్యాడు. గనిలోని 36వ డిప్ 3వ సీం ఎస్–7 ప్యానల్ వద్ద 11 లెవల్లో బారికేడ్ వద్ద విధులు నిర్వర్తిసుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో బారికేడ్‌కు రంధ్రం ఏర్పడిందని తెలియడంతో అక్కడికి వెళ్లాడు. అవుట్ మస్టర్ పడకపోవటంతో.. మధ్యాహ్నం విధుల ముగించుకున్నతర్వాత సత్యనారాయణ అవుట్ మస్టరు పడక పోవటంతో అనుమానం వచ్చిన అధికారులు ఆయన ఆచూకీ కోసం గనిలో ఆపరేషన్ చేపట్టారు. అతను విధులు నిర్వర్తిస్తున్న 11 లెవల్ బారికేడ్ వద్ద నుంచి 21 లెవల్ వరకు ఆరు రెస్క్యూ టీంలు ఎస్డీఎల్ యంత్రంతో రెండు రోజుల పాటు ఇసుకను తొలగిస్తూ ఆపరేషన్ చేపట్టారు. అయితే 20వ లెవల్ వద్ద సత్యనారాయణ వెంట తీసుకువెళ్లిన హెడ్ లైట్ దొరకటంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సుమారు 350 మీటర్ల దూరంలోని ఇసుకను తొలగించగా చివరకు 20వ లెవల్ ఈస్ట్ ఆఫ్ 35 డిప్ జంక్షన్‌కు 12 మీటర్ల దూరంలో 21వ లెవల్ వద్ద మృత దేహాన్ని గుర్తించారు. సత్యనారాయణ శరీరం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. మృత దేహాన్ని బయటకు తీసిన అనంతరం అంబులెన్స్‌లో మంజూర్‌నగర్ సింగరేణి ఆస్పత్రికి తరలించారు. బారికేడ్‌కు 0.06 మీటర్ల మేర రంధ్రం పడి ఇసుక, నీరు ఉధృతంగా ప్రవహించినందున సత్యనారాయణ కొట్టుకు పోయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గాలింపులో భాగంగా 50 మంది మైనింగ్ ఉద్యోగులు గనిలోని ఇతర గుళాయిలలో వెతికారు. అధికారుల నిరంతర పర్యవేక్షణ.. గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీని కనుగొనడానికి సింగరేణికి చెందిన జీఎం సేఫ్టీ ఎం.వసంతకుమార్, జీఎం రెస్క్యూ జి.వెంకటేశ్వర్‌రెడ్డి, రీజియన్ సేఫ్టీ జీఎం కలువల నారాయణ, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం బళ్లారి శ్రీనివాసరావు, ఏరియా జనరల్ మేనేజర్ కొండబత్తిని గురువయ్య గని వద్ద మకాం వేసి నిరంతరం ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. గని ప్రమాదంపై డీడీఎంఎస్ విచారణ గని ప్రమాదంలో కార్మికుడు సత్యనారాయణ మృతి చెందటం పట్ల మైనింగ్ శాఖ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. డీడీఎంఎస్ సుబ్రహ్మణ్యం గనిలోని సంఘటనా స్ధలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఆగ్రహం.. కేటీకే–1 గనిలో గల్లంతైన సత్యనారాయణ ఆచూకీ కనుగొనడానికి 48 గంటల సమయం పట్టడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి ప్రాణాలు కోల్పోయాడని సత్యనారాయణ కుమారుడు శ్రవన్ శుక్రవారం గని ఆవరణలో జీఎంను నిలదీశాడు. శ్రవన్ బోరున విలపించగా అక్కడే ఉన్న కార్మికులను కంటతడిపెట్టారు. మార్చురి వద్ద మృతుని భార్య అన్నపూర్ణతో పాటు బంధువుల రోధనలు కలచి వేశాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు చెందిన నాయకులు కొక్కుల తిరుపతి, బడితెల సమ్మయ్య, రత్నం అవినాష్‌రెడ్డి, కోటేశ్వర్రావు, మల్లేష్, వెంకటేశ్వర్లు, బాలాజీ, కొరిమి రాజ్‌కుమార్, మొటపలుకుల రమేష్, భీమా, రత్నం సమ్మిరెడ్డి, కె.నర్సింగరావు చేపట్టారు. అన్ని విధాలుగా ఆదుకుంటాం.. గని కార్మికుడు సత్యనారాయణ కుటుంబాన్ని సింగరేణి సంస్థ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటుంది. కుటుంబంలో ఒకరికి 10 రోజులలో సంస్థలో ఉద్యోగం కల్పిస్తాం. గని ప్రమాదంలో మృతి చెందినందున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇతర బెనిఫిట్స్‌ను అందజేసేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటాం. – కె.గురువయ్య, ఏరియా జీఎం -
సౌదీలో దుబ్బాక వాసి మృతి
దుబ్బాక టౌన్: ఊళ్లో ఉపాధి లేక బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన ఓ కార్మికుడు అనారోగ్యం తో మృతిచెందాడు. దుబ్బాక పట్టణానికి చెందిన చింతకింది ఎల్లం (50) బతుకు దెరువు కోసం సౌదీకి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 17 ఏళ్లుగా సౌదీలో పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఎల్లం తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి కార్మికులు ఆసుపత్రిలో చేర్చారు. ఎల్లంకు తలలో రక్తం గడ్డకట్టిపోయి స్పృహ తప్పి పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో సౌదీలోనే మరో ప్రాంతంలో పనిచేస్తున్న ఎల్లం కుమారుడు నర్సింహులుకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు పది వేల రియాల్స్ కావాలని.. తన వద్ద అంత డబ్బు లేదని నర్సింహులు వాపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు తమకు సహాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. -
అనుమానాస్పదంగా కార్మికుడి మృతి
బరంపురం: నగరంలోని సితలాపల్లి గ్రామ శివారులో అదే గ్రామానికి చెందిన ఎంకా రెడ్డి మృతదేహం ఉండడాన్ని గ్రామస్తులు ఆదివారం గుర్తించారు. ఇదే విషయంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న గోపాల్పూర్, చమ్మఖండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమై బరంపురం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అనంతరం కేసును నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై గోపాల్పూర్ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి అందించిన సమచారం ప్రకారం.. సితలాపల్లిలో నివాసముంటున్న ఎంకా రెడ్డి తన భార్యతో కలిసి పని కోసం శనివారం గోపాల్పూర్ వెళ్లాడు. అదే రోజు సాయంత్రం పని ముగించుకుని వ్యాన్‌లో ఇంటికి పయనమయ్యాడు. మార్గం మధ్యలో ఓ బైకుపై వచ్చిన యువకుడితో ఎంకారెడ్డి కలిసి వెళ్ళాడు. రాత్రి అయినా ఎంకా రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంకారెడ్డికి మొబైల్‌కు ఫోన్ చేశారు. ఎంతసేపు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం సితలాపల్లి గ్రామ పొలాల్లో విగతజీవుడై ఉన్న ఎంకా రెడ్డిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పాతకక్షలే కారణం 2014లో జరిగిన జి.గణరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఎంకా రెడ్డి ఆరోపణలు ఎదుర్కొని, ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావునిస్తోంది. బండరాయిని తలపై మోది హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ప్రాథమిక నివేదిక వచ్చాక చెబుతామని పోలీసులు తెలిపారు -
చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో బాయిలర్ పేలి భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. కాటేదాన్‌లోని చాక్లెట్స్ తయారు చేసే ఎస్ఏ ఫుడ్ కంపెనీలో సోమవారం ఉదయం బాయిలర్ పేలింది. ఈ సంఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కారన్ అనే కార్మికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వరిశాంలో విషాదం
రణస్థలం: ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అతడిని విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు కాటేసింది. పెద్ద కుమార్తె పెళ్లి విషయంలో తలమునకలై ఉన్న అతడిని పరలోకాలకు పంపించింది. త్వరలో మూహూర్తాలు చూసుకొని మేనల్లుడితో పెళ్లి చేసేందుకు పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. అంతలోనే ఆ కుటుంబానికి విద్యుత్ షాకు రూపంలో విషాదం మిగిలింది. పైడిభీమవరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి పంచాయతీ బుర్రవానిపాలెం గ్రామానికి చెందిన రెయ్యి భద్రయ్య(41) మంగళవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఇతడు 20 సంవత్సరాల నుంచి పైడిభీమవరం పంచాయతీ వరిశాంలో అత్తవారి ఇంట్లో ఉంటూ స్థానిక ఫార్మా కంపెనీలో క్రేన్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ రహదారి ఆరులైన్ల విస్తరణలో భాగంగా పైడిభీమవరం పంచాయతీలో షాపులను సోమవారం తొలగించారు. తొలగించిన తన షాపును వేరే ప్రదేశంలో పెట్టించేందుకు ప్రైవేటు కాంట్రాక్టరును ఓ షాపు యజమాని ఆశ్రయించాడు. అరబిందో ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఈ ప్రైవేటు కాంట్రాక్టరు లేబరుతో షాపు తరలించేందుకు సన్నద్ధమయ్యాడు. మంగళవారం ఉదయాన్ని కంపెనీలో పనికి అని బయలుదేరిన రెయ్యి భద్రయ్య కాంట్రాక్టర్ చెప్పిన విధంగా షాపు తొలగించేందుకు అంగీకరించాడు. షాపును ఓ వైన్ షాపు పక్కన పెట్టిన సమయంలో పైన హైవోల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి భద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి భార్య భద్రమ్మ, ముగ్గురు ఆడపిల్లలు గౌరి(19), భవాని(10), రోహిణి(7) ఉన్నారు. ఈ ఘటనపై జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.