worst case
-
తలపై చర్మాన్ని ఒలిచారు
శివ్‌పురి (మధ్యప్రదేశ్): తలపాగా(టర్బన్) ధరించాడని ఎస్సీ వర్గానికి చెందిన ఓ బీఎస్పీ నేతపై గుజ్జర్ యువకులు దాడి చేసి తల చర్మాన్ని ఒలిచారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో చోటు చేసుకుంది. శివ్‌పురిలోని మొహోబా గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ జాదవ్ (45) స్థానిక బీఎస్పీ నేతగా ఉన్నారు. ఈ నెల 3న సర్దార్ సింగ్‌ను ఓ విషయంపై మాట్లాడాలని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిందితుల్లో ఒకరైన సురేంద్ర గుజ్జర్ ఇంటికి పిలిచారు. దీంతో అక్కడకు చేరుకున్న సర్దార్ సింగ్‌ను నిందితులు ఒక్కసారిగా దూషించటం ప్రారంభించారు. అనంతరం నిందితులు సర్దార్‌పై కత్తితో దాడి చేసి అతని తలపై చర్మాన్ని ఒలిచేశారు. సర్దార్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నర్వార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ బదం సింగ్ యాదవ్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సర్దార్‌ను గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా, టర్బన్ ధరించిన కారణంగానే జాదవ్‌పై గుజ్జర్ యువకులు దాడికి పాల్పడ్డారని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దయాశంకర్ గౌతమ్ ఆరోపించారు. జాదవ్ రోజూ నీలం రంగు తలపాగా ధరిస్తాడని, దీనిపై నిందితులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారని వెల్లడించారు. -
చెప్పులతో కొట్టి.. ఉమ్మి నాకించి..
బిహార్షరీఫ్: అనుమతి లేకుండా తమ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని కొందరు పెద్ద మనుషులు చెప్పులతో కొట్టించి, నేలపై ఉమ్మేసిన లాలాజలాన్ని అతని చేత నాకించిన దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నలందా జిల్లాలోని ఆజాద్‌పూర్ గ్రామంలో క్షురకుడిగా పనిచేస్తున్న మహేశ్ ఠాకూర్(54) బుధవారం ఊర్లో పలుకుబడి ఉన్న ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి బంధువుల ఇంటికెళ్లాడు. ఇంటిబయట నిల్చొని ఎంతసేపు పిలిచినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో లోపలకు వెళ్లాడు. తాము లేని సమయంలో ఇంట్లోకి మహేశ్ వెళ్లడంపై ఆగ్రహించిన యాదవ్ బంధువులు, సర్పంచ్ దయానంద్ మాంఝీతో కలిసి అతన్ని శిక్షించాలని నిర్ణయించారు. మరుసటి రోజు పంచాయితీ ఏర్పాటు చేసి అందరిముందు మహిళలతో చెప్పుదెబ్బలు కొట్టించారు. అంతటితో ఆగకుండా ప్రాయశ్చిత్తంగా లాలాజలాన్ని నేలపై ఉమ్మివేసి దాన్ని నాకాల్సిందిగా మహేశ్‌ను ఆదేశించారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ఎం త్యాగరాజన్, ఎస్పీ సుధీర్ కుమార్‌లు నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. దీంతో బాధితుడి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. మాంఝీ, యాదవ్ సహా 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులందరూ పరారీలో ఉన్నారనీ, ఈ కేసు విచారణ బాధ్యతల్ని నూర్‌సరై స్టేషన్ ఇన్చార్జ్కు అప్పగించారు. -
మానవత్వానికే మచ్చ
► అంబులెన్స్ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది ► బైక్‌పై బాలుని మృతదేహం తరలింపు ► ఆనేకల్‌లో దారుణ ఘటన ► ప్రభుత్వ విచారణ బొమ్మనహళ్లి(బెంగళూరు) : మానవత్వానికి మచ్చతెచ్చే ఘటన ఇది. ఎక్కడో మారుమూల కొండకోనల్లో కూడా ఇలా జరగదేమో. కానీ మెట్రో సిటీ శివార్లలోనే చోటుచేసుకుంది. బాధితులకు ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో కన్నకొడుకు మృతదేహాన్ని బైకుపైన తీసుకెళ్లిన దారుణ ఘటన ఐటీ సిటీ పరిధిలో జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మానవత్వాన్ని మరిచిపోయిన ఈ సంఘటన బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆనేకల్ పట్టణం సమీపంలో నివాసం ఉంటున్న అసోం నుంచి కూలి పనుల కోసం వచ్చిన దంపతుల కుమారుడు రహీం(3) తమ ఇంటి ముందు ఆదివారం సాయంత్రం ఆట ఆడుకుంటున్న సమయంలో ఒక బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలైనాయి. దాంతో తల్లిదండ్రులు బాలుడిని ఆనేకల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలన జరిపిన వైద్యులు బాలుడు మృతి చెందాడని చెప్పడంతో బాధితులు చిన్నారి మృతదేహాన్ని తమ వెంట తీసుకునివచ్చిన బైకుపైనే వేసుకుని తిరుగుముఖం పట్టారు. నిబంధనలు బేఖాతరు బాలుడు మృతి చెందినప్పుడు ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతోపాటు మృతదేహానికి శవపరీక్షలు పోస్టమార్టం జరిపి అప్పగించాల్సి ఉంటుంది. కానీ వైద్యులు ఇవేం పట్టించుకోలేదు. బాలుని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆస్పత్రి వద్దనున్న అంబులెన్స్‌ను కూడా ఇవ్వలేదని చిన్నారి తండ్రి రహీం తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న అత్యాచారాల నిరోధక సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.ఎస్. ఉగ్రప్ప సోమవారం బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుఉన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉగ్రప్ప తెలిపారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మోటమ్మ, రాణిసతీష్, బెంగళూరు గ్రామీన ఎస్పీ. అమిత్ సింగ్ ఉన్నారు.