చెప్పులతో కొట్టి.. ఉమ్మి నాకించి.. | Nalanda man allegedly made to lick spit for entering influential . | Sakshi
Sakshi News home page

చెప్పులతో కొట్టి.. ఉమ్మి నాకించి..

Published Sat, Oct 21 2017 2:00 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Nalanda man allegedly made to lick spit for entering influential . - Sakshi

బిహార్‌షరీఫ్‌: అనుమతి లేకుండా తమ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని కొందరు పెద్ద మనుషులు చెప్పులతో కొట్టించి, నేలపై ఉమ్మేసిన లాలాజలాన్ని అతని చేత నాకించిన దారుణ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. నలందా జిల్లాలోని ఆజాద్‌పూర్‌ గ్రామంలో క్షురకుడిగా పనిచేస్తున్న  మహేశ్‌ ఠాకూర్‌(54) బుధవారం ఊర్లో పలుకుబడి ఉన్న ధర్మేంద్ర యాదవ్‌ అనే వ్యక్తి బంధువుల ఇంటికెళ్లాడు.

ఇంటిబయట నిల్చొని ఎంతసేపు పిలిచినప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో లోపలకు వెళ్లాడు. తాము లేని సమయంలో ఇంట్లోకి మహేశ్‌ వెళ్లడంపై ఆగ్రహించిన యాదవ్‌ బంధువులు, సర్పంచ్‌ దయానంద్‌ మాంఝీతో కలిసి అతన్ని శిక్షించాలని నిర్ణయించారు. మరుసటి రోజు పంచాయితీ ఏర్పాటు చేసి అందరిముందు మహిళలతో చెప్పుదెబ్బలు కొట్టించారు. అంతటితో ఆగకుండా ప్రాయశ్చిత్తంగా లాలాజలాన్ని నేలపై ఉమ్మివేసి దాన్ని నాకాల్సిందిగా మహేశ్‌ను ఆదేశించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో జిల్లా మేజిస్ట్రేట్‌ ఎస్‌ఎం త్యాగరాజన్, ఎస్పీ సుధీర్‌ కుమార్‌లు  నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. దీంతో బాధితుడి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. మాంఝీ, యాదవ్‌ సహా 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులందరూ పరారీలో ఉన్నారనీ, ఈ కేసు విచారణ బాధ్యతల్ని నూర్‌సరై స్టేషన్‌ ఇన్‌చార్జ్‌కు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement