written explanation
-
ఈసీ తీరుపై సీఐసీ విస్మయం
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే. తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది. -
ఏడాది చివరిలోగా విచారణ ముగించండి: సుప్రీంకోర్టు
ఎమ్మెల్యే ఆర్.కె.రోజా శాసనసభ్యత్వం చెల్లదంటూ వై.వి.రాయుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెండువారాల్లో లిఖితపూర్వక వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. అలాగే ఈ ఏడాది చివరినాటికి విచారణ పూర్తిచేయాలని హైకోర్టుకు సూచించింది. నగరి నుంచి తన ఎన్నికకు సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణపై ఎమ్మెల్యే ఆర్.కె.రోజా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. రోజా ఎన్నిక రద్దు చేయాలంటూ రాయుడు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రాతపూర్వక వివరణ ఇచ్చేందుకు హైకోర్టు అవకాశం ఇవ్వలేదని, ఎన్నికల పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, తిరస్కరించాలంటూ రోజా హైకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే రాయుడు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌తో పాటు ఈ అప్లికేషన్‌ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. దీంతో రోజా హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయుడి పిటిషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను సోమవారం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు వి.గిరి, రమేశ్ అల్లంకి తమ వాదనలు వినిపిస్తూ హైకోర్టు తమ మధ్యంతర దరఖాస్తును పరిష్కరించకుండా ప్రధాన పిటిషన్‌కు జత చేయడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు విచారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెబుతూ, రాయుడు సవాలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్నామని పేర్కొంది. అలాగే ఎన్నిక పిటిషన్‌పై విచారణను ఈ ఏడాది చివరిలోగా పూర్తిచేయాలని సూచించింది.