wrong tweet
-
స్పెల్లింగ్ మిస్టెక్తో బుక్కైన పాక్ క్రికెటర్
ఎన్ని పండుగలున్నా.. జెండా పండుగను కులమతాలకతీతంగా దేశం మొత్తం కలిసి సంబురంగా చేసుకుంటుంది. ఆగష్టు 15న భారత దేశం.. జిన్నా ఒత్తిడితో అధికార బదలాయింపు ఒకరోజు ముందు జరగడం, మరికొన్ని కారణాలతో 14వ తేదీనే పాకిస్తాన్‌లు స్వాతంత్య్ర సంబురాలు జరుపుతాయని తెలిసిందే. కాబట్టి, ఇవాళ పాక్ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భంగా క్రికెటర్ కమ్రాన్ అక్మల్ చేసిన ఓ ట్వీట్.. ట్రోలింగ్‌కు దారి తీసింది. శనివారం పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్Independence డేకి బదులు.. ఇండిపెన్స్Indepence అంటూ ఇంగ్లీష్‌లో తప్పు ఫొటో పోస్ట్ చేశాడు కమ్రాన్. మూములుగానే పాక్ క్రికెటర్లను ఎప్పుడు.. ఎక్కడ దొరుకుతారా? అని ఎదురు చూస్తున్న మన నెటిజన్స్.. ఈ తప్పును గుర్తించారు. pic.twitter.com/ZG397jz3RT — Kamran Akmal (@KamiAkmal23) August 13, 2021 Perfect revenge on Britishers 👏🏻 Proud of you Brother @KamiAkmal23 pic.twitter.com/uYFZq8QifX — Unsocially M’idiotic (@m_idiotic) August 13, 2021 Respect for you brother, you the only person taking revenge from British for what they did to our country by doing same to their language — Scar (@Scar3rd) August 13, 2021 Pakistan waalon ka apna ek alag english dictionary.. respect! — Keh Ke Peheno (@coolfunnytshirt) August 14, 2021 Meet English He/She was really a nice person But now he/She is no more.... pic.twitter.com/jTd1k1HQnk — खडकवासल्याचा कोलंबस🇮🇳 (@aapalacolumbus) August 14, 2021 Carrying on Umar's Legacy 👌 Time to modify the dictionary — YOGESH (@i_yogesh22) August 13, 2021 ఇంకేం సోషల్ మీడియాలో కమ్రాన్ అక్మల్‌ను ఇలా ట్రోల్ చేసేస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు. కానీ, ఇలా గుర్తించే పెద్ద తప్పు.. అదీ దేశం మీద వేయడంతో పాక్‌లోనూ కొందరు కమ్రాన్ విమర్శిస్తుండడం విశేషం. -
Mansukh Mandaviya: కొత్త ఆరోగ్య మంత్రికి ట్రోల్స్ వెల్కమ్
ఈరోజుల్లో చదువుతో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ, ఆ అర్హతనే ఆధారంగా చేసుకుని విమర్శిస్తున్న రోజులివి. ముఖ్యంగా రాజకీయాల్లో నేతల ఎడ్యుకేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. అలాంటిది.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆఫీస్‌లో అడుగుపెట్టిన మన్షుక్ లక్ష్మణ్ మాండవీయకు ట్రోల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. అందుకు కారణం.. ఆంగ్ల భాషలో ఆయన పరిజ్ఞానం చర్చకు రావడమే. గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లలో ఆంగ్లపు అక్షర దోషాలు ఉన్నాయి. మామూలుగా ఒకటి రెండు స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉంటే ఫర్వాలేదు. కానీ, ఏకంగా అర్థం మారిపోయేట్లుగా ఉండడం, కొన్ని చోట్ల స్పెల్లింగ్‌లు దారుణంగా ఉన్నాయి. Tray and tray will be success . — Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2014 Mr. Rahul Ji, great grand son of Mahatma Gandhi already wrote you that RSS was not at all responsible for death of Gandhiji — Mansukh Mandaviya (@mansukhmandviya) March 10, 2014 ఇక అందుకు సంబంధించి స్రీ్కన్ షాట్స్ కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎంత వరకు ఫేక్ ఉన్నాయో తెలియదు కానీ.. ఒకటి రెండు మాత్రం ఆయన ఒరిజినల్ అకౌంట్‌కు చెందినవే కావడంతో.. మొత్తం నిజమై ఉంటాయని భావిస్తున్నారు. మరికొన్ని డిలీట్ అయి ఉన్నాయి. ఇక గుజరాత్‌కు చెందిన మన్షుక్ మాండవీయ.. ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లు ఆయన ప్రొఫైల్‌లో ఉంది. మరోవైపు బీజేపీ నేతలు, అభిమానులు మాత్రం మంత్రికి సపోర్ట్‌గా రీట్వీట్లు చేస్తున్నారు. He is our Health of Minister (#MansukhEnglish)🤦🙄#दर्जासमजूनघ्या #mansukhmandaviya @ShivsenaComms #CabinetReshuffle2021 #CabinetExpansion2021 pic.twitter.com/R8tpbEVd4I — 𝐏𝐫𝐚𝐭𝐢𝐤 𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚 𝐊𝐚𝐥𝐚𝐬𝐤𝐚𝐫 (@PratiKkalaskar_) July 8, 2021 Several yers back i applied for a job They canceled me because of my Vary good ingles accent... Today me is halth Minister of the Entire duniya 😌#CabinetReshuffle#MansukhEnglish#MansukhMandviya#englishfans — Mansukh मंद | वाया Parody (@PranavThe2nd) July 7, 2021 Mansukh Mandaviya is our Health of Minister pic.twitter.com/mpYMEgI0DQ — Joy (@Joydas) July 7, 2021 -
లేట్ ట్వీట్.. సచిన్‌నూ వదల్లేదు!
సాక్షి, స్పోర్ట్స్ : సెలబ్రిటీలు ఎవరైనా సరే వారు చేసే తప్పిదాలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం తప్పటం లేదు. ఆ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ఇప్పుడు చేరిపోయారు. అందుకు కారణం సోమవారం ఆయన చేసిన ఓ ట్వీట్. హోరాహోరీగా సాగిన కాన్పూర్ వన్డేలో భారత్ ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి ఊపు ఇచ్చింది. భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ జరిగింది ఆదివారం అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం ఆలస్యంగా సోమవారం ట్వీట్ చేశారు. ఇంకేముంది క్రికెట్ దేవుడు అని చూడకుండా కొందరు ట్రోల్ చేసి పడేశారు. నువ్వా-నేనా అన్నట్టు సాగే ఈ మ్యాచ్‌లో భారత్‌దే విజయమని సచిన్ చేసిన ట్వీట్ పై కౌంటర్లు ఎలా ఉన్నాయంటే... - సచిన్ అంత సరిగ్గా ఎలా ఊహించారు - సర్ మీరు చూస్తున్నది రిపీట్ టెలికాస్టా? - సచిన్ నువ్వు దేవుడివి. వచ్చే ఏడాది జరిగే సిరీస్‌ను కూడా నీవు చూడగలవు - సర్ ముందు మీ సెటప్ బాక్స్ మార్చుకోండి ఇలా కొందరు వ్యంగ్యంగా ట్వీట్లు చేసేశారు. -
ఒక తప్పుడు ట్వీట్.. ఎంతపని చేసింది!
ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుడు ట్వీట్ వల్ల ఐపీఎల్లో బంగారు భవిష్యత్తు కాస్తా నాశనం అయిపోయింది. కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదుగుదామని భావించిన మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ హర్‌ప్రీత్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి. రంజీ ట్రోఫీలో 8 మ్యాచ్‌లు ఆడి 537 పరుగులు చేసిన హర్‌ప్రీత్.. మధ్యప్రదేశ్ జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంధేరి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు కారుతో దూసుకెళ్లిన వ్యక్తి అతడేనని, అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఒక తప్పుడు ట్వీట్ రావడంతో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా హర్‌ప్రీత్‌ను తీసుకోలేదు. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ జట్లకు ఆడిన హర్‌ప్రీత్ నిజానికి ఏ కేసులోనూ అరెస్టు కాలేదు. ముంబైలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు వెళ్లింది అతడు కాదు, హర్మీత్ సింగ్ అనే మరో యువ క్రికెటర్. అతడు ఇండియా అండర్-19 జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. పేరు దగ్గరగా ఉండటంతో హర్ప్రీతే ఈ నేరం చేశాడంటూ ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా చేరింది. నిజానికి తాము హర్‌ప్రీత్‌ను కొందామనుకున్నామని, కానీ అతడి అరెస్టు వార్తలు విని ఫ్రాంచైజీకి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ఊరుకున్నామని.. కానీ వేలం ముగిసిన తర్వాత అసలు నేరస్తుడు హర్‌ప్రీత్ కాదు, హర్మీత్ అన్న విషయం తెలిసిందని ఒక ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఇప్పుడు తన పేరుతో పాటు తన కెరీర్ కూడా పాడైపోయిందని, ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలని హర్‌ప్రీత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడుగుతున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను ఐపీఎల్ గురించి బాధ పడట్లేదని, చివరకు గూగుల్‌లో తన పేరు సెర్చ్ చేసినా తాను అరెస్టయినట్లే వస్తోందని అన్నాడు. -
‘ట్వీట్’లో కాలేసిన సీఎం కార్యాలయ సిబ్బంది
న్యూఢిల్లీ: ఓ వాక్యములో చిన్న పదం తప్పు దొర్లితే అర్థం మారిపోతుంది. బాధ్యత గల హోదాలో ఉన్నవారు ఇలాంటి పొరపాట్లు చేస్తే వివాదం అవుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం సిబ్బంది పొరపాటుగా చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చైనాకు చెందిన ప్రతినిధి బృందం కర్ణాటక సీఎంను కలిసింది. బెంగళూరు అభివృద్ధి ఇతర విషయాల గురించి వారు సిద్ధరామయ్యతో చర్చించారు. అనంతరం కర్ణాటక సీఎం పేరుతో ఆయన కార్యాలయ సిబ్బంది.. ‘చైనాలోని సియాచిన్ ప్రావిన్స్ నుంచి లీ జోంగ్ సారథ్యంలో వచ్చిన బృందంతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పలు విషయాలు చర్చించారు’ అని ట్వీట్ చేసింది. విషయం ఏంటంటే సియాచిన్ అనేది వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో గల హిమాలయ పర్వత శ్రేణి. చైనాలో సిచువాన్ అనే ప్రావిన్స్ ఉంది. కర్ణాటకకు వచ్చిన బృందం ఈ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు. కాగా కర్ణాటక సీఎం కార్యాలయం చేసిన ట్వీట్లో సియాచిన్ ప్రాంతం చైనాలో ఉన్నట్టుగా అర్థం వచ్చేలా ఉంది. ఈ ట్వీట్ చూడగానే రాజకీయ వర్గాలు, నెటిజన్లు విమర్శలకు పదును పెట్టారు. ‘సియాచిన్ చైనాలో ఉందా? ప్రతినిధి బృందం సిచువాన్ ప్రావిన్స్‌కు చెందినవారు కావచ్చు’ అని కొందరు ట్వీట్ చేశారు. ‘ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సియాచిన్‌కు, సిచువాన్‌కు గల తేడా చెప్పేవారు లేరా?’ అని మరికొందరు విమర్శించారు.