y. vishweswar reddy
-
'పుట్టినరోజున ఇచ్చిన మాటైనా నిలబెట్టుకో బాబూ'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో హంద్రీ-నీవాకు రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? అంటూ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కనీసం పుట్టినరోజు నాడు ఇచ్చిన మాటనైనా నిలబెట్టుకోవాలన్నారు. వైఎస్ హయాంలోనే హంద్రీ-నీవా పనులు వేగవంతంగా జరిగాయని ఆయన అన్నారు. హంద్రీ-నీవా కాలయాపనకు మీరు కారణం కాదా? అంటూ ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. ' సింగపూర్, జపాన్ పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచించండి' అంటూ హితవు పలికారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని వై. విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'పుట్టినరోజు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకో'
-
బరితెగించిన పయ్యావుల: విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బరితెగించి వ్యవహరిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బోయ సూరయ్య హత్య కేసు నుంచి తన సోదరుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. కేసు ఉపసంహరించుకోనందుకు సూరయ్య కుటుంబీకులపై అక్రమ కేసు బనాచించారని అన్నారు. సూరయ్య హత్యతో పయ్యావుల శీనప్పకు సంబంధం ఉందని సీఐడీ తేల్చిందని చెప్పారు. పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు బోయ సూరయ్య... ఉరవకొండ మండలం వై.రాంపురంలో 2009 ఆగస్టు 24న దారుణ హత్యకు గురయ్యారు. నిందితుల్లో ఒకరైన పయ్యావుల శీనప్ప తన పేరును చార్జిషీటు నుంచి తొలగింపజేసేందుకు శతవిధాలా ప్రయత్ని విఫలమయ్యాడు. సూరయ్య కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో కక్ష సాధింపునకు దిగాడు.