Yale University
-
‘మేల్’కోండి!
సాక్షి, హైదరాబాద్: పేరుకు మగమహారాజులే అయినా..కరోనా విషయానికొచ్చేసరికి బలహీనులే అట. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ. త్వరగా కోలుకోవడంలో మహిళలు ముందంజలో ఉండగా, మరణిస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. కోవిడ్ సోకకుండా తట్టుకునే రోగనిరోధశక్తి మహిళల్లో అధికంగా ఉండడంతోపాటు పురుషులతో పోల్చితే మహిళల్లోనే మెరుగైన ‘ఇమ్యూన్ రెస్పాన్స్’ ఉన్నట్టు తాజాగా అమె రికా యేల్ యూనివర్సిటీ ఉమెన్స్ హెల్త్ రీసె ర్చ్‌లో వెల్లడైంది. కోవిడ్ పాజిటివ్ మహిళా పేషెంట్లలో పురుషుల కంటే టీ–సెల్ యాక్టివేషన్ చురుకుగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తిం చారు. మానవశరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మలచుకోవడంలో టీ–లింపోసైట్స్‌గా నూ పిలిచే ఈ–సెల్స్ ప్రధాన భూమికను పో షిస్తాయి. శరీరంలోని వైరస్ సోకిన కణాలను ప్రత్యక్షంగా చంపడంతోపాటు ఇతర రోగనిరోధక కణాలను యాక్టివేట్ చేయడంలోనూ టీ–సెల్స్ పాత్ర నిర్వహిస్తాయి. టీ–సెల్స్ నెమ్మదిగా లేదా బలహీనంగా స్పందించిన సందర్భాల్లో మహిళా పేషెంట్ల కంటే మగవారిలోనే తీవ్రప్రభావం చూపడం తోపాటు మరణాలకు కారణమవుతున్నట్టుగా తాము జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పేషెంట్లపై యేల్ పరిశీలన యేల్ న్యూహెవెన్ హాస్పిటల్లో స్వల్ప లక్షణాలతోపాటు ఒక మోస్తరు వ్యాధి సోకిన కోవిడ్–19 పేషెంట్లపై అధ్యయనం నిర్వహించారు. కోవిడ్–19 ఇన్ఫెక్షన్ల విషయంలో మహిళలు, పురుషుల్లో తేడాలున్నట్టు, పెద్ద వయసున్న మగవారు ఎక్కువగా ప్రభావితమైనట్టు సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ‘ఇమ్యూన్ రెస్పాన్స్’ అనేది లింగభేదాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న దానిపై మరింత లోతైన పరిశీలన నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ పేషెంట్లలో రోగనిరోధక విధానం మహిళలు, పురుషుల్లో భిన్నంగా ఉన్నట్టు, ఈ కారణంగా మగవారిలో ఈ వ్యాధి తీవ్రత ప్రభావం ఎక్కువయ్యేందుకు అవకాశాలున్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. కరోనా బారిన పడని వారితోపాటు పాజిటివ్ రోగుల రక్తనమూనాలు, ముక్కులు, నోళ్లలోంచి ఇతర నమూనాలను సేకరించి వారిలో తొలుత రోగ నిరోధక స్పందనలు ఎలా ఉన్నాయి. వ్యాధి తీవ్ర దశకు చేరుకుంటున్నవారిలో, కోలుకుంటున్న వారిలో ఎలా ఉన్నాయన్న దాన్ని ఈ పరిశోధకులు పరిశీలించారు. ఇమ్యూన్ రెస్పాన్స్ భిన్నం వ్యాధి సోకిన తొలిదశల్లో మహిళలు, పురుషుల్లో ‘ఇమ్యూన్ రెస్పాన్స్’లు భిన్నంగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ సోకిన సందర్భంగా వైరస్‌తో పోరాడి వాటి నిర్మూలనకు కృషి చేసే టీ–సెల్, తెల్లరక్తకణాల యాక్టివేషన్ రోగనిరోధక వ్యవస్థగా పురుషుల కంటే మహిళల్లోనే వేగంగా ఏర్పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. టీ–సెల్స్ స్పందన బలహీనంగా ఉన్న మగవారిలో కోవిడ్ తీవ్రత పెరగడంతోపాటు మృత్యువాత పడే పరిస్థితులు ఎదురుకావొచ్చని చెబుతున్నారు. వయసు పైబడిన మహిళల కంటే పురుషుల్లోనే టీ–సెల్ స్పందన తక్కువగా ఉందని కూడా ఈ పరిశోధనలో తేలింది. -
పరిశోధన పేరుతో కీచక ప్రొఫెసర్ వేధింపులు..
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ సైకియాట్రి ప్రొఫెసర్ రెడ్మండ్ పరిశోధన పేరుతో విద్యార్ధులను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. విద్యార్ధులకు ఆర్థిక సాయం అందిస్తూ, పరిశోధనలో సహకరిస్తానని లోబరుచుకుని వారిని కరీబియన్ దీవుల్లోని తన రీసెర్చి సైట్‌కి తీసుకువెళ్లి సదరు ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్న ఉదంతం వర్సిటీ అధికారులను షాక్‌కు గురిచేసింది. 1992 నుంచి ఈ కీచక ప్రొఫెసర్ ఇదే తంతు కొనసాగిస్తున్నా యేల్ వర్సిటీ అధికారులు పసిగట్టలేకపోవడం గమనార్హం. విద్యార్ధులను దశాబ్ధాల తరబడి లైంగికంగా వేధిస్తున్న ప్రొఫెసర్ లీలలు వర్సిటీ అధికారులు ఇటీవల వెల్లడించిన 54 పేజీల నివేదికలో బహిర్గతమయ్యాయి. దాదాపు 44 ఏళ్లుగా యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు అనుబంధంగా సైకియాట్రీ పాఠాలు బోధిస్తున్న రెడ్మండ్ నీచబుద్ధి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రెడ్మండ్ 13 మంది వరకూ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులను లైంగికంగా వేధించినట్టు వెల్లడైంది. 38 మంది ప్రస్తుత, పూర్వ విద్యార్ధులు సహా 110 మంది సాక్షులను విచారించిన అనంతరం ఈ షాకింగ్ విషయాలు వెల్లడించాయి. వర్సిటీ అధికారుల నివేదికకు ముందే కీచక ప్రొఫెసర్ బాగోతాన్ని యేల్ డైలీ న్యూస్ పత్రిక సవివరంగా ప్రచురించింది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రెడ్మండ్ తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కథనాలను వండివార్చారని ఆరోపించారు. యేల్ క్యాంపస్ నుంచి రెడ్మండ్ను బహిష్కరించినా రిటైర్డ్ ఫ్యాకల్టీ మెంబర్‌గా అన్ని ప్రయోజనాలను ఆయన అనుభవిస్తున్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ నేరారోపణలు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ ప్రొఫెసర్ రెడ్మండ్ చేష్టలను యేల్ వర్సిటీ ప్రెసిడెంట్ పీటర్ సలోవే ఖండించారు. రెడ్మండ్ ప్రవర్తన పట్ల యేల్ తరపున తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. రెడ్మండ్ ప్రవర్తన తొలిసారిగా వెలుగుచూసినప్పుడే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండేదని అన్నారు. 994లోనే రెడ్మండ్ విద్యార్ధులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మెడికల్ స్కూల్ సైకియాట్రి విభాగాధిపతికి పలువురు అండర్గ్రాడ్యుయేట్ విద్యార్ధులు తొలిసారిగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో తన సమ్మర్ రీసెర్చి కార్యక్రమాన్ని మూసివేస్తానని రెడ్మండ్ హామీ ఇచ్చినా ఆ పనికి పూనుకోలేదు. యేల్ అధికారులు సైతం ఆయన రీసెర్చి ప్రోగ్రాంను నిలిపివేసేలా చర్యలు చేపట్టలేదని నివేదిక ఎత్తిచూపింది. 1994లోనే ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు సరైన పర్యవేక్షణ చేపడితే రెడ్మండ్ విపరీత ప్రవర్తనకు అప్పుడే అడ్డుకట్ట పడేదని నివేదిక స్పష్టం చేసింది. 2018లో రెడ్మండ్పై ఓ విద్యార్ధి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేలోపుగా అదే ఏడాది రెడ్మండ్ పదవీవిరమణ చేయడంతో విచారణ అతీగతీ లేకుండా పోయిందనే విమర్శలు వినిపించాయి. ప్రొఫెసర్ల లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసినా వారిని విధుల్లో కొనసాగనివ్వడం పట్ల విద్యార్ధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అచ్చం అమ్మలాగే ఇషా అంబానీ
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలికాం మార్కెట్లో జియో సంచలనాలు సృష్టిస్తున్న దగ్గర్నుంచి ఇషా అంబానీ పేరు మారుమ్రోగుతోంది. జియో ఐడియా తన కూతురిదేనని పలుమార్లు ముఖేష్ పలు వేదికలపై వెల్లడించారు కూడా. రిలయన్స్ జియో డైరెక్టర్‌గా ఇషా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె పోలికలు మాత్రం అచ్చం తల్లి నీతా అంబానీ లాంటివేనట. తన తల్లి కోరిక మేరకు అటు చదువును, ఇటు ఉద్యోగాన్ని ఆమె ఎంతో విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారని తెలిసింది. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న నీతా, ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిందని, ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేస్తున్నట్టు తెలిపారు. అటు ఎంబీఏ క్లాసెస్‌కు హాజరు అవుతూనే, బింగ్ అనే స్టాన్ఫోర్డ్ నర్సరీలో ఉద్యోగం చేస్తున్నట్టు నీతా వెల్లడించారు. అక్కడ తాను టీచర్‌గా వర్క్ చేయనున్నట్టు తెలిపారు. నీతా అంబానీ కూడా ముఖేష్ అంబానీని కలిసినప్పుడు స్కూల్ టీచర్‌గానే పనిచేసేవారు. రిలయన్స్ జియోలో డైరెక్టర్ హోదా, స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ, నర్సరీలో ఉద్యోగం అన్నింటిన్నీ విజయవంతంగా చేపడుతున్నట్టు తెలిసింది. దీంతో అచ్చం అమ్మలాగే, కూతురు అంటూ పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. -
ఎర్త్ 2.0 దిశగా అడుగులు!
వాషింగ్టన్: భూమిని పోలిన మరో గ్రహాన్ని (ఎర్త్ 2.0) గుర్తించడంలో మార్గం సుగమమైంది. నక్షత్రాల రసాయనిక సమ్మేళనాన్ని విశ్లేషించే సరికొత్త పద్ధతి ద్వారా ఖగోళంలో భూమి వంటి గ్రహాలను గుర్తించడం తేలికవబోతోందని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి పరిచిన ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం (కంప్యూటేషనల్ మోడలింగ్ టెక్నిక్) తో నక్షత్రాల పూర్తి స్థాయి రసాయనిక స్థితిని తెలుసుకోవచ్చని, ఈ విధానంతో గ్రహం ఎప్పుడు ఏర్పడిందనే విషయాలను పూర్తిగా అధ్యయనం చేయొచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిద్వారా సౌర కుటుంబానికి వెలుపల ఉండే గ్రహంపై నివాస యోగ్య పరిస్థితులు, జీవుల పరిణామ స్థితిగతుల గురించి పూర్తి వివరాలను రాబట్టవచ్చని భావిస్తున్నారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఇప్పటికే నక్షత్రాల్లోని 15 మూలకాల ద్వారా 16 వందల నక్షత్రాలకు సంబంధించిన ఉష్ణోగ్రత, ఉపరితల గురుత్వాకర్షణ, పరిభ్రమణ వేగం, రసాయనిక సమ్మేళనం వంటి అంశాలను నిర్ధారించారు. -
ఊబకాయానికి..సూక్ష్మజీవులకు లింకు!
ఎంత మితంగా తిన్నా లావెక్కుతున్నారా.. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా.. అయితే దానికి కారణం మీ పేగుల్లోని సూక్ష్మజీవులే! తినే ఆహారంలోని పోషకాలు ఒంట పట్టేందుకు పేగుల్లోని సూక్ష్మజీవులు (మైక్రో బయోమ్) దోహదపడుతాయనే విషయం తెలిసిందే. అయితే ఈ మైక్రో బయోమ్లో తేడా వస్తే అనేక సమస్యలు వస్తాయని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే జంతువుల్లో ఎసిటేట్ అనే రసాయనాన్ని అధిక మొత్తంలో కనుగొన్నారు. అలాగే ఎసిటేట్‌ను శరీరంలోకి ఎక్కించినపుడు క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయని గుర్తించారు. అయితే దీనికి కారణాలు తెలియరాలేదు.ఎసిటేట్‌ను నేరుగా మెదడులోకి ఎక్కిస్తే పర సహనుభూత నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతోందని పరిశోధకులు వివరించారు. అతిగా తినడాన్ని ప్రేరేపించే గ్యాస్ట్రిన్, గ్రెలిన్ అనే హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. -
అమెరికాలో టాప్-20 కాలేజీలివే