younger missing
-
యువకుడి అదృశ్యంపై కేసు
పెనుకొండ రూరల్ : మరువపల్లికి చేందిన జీసీ.పవన్‌కుమార్(20) కనిపించడం లేదని అతడి తండ్రి గొల్ల రాము బుధవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగన్న తెలిపారు. -
జీడిపల్లి రిజర్వాయర్‌లో యువకుడు గల్లంతు
బెళుగుప్ప : జీడిపల్లి రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. బాధితుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన మేరకు.. గంగవరం గ్రామానికి చెందిన కంసలి లక్ష్మప్ప, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఏడాది లక్ష్మప్ప అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో పెద్ద కుమారుడు వినయ్ గాలిమరల కంపెనీలో దినసరి కూలీగాను, రెండవ కుమారుడు రాజశేఖర్ (23) హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో అటెండర్‌గాను పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం తన మిత్రులతో కలసి రాజశేఖర్ జీడిపల్లి రిజర్వాయర్‌కు వెళ్లి అక్కడే విందు చేసుకున్నారు. అనంతరం తిరిగి వెళుతూ రిజర్వాయర్ మరువ వద్ద స్నేహితులతో కలసి ఈతకు దిగాడు. అరకొరగా ఈత వచ్చే రాజశేఖర్ నీటిలో మునిగాక ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో స్థానికులు, రాజశేఖర్ బంధువులు మరువ ప్రాంతంలో గాలింపు చేపట్టినా జాడ కనిపించలేదు. -
సాగర్ కాలువలో యువకుడి గల్లంతు
= క్షేమంగా బయటపడిన నలుగురు యువకులు = చీమకుర్తి సమీపంలోని చీమలమర్రి సాగర్ కాలువలో ఘటన .. = గుంటూరుకు కారులో వెళ్తూ మార్గమధ్యంలో ఈతకు దిగిన వైనం = గల్లంతైన యువకుని కోసం సాగర్ పొడవునా గాలిస్తున్న గజ ఈతగాళ్లు = అందరూ అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులే సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా) : అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఐదుగురు యువకుల్లో ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చీమలమర్రి సమీపంలోని సాగర్ కాలువలో గల్లంతయ్యాడు. తాడిపత్రికి చెందిన పోసా అరుణ్, పూల సురేశ్, గుత్తా రాకేశ్,కావేటి రామాంజనేయులు, నందికం హరి కలసి ఓ కారులో గుంటూరు బయల్దేరారు. శనివారం ఉదయం మార్గమధ్యంలోని చీమలమర్రి వద్ద గల సాగర్ కాలువ వద్దకు రాగానే కారు ఆపారు. ఈత కోసం కాలువలోకి దిగారు. కొద్ది సేపటి తర్వాత నందికం హరి(19) కాలువలో గల్లంతై డ్రాప్లో పyì పోయాడు. కాపాడేందుకు అతని సొంత బావ కావేటి రామాంజనేయులు కూడా అందులోకి దూకారు. బామ్మర్ది కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. పైగా అతడు కూడా ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించి మిగిలిన ముగ్గురూ బయటకు వచ్చారు. వెంటనే ఓ బెల్ట్ సాయంతో రామాంజనేయులును అతికష్టమ్మీద బయటకు తీశారు. హృదయ విదారకం డ్రాపులో హరి కొద్దిసేపు కొట్టుమిట్టాడుతుండటాన్ని తోటి స్నేహితులు చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈత రాక రోడ్డున వెళ్లే ప్రతీ ఒక్కరినీ కాపాడాలంటూ వేడుకున్నారు. అయితే డ్రాప్‌లోకి దిగేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. బామ్మర్ది గల్లంతుపై బావ రామాంజనేయులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు తన భార్యకు ఏం సమాధానం చెప్పాలంటూ కుమిలిపోయారు. చీమలమర్రి డ్రాప్‌ల వద్ద గాలింపు చీమలమర్రి డ్రాప్‌ల నుంచి హరి దిగువకు కొట్టుకెళ్లినట్లు తెలుసుకున్న సీఐ మురళి, సంతనూతలపాడు ఎస్ఐ హుస్సేన్‌బాషా తమ సిబ్బందితో కలసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. రామతీర్థం జలాశయం వద్ద నీటి వేగాన్ని తగ్గించారు. సంతనూతలపాడు మండలం చండ్రపాలెం ఎన్ఎస్పీ కెనాల్ వద్ద గజ ఈతగాళ్లు హరి ఆచూకీ కోసం గాలించారు. రాత్రి పొద్దుపోయే వరకూ గాలించినా అతని ఆచూకీ దొరకలేదని సీఐ తెలిపారు. ఈతముక్కల మేజర్ వరకు వెతికిస్తున్నట్లు వివరించారు. -
జీడిపల్లి రిజర్వాయర్ లో యువకుడి గల్లంతు
బెళుగుప్ప : మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు పుష్కర స్నానానికి వచ్చిన ప్రదీప్ (18) అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరంలోని నాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న ప్రదీప్ తన మిత్రులు, సమీప బంధువులతో కలిసి ఆటోలో పుష్కర స్నానానికి జీడిపల్లి రిజర్వాయర్‌కు మంగళవారం వచ్చాడు. లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు గాలించినా ఫలితం లేక పోయింది. విషయాన్ని ప్రదీప్ తల్లి కృష్ణమ్మకు తెలిపారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెళుగుప్ప ఇన్చార్జ్ డీఎస్పీ చలపతిరావు, ఇన్చార్జ్ ఎస్ఐ శంకర్‌రెడ్డి, ఏఎస్ఐ విజయనాయక్ రిజర్వాయర్ వద్దకు బుధవారం వెళ్లి ఆరా తీశారు. గజ ఈతగాళ్లతో గల్లంతైన ప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రదీప్ తండ్రి మునెప్ప మృతి చెందగా, తల్లి తమ్ముడితో కలసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేవాడని యువకుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.