Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On Chandrababu Over Aarogyasri Scheme1
‘ఆరోగ్యశ్రీ’పై ఎందుకింత కక్ష బాబూ?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ‘ఆరోగ్యశ్రీ’పై మీకు ఎందుకింత కక్ష? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? అంటూ చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బకొడుతున్నారు? కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు? అంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు.‘‘అధికారంలోకి రాగానే ఒక ప్లాన్‌ ప్రకారం “ఆరోగ్య శ్రీ’’ని నిర్వీర్యంచేసిన మాట వాస్తవం కాదా? మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్య శ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు?..ఈ 8 నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టుపెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెప్తున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైయస్సార్‌సీపీ సృష్టించిన 17 మెడికల్‌ కాలేజీలను స్కాంచేస్తూ మీ మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదంటారా?’’ అంటూ ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: సీజ్‌ ద షిప్‌.. సర్వం లాస్‌!‘‘ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీదారులు పడుతున్న అవస్తలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా చంద్రబాబు. మరి ఆరోగ్యశ్రీని వారికి అప్పగిస్తే.. వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే వారి ధ్యేయం అయినప్పుడు ప్రజాప్రయోజనాలు ఎంతవరకు సాధ్యం? కోవిడ్‌వంటి కొత్త రోగాలతో, అరుదైన వ్యాధులతో, ప్రమాదాల సమయంలో ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతోమందిని కాపాడుకుంది...ప్రొసీజర్ల జాబితా వ్యాధుల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం అనేక మార్లు ఆదుకుంది. మరి ప్రైవేటు కంపెనీలు ఈ పని చేయగలవా? మీరు చేయించగలరా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోయిన మాట వాస్తవం కాదా? ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి?..చంద్రబాబు.. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. కాని, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఏరోజైనా ఆ ప్రయత్నంచేశారా? పోనీ దివంగత మహానేత వైఎస్సార్‌ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతంచేసేలా ఒక్కపనైనా చేశారా? వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్స అందుకునే ప్రొసీజర్ల సంఖ్యను 1,000 నుంచి 3,257కి పెంచాం. మేనిఫెస్టోలో వాగ్దానంచేసినట్టుగా సంవత్సరాదాయం రూ.5లక్షలలోపు ఉన్నవారికి కూడా వర్తింపచేసి మధ్యతరగతివారికీ మేలు చేశాం. రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేశాం...ఐదేళ్లకాలంలో 45.1లక్షల మందికి రూ.13,421 కోట్లు ఖర్చుచేసి ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో పేషెంటుకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని తెచ్చి, దానికింద మరో రూ.1,465 కోట్లు అందించి రూ. 24.59 లక్షల మందికి ఆరోగ్య ఆసరాగా నిలిచాం. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్తగా అంబులెన్స్‌లు తీసుకు వచ్చి 104,108 సేవలను మేం మెరుగుపరిస్తే, మీరు నెలల తరబడి బకాయిలుపెట్టి ఆ అంబులెన్స్‌ సేవలను సైతం నిర్వీర్యం చేశారు...చంద్రబాబు.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో మీరు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మీర్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అంటూ ఇచ్చిన హామీలను ఎలాగూ ఎగరగొడుతున్నారు. మేం ఇచ్చిన పథకాలనూ రద్దుచేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా, ఉన్న గ్యారంటీని తీసేశారు. ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నాను.’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. @ncbn గారూ… “ఆరోగ్య శ్రీ’’పై మీకు ఎందుకింత కక్ష? పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారు? వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 7, 2025

Letter from network hospital owners to Aarogyasri CEO2
10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం!

సాక్షి, హైదరాబాద్‌: పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవలను నిలిపివేస్తామని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు భారీగా ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలి పాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (తెన్హా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వద్దిరాజు రాకేశ్‌ నేతృత్వంలోని ప్రతినిధులు ఆరోగ్య శ్రీ సీఈవోకు మెయిల్‌ ద్వారా లేఖ పంపారు. 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 368 నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కింద రాష్ట్రంలో 368 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించే ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ పథకాలను కూడా చేర్చారు. ఈ పథకాల కింద చేసే చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చెల్లిస్తుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.672 కోట్లు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అధిక ప్రచారంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగాయి. రేవంత్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ఇప్పటివరకు రూ.920 కోట్లు చెల్లించింది. ఇందులో పాత బకాయి రూ.672 కోట్లు పోను సుమారు రూ. 250 కోట్లు మాత్రమే కొత్తగా ఈ ఏడాది కాలంలో చెల్లించిందన్న మాట. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 368 ఆసుపత్రులకు కలిపి సుమారు రూ.1000 కోట్లకు పైగా రీయింబర్స్‌మెంట్‌ రావలసి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఒక్కో ఆసుపత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు గత సంవత్సరం జనవరి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్‌ స్పష్టం చేశారు. బకాయిలు రూ.500 కోట్లే: అధికారులు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1000 కోట్లు ఉన్నాయన్న వాదనను ఆరోగ్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. రూ.500 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఏడాది కాలంలో రూ.920 కోట్లు చెల్లించామని, డిసెంబర్‌ చివరి వారంలో కూడా రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు. 2014– 2023 మధ్య ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు సగటున రూ.52 కోట్ల చొప్పున గత సర్కారు చెల్లిస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్‌ నుంచి 2024 డిసెంబర్‌ మధ్య ప్రతి నెలా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు సగటున రూ.72 కోట్లు చొప్పున చెల్లించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

Sakshi Editorial On China HMPV Virus3
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!

మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) సెన్సెక్స్‌ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్‌ఫ్లూ, ఏవియన్‌ ఫ్లూ, కోవిడ్‌ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్‌ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్‌ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్‌ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్‌ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్‌ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్‌లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్‌ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్‌ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్‌ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ఐసీఎంఆర్‌) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్‌ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్‌ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్‌ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్‌ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్‌ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్‌ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్‌ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్‌ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్‌ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్‌–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్‌ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్‌ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్‌ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్‌నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్‌లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్‌ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్‌ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్‌లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం.

Telangana High Court verdict on ACB case in Formula E car race affair4
దర్యాప్తు అడ్డుకోలేం.. ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ కార్‌ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. దర్యాప్తును అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా 10 రోజుల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించే నిమిత్తం హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పాత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 20న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ గత నెల 20న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి డిసెంబర్‌ 31న తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం..మంగళవారం ఉదయం 35 పేజీల తీర్పు వెలువరించింది. సాక్ష్యాల సేకరణకు అవకాశం ఇవ్వాలి ‘ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54,88,87,043 నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్‌ఎండీఏను నాటి మంత్రి కేటీఆర్‌ ఆదేశించారనేది ఆరోపణ. దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ధి కోసం చెల్లించమన్నారా? మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా? అనేది దర్యాప్తులో తేలుతుంది. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా బదిలీ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. విచారణ జరిపేందుకు ఇవి సరిపోతాయి. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మరుసటి రోజే దాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన ఇలాంటి పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు చేయడానికి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేసిన హైకోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో కూడా డిసెంబర్‌ 18న ఫిర్యాదు, 19న ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయగా, 20న కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును తొందపడి అడ్డుకోవాలని ఈ కోర్టు అనుకోవడం లేదు. దురుద్దేశం, ఆరోపణలు, నిజాయితీ లేకుండా వ్యవహరించారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఇప్పుడు దర్యాప్తును అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ దశలో కోర్టుల మినీ ట్రయల్‌ సరికాదు నేరం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయల్‌ నిర్వహించడం సరికాదు. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్‌ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 528 మేరకు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టుకున్న అధికారం పరిమితం. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లోనే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు. ఈ కేసులో సెక్షన్‌ 528 కింద కోర్టు తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. ఆలస్యం జరిగిందనే కారణంతో కొట్టివేత కుదరదు భజన్‌లాల్, నీహారిక ఇ¯న్‌ఫ్రాస్ట్రక్చర్‌ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. 14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు అయ్యిందని చెప్పి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్‌ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకం. ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయడానికి అర్హమైనదా, కాదా అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. హెచ్‌ఎండీఏ అనేది ప్రత్యేక సంస్థ. ఆస్తులు ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోవడానికి అధికారమున్న సంస్థ. పురపాలక శాఖ పరిధిలోనే ఇది పని చేస్తుంది. ఆ శాఖ అప్పటి మంత్రిగా పిటిషనర్‌ అదీనంలోనే హెచ్‌ఎండీఏ విధులు నిర్వహించింది.. ఆదేశాలు పాటించింది. ఈ కేసులో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందినా, ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పిటిషనర్‌ వాదించారు. అయితే ఇది ఏసీబీ దర్యాప్తులో తేలే అంశం. మొత్తంగా చూస్తే ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు పొడిగించాలన్న కేటీఆర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రిమినల్‌ కేసుల్లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్‌ చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపే అధికారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదు.

Sakshi Guest Column On Artificial intelligence, wars, climate crisis5
ఈ ఏడాది మన ముందున్న సవాళ్లు

గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్‌ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్‌ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్‌లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్‌ షంషుద్దీన్‌ జబ్బార్‌ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్‌ అమెరికన్‌ సైన్యంలో పనిచేశాడు. జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్‌ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్‌ పౌరులు మూల్యం చెల్లించారు.ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్‌ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్‌ వెగాస్‌లోని ట్రంప్‌ హోటల్‌ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహత సహచరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది. ఇక మూడో ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్‌ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్‌ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్‌ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది. రెండవ ఘటనలో, గ్యాస్‌ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్‌కు గ్యాస్‌ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్‌పై దాని ప్రభావం మాటేమిటి?ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్‌ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్‌, న్యూయార్క్, లాస్‌ వెగాస్‌ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్‌–హమాస్, రష్యా–ఉక్రెయిన్‌ వివాదాన్ని ట్రంప్‌ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్‌ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్‌ పుతిన్‌ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి. పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్‌ పైప్‌లైన్‌ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్‌ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్‌ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్‌–హమాస్‌ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్‌ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్‌ ఇంటె లిజెన్స్‌. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ యువల్‌ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్‌జీపీటీ4ని ఓపెన్‌ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు. అయితే చాట్‌జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్‌రాబిట్‌ అనే వెబ్‌ పేజీకి యాక్సెస్‌ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్‌జీపీటీ4 ఔట్‌సోర్స్‌ చేసి, సర్వీస్‌ ప్రొవైడర్‌కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్‌ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వరాన్ని క్లోన్‌ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్‌ కాల్స్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్‌ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్‌ ఒక రాక్షసిని సృష్టించిందా?మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?శశి శేఖర్‌ వ్యాసకర్త ‘హిందుస్థాన్‌’ ప్రధాన సంపాదకుడు(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

 BRS KTR Sensational Comments On ACB Case Over Formula Car Race6
నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్‌ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race)లో తన క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసినందుకే ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్‌ వాళ్లు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR). ఇదే సమయంలో తనపై ఏసీబీ పెట్టింది అక్రమ కేసు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే, హైకోర్టు విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదని అన్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నాపై కక్ష సాధించాలనే లొట్టపీసు కేసు పెట్టారు. నాపై పెట్టింది అక్రమ కేసు. ఏసీబీ(Telangana ACB)ది తప్పుడు ఎఫ్‌ఐఆర్‌. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కొంత మంది మంత్రులైతే వాళ్లే న్యాయమూర్తులుగా మారిపోతున్నారు. వారే తీర్పులు చెబుతున్నారు. మంత్రులకు అంత ఉలికపాటు ఎందుకు?. క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసినందుకే నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్‌ వాళ్లు ఫీలవుతున్నారు. మీలాగా దివాళాకోరు పనిచేసే ఖర్మ నాకు పట్టలేదు. హైకోర్టు(telangana High Court) విచారణ చేసుకోండని చెప్పింది కానీ.. నేను నేరం చేశానని చెప్పలేదు. తెలంగాణ ఇమేజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్‌ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టమంటే రేవంత్‌ పారిపోయారు. రేవంత్‌ ఇంట్రెస్ట్‌ ఫార్ములా.. మా ఇంట్రెస్ట్‌ ఫార్మర్‌. ఇచ్చిన హామీలపై చిట్టి నాయుడు దృష్టి పెట్టాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తాం. అన్ని పార్టీలకు గ్రీన్‌కో ఎ‍న్నికల బాండ్లు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో లాయర్లతో విచారణకు వెళ్లాను. రాజ్యాంగపరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటాను. హైకోర్టు అనుమతి ఇస్తే లాయర్ల కలిసి విచారణకు తప్పకుండా వెళ్తాను. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాడుతాను. నేను ఏ తప్పూ చేయలేదు.. ఏ విచారణకైనా సిద్ధం. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరు అవుతాను. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీ విషయం అవినీతిలాగానే కనబడుతుంది. ఇది.. ఆరంభం మాత్రమే. చివరికి న్యాయమే గెలుస్తుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

India Have Got Terrific player: Irfan Pathan lauds Nitish Reddy BGT Success7
నితీశ్‌ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేశాడంటే.. తిరుగే ఉండదు!

టీమిండియా యువ సంచలనం నితీశ్‌ కుమార్‌ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్‌-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ రెడ్డి.బంగ్లాతో సిరీస్‌ సందర్భంగా..సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్‌ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్‌ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్‌ ఝులిపించి సత్తా చాటాడు.మెల్‌బోర్న్‌లో గుర్తుండిపోయే శతకంఇక మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్‌ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్‌ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన నితీశ్‌ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్‌ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్‌ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్‌ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆల్‌రౌండర్‌ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్‌ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్‌ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్‌ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్‌ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్‌ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్‌ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్‌ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్‌ ఉన్నంత వరకు.. : భజ్జీ

Saudi Mecca Got Extreme rain Fall Video Viral8
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు

జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025

Success Story About Wildberries Founder Tatyana Bakalchuk and Networth9
రూ.63 వేలకోట్లు ఆస్తి.. అద్దె ఇంట్లో నివాసం!: ఎవరో తెలుసా?

అనుకున్న పని సాధించాలంటే.. కృషి, పట్టుదల చాలా అవసరం. సంకల్పం బలంగా ఉండి.. లక్ష్యం వైపుగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ నీ సొంతం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే 'టట్యానా బకల్‌చుక్' (Tatyana Bakalchuk). బహుశా ఈ పేరు చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళలలో ఒకరు. ఈమె గురించి, ఈమె సాధించిన సక్సెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.వైల్డ్‌బెర్రీస్బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రష్యాలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగిన 'వైల్డ్‌బెర్రీస్' (Wildberries) నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం వ్యాపారవేత్త టట్యానా బకల్‌చుక్. ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళ. ఈమె నికర విలువ 7.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6,34,65,84,10,000.60వేల బ్రాండ్‌లుఅమెజాన్ కంపెనీలో పోలిస్తే.. వైల్డ్‌బెర్రీస్ రష్యాలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్‌. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి సుమారు 60వేల బ్రాండ్‌లను విక్రయిస్తున్నారు.రష్యాలోని అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజాన్ని స్థాపించిన టట్యానా బకల్‌చుక్ 2004లో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన ఓ ఇంగ్లీష్ టీచర్. ఈమె తన ప్రసూతి సెలవుల సమయంలో కుటుంబానికి మద్దతుగా నిలబడటానికి కేవలం రూ. 32వేలతో చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె భర్త వ్లాడిస్లావ్ బకల్చుక్, అతని స్నేహితుడి సహకారం కూడా తీసుకుంది.అపార్ట్మెంట్ నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌మొదట వీరి వ్యాపారం చిన్న అపార్ట్మెంట్ నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా వృద్ధి చెందింది. ఆ సమయంలో ఆమె జర్మన్ రిటైలర్ ఒట్టో సహకారం పొందింది. ఆన్‌లైన్‌లో దుస్తులను ఫోటో తీయడం, జాబితా చేయడం, స్వయంగా లాజిస్టిక్స్ చేయడం, పంపడానికి ప్రజా రవాణాను ఉపయోగించడం వంటి వాటితో ఈమె బిజినెస్ ఎదిగింది.ప్రారంభంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.. పట్టు వదలకుండా, 2008 ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా ఈమె తన వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు.2020లో మహమ్మారి సమయంలో సకాలంలో ఇంటి డెలివరీలను నిర్ధారించడానికి ఆమె 12,000 మంది అదనపు కార్మికులను నియమించింది. దీంతో కంపెనీ ఒక్కసారిగా గణనీయమైన వృద్ధి సాధించింది.99 వాటాకంపెనీలో టాట్యానా 99 వాటాను కలిగి ఉంది. మిగిలిన 1 శాతం వాటా ఆమె భర్తకు చెందినది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు రష్యాలో మాత్రమే కాకుండా.. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రదేశాలలో కూడా సేవలు అందిస్తోంది. వేలకోట్లు సంపద ఉన్నప్పటికీ.. టాట్యానా అద్దె ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?టట్యానా బకల్‌చుక్ వ్యాపార ఆవాహన.. రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' (Vladimir Putin)ను ఆకర్షించింది. దీంతో ఆయన అంతర్జాతీయ స్విఫ్ట్ చెల్లింపు నెట్‌వర్క్‌కు దేశీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే పనిని ఆమెకు అప్పగించారు. ఓ టీచర్‌గా జీవితం ప్రారంభించి, కుటుంబానికండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు ప్రపంచంలోని గొప్ప వ్యాపారవేత్తల సరసన నిలిచిన టట్యానా బకల్‌చుక్ ప్రశంసనీయం, ఎంతోమందికి ఆదర్శప్రాయం.

Delhi Cm Atishi Pressmeet On House Cancellation By Centre10
నాకు ఇల్లు లేకుండా చేశారు: సీఎం అతిషి

న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మండిపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం(జనవరి7) ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇ‍ప్పుడుంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారని వివరించారు.తన కుటుంబ సభ్యులను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని అతిషి ఆరోపించారు.తాను సీఎంగా ఎన్నికైన తర్వాత మా వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదకి విసిరేశారని చెప్పారు. తమ ఇళ్లను బీజేపీ లాక్కోవచ్చేమో గాని ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్నారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూవాళ్ల కోసం పని చేస్తానన్నారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం(జనవరి 7) ప్రకటించింది. ఫిబ్రవరి 5వ పోలింగ్‌ జరగనుంది.అదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముక్కోణపు పోరు జరగనున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్‌, బీజేపీ మధ్యే ఉండనుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు షాక్‌..‘ఆప్‌’కు అఖిలేష్‌ మద్దతు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement