Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court overturns High Court verdict on Mithun Reddy bail Issue1
ఆధారాలు లేకుండా అరెస్టులా..?

‘‘అరెస్ట్‌ అనేది.. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్‌ అన్నది.. వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్ట్‌ విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది..’’– సుప్రీంకోర్టు ధర్మాసనం..సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని పేర్కొంది. కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్ట్‌లు చేయడం తగదంది. ‘ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి. కేసు పెట్టాం కాబట్టి అరెస్ట్‌ చేసి తీరాలన్న ఆలోచన ఎంతమాత్రం సరికాదు. ఇలాంటి యాంత్రిక అరెస్ట్‌లు సబబు కాదు...’ అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అరెస్ట్‌ చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలని పునరుద్ఘాటించింది.హైకోర్టు తీర్పును రద్దు చేసిన ‘సుప్రీం’...మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పును పరిశీలిస్తే.. ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించలేదన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు అధికారి సేకరించిన ఆధారాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. మిథున్‌రెడ్డి పరువు, ప్రతిష్టలను కూడా కేసు విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు నిర్ణయం వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్ధీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు తీర్పుపై సుప్రీంకు మిథున్‌రెడ్డి...గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మి«థున్‌రెడ్డి తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ గత నెల 3న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ పార్ధీవాలా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది.దర్యాప్తునకు సహకరిస్తున్నారు...మిథున్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, రంజిత్‌ కుమార్‌లు వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ ఇప్పటికే దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరయ్యారని తెలిపారు. మద్యం కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చామని రాష్ట్ర ప్రభుత్వ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పును ఆక్షేపించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం వెలువరించాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. తీర్పు వెలువరించేంత వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని ధర్మాసనం రికార్డ్‌ చేసింది.

Justice BR Gavai oath of Chief Justice of India2
సీజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

ఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (Justice BR Gavai) ప్రమాణస్వీకారం చేశారు. భాతర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. గవాయ్‌కు అభినందనలు తెలిపారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, గవర్నర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న గవాయ్‌.. చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్‌గా పేరు పొందారు.ఇక, మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్‌ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ గవాయ్‌ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్‌పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టిస్‌ గవాయ్‌ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని పలు కీలక కేసులను విచారించారు.#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw— ANI (@ANI) May 14, 2025

China attempts to rename certain places in Arunachal Pradesh3
భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలు.. అరుణాచల్‌లో చైనా దూకుడు

ఢిల్లీ: భారత్‌ విషయంలో డ్రాగన్‌ దేశం చైనా మరోసారి వక్రబుద్ధిని చూపించింది. ఈశాన్య భారతంలో సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో పలు స్థలాల పేర్లను చైనా మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారవని తెలుసుకోవాలన్న భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాలను సౌత్ టికెట్‌గా చైనా పేర్లు మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ..‘అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల పేరు మార్చడాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారిపోవు. అరుణాచల్‌లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను కచ్చితంగా తిరస్కరిస్తాం’ అని చెప్పుకొచ్చారు.Here's the actual names and places of Arunachal Pradesh which China has renamed! 👇@MEAIndia has reiterated that creative naming will not alter the undeniable reality that Arunachal Pradesh was, is, and will always remain an integral and inalienable part of India. pic.twitter.com/o4rcgiflfK— Sashanka Chakraborty (@SashankGuw) May 14, 2025అయితే, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను చైనా ఇప్పటికే పలుమార్లు మార్చింది. పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. చైనా చేస్తున్న వాదనలకు భారత్‌ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది. గత ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్‌, టిబెటెన్‌ పేర్లను పెట్టింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్‌ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.India’s Foreign Ministry slams China for presenting new names of cities in the state of Arunachal Pradesh, which China claims as its own:"Creative naming won’t alter the undeniable fact that Arunachal Pradesh was, is & will always remain an integral & inalienable part of India” pic.twitter.com/hsbLg3jbC7— DR Yadav (@DrYadav5197) May 14, 2025

PSL 2025 To Resume On This Day But Foreign Players Unlikely to Return4
పీసీబీ బుద్ధి మారలేదు!.. మళ్లీ ఐపీఎల్‌తో పోటీ.. కానీ ఊహించని షాక్‌!

చావు దెబ్బలు తింటున్నా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తీరు మారలేదు. ఇప్పటికే ఐపీఎల్‌-2025 (IPL 2025)కు పోటీగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL-2025) షెడ్యూల్‌ను ఖరారు చేసి చేతులు కాల్చుకున్న పీసీబీ.. మరోసారి అదే సాహసానికి సిద్ధపడింది. కాగా మార్చి 22న ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ మొదలుకాగా.. ఎన్నడూ లేని విధంగా పాక్‌ బోర్డు కూడా పోటీకి దిగింది. ఏప్రిల్‌ 11న తమ టీ20 లీగ్‌ను ఆరంభించింది.వాయిదా పడిన రెండు లీగ్‌లుఈ క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు ఎప్పటిలాగే ప్రేక్షకాదరణ దండిగానే లభించగా.. పీఎస్‌ఎల్‌ను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి తరుణంలో పహల్గామ్‌ ఉగ్రదాడికి బదులుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగా.. పాక్‌ ఆర్మీ అందుకు ప్రతిదాడికి దిగింది. దీంతో గట్టిగా బదులిచ్చిన భారత్‌ రావల్పిండి, కరాచీ, లాహోర్‌లను టార్గెట్‌ చేయగా.. పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌కు ముందే రావల్పిండి స్టేడియంలో క్షిపణి దాడి జరిగింది.పునఃప్రారంభంలోనూ పోటీఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇటు ఐపీఎల్‌తో పాటు.. అటు పీఎస్‌ఎల్‌ను కూడా వాయిదా వేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత.. ఈ రెండు లీగ్‌లు మళ్లీ మొదలుకానున్నాయి. అయితే, పునఃప్రారంభంలో కూడా పీసీబీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)తో పోటీకి దిగిందిరామని తేల్చి చెప్పిన ఆటగాళ్లుఈ సీజన్‌లో మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లను మే 17 నుంచి అని బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే పోటీగా.. పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కూడా మే 17 నుంచి పీఎస్‌ఎల్‌ తిరిగి ఆరంభం అంటూ ఆర్భాటానికి పోయింది. కానీ ఇక్కడ ఆసలు సవాల్‌ విదేశీ ప్లేయర్ల నుంచి ఎదురవుతోంది. భారత ఆర్మీ దాడులతో బెంబేలెత్తిన పలువురు విదేశీ ఆటగాళ్లు ఇక పాక్‌కు వచ్చే సమస్యే లేదని తెలిసింది.ముఖ్యంగా కేన్‌ విలియమ్సన్‌ సహా ఇతర న్యూజిలాండ్‌ ఆటగాళ్లు పాకిస్తాన్‌కు ససేమిరా అంటున్నట్లు సమాచారం. డారిల్‌ మిచెల్‌ అయితే మళ్లీ తాను పాక్‌లో అడుగుబెట్టబోనని తేల్చిచెప్పినట్లు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో కివీస్‌ ప్లేయర్లు మాత్రమే ఇంగ్లండ్‌ సహా ఇతర విదేశీ ప్లేయర్లు పీఎస్‌ఎల్‌ కోసం వెనక్కి వచ్చే అవకాశమైతే లేదు. కాగా 25న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్‌ పీఎస్‌ఎల్‌ ముగుస్తుంది. అయితే పలువురు స్టార్‌ క్రికెటర్లు తిరిగి రానే రామని తేల్చేయడంతో వారి స్థానాల్ని వెంటనే భర్తీ చేసుకొని ఆయా ఫ్రాంచైజీలన్నీ పునఃప్రారంభానికి సిద్ధంగా ఉండాలని పీసీబీ సూచించింది. చదవండి: IPL 2025 Revised Schedule: దేశమా.. ఐపీఎలా..?

gold and silver rates today on market in telugu states5
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవల ఒడిదొడుకులకు లోనవుతుంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.88,050 (22 క్యారెట్స్), రూ.96,060 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.500, రూ.540 తగ్గింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.88,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.96,060 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.500 దిగి రూ.88,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.540 తగ్గి రూ.96,210 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు బుధవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. మంగళవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Ram Charan About Peddi Movie Latest6
'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్

రామ్ చరణ్ మైనపు విగ్రహం.. రీసెంట్ గా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి చరణ్ అక్కడికి వెళ్లాడు. విగ్రహావిష్కరణ పూర్తి కాగానే యూకేలోని తన అభిమానులని కలిసి ముచ్చటించాడు. 'పెద్ది' విశేషాలు చెప్పి హైప్ పెంచేశాడు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) అభిమానులతో మాట్లాడిన చరణ్.. 'పెద్ది' సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి' అని చెప్పాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్ అరిచి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదివరకే రిలీజ్ చేసిన 'పెద్ది' గ్లిం‍ప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా చివరలో వచ్చే క్రికెట్ షాట్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సందర్భంగా లండన్ లో ఫ్యాన్స్.. ఓ బ్యాట్ ని రామ్ చరణ్ కి బహుకరించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. బుచ్చిబాబు దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) Idhi nenu mamuluga anni cinemalaki cheppanu... Ee Cinema matram raasi pettukondi 💥💥💥@AlwaysRamCharan about #PEDDI ! pic.twitter.com/CPOKMjOwcl— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2025

BJP Minister Vijay Shah Comments On Colonel Sofiya Qureshi7
సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. హైకమాండ్‌ వార్నింగ్‌

భోపాల్‌: భారత సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని.. ఉగ్రవాదులను హతమార్చేందుకు పంపించి మోదీ గుణపాఠం చెప్పారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్‌పై పోరులో భాగంగా ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీ విజయ్‌ షా ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అని వ్యాఖ్యలు చేశారు.దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. అనంతరం, మధ్యప్రదేశ్‌ బీజేపీ హైకమాండ్‌.. విజయ్‌ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. దీంతో, మరోసారి స్పందిస్తూ.. ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని షా విలేకరులకు చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు.మరోవైపు.. మంత్రి విజయ్‌ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని ప్రధానికి విజ్ఞప్తిచేశారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.Utterly derogatory, communal and sexist remark made by a BJP MP minister Kunwar Vijay Shah against Col Sofia Quereshi. . And it wasn’t off the cuff either (don’t miss the applause from his chamchas on stage) . Shocking beyond belief. What is the use of ‘nationalist’ flag waving… pic.twitter.com/pZ8VboyAoV— Rajdeep Sardesai (@sardesairajdeep) May 13, 2025

Cannes 2025 Urvashi Rautela Spills Magic On Red Carpet Crystal Parrot Clutch8
Cannes 2025 తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో?

ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 (Cannes 2025) లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela ) తన అద్భుతమైన ప్రదర్శనతో తన మాయాజాలాన్ని మరోసారి రిపీట్‌ చేసింది. తనదైన ఫ్యాషన్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసే ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్ లోని కేన్స్ నగరంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తళుక్కుమని మెరిసింది. కొంతకాలంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను మిస్‌ కాని ఊర్వశి ఈసారి కూడా స్పెషల్‌ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. డార్క్‌ గ్రీన్‌ ట్యాబ్‌ గౌను, ధరించి యువరాణి లుక్‌లో తళుక్కుమంది. మరీ ముఖ్యగా ఆమెధరించిన ప్యారెట్‌ ఆకారంలో క్రిస్టల్ క్లచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో దాని ధర ఎంత అనే చర్చ నెట్టింట సందడిగా మారింది.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 78వ ఎడిషన్ మే 13, 2025న ప్రారంభమై మే 24, 2025న ముగియనుంది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రఖ్యాత వ్యక్తులు 12 రోజుల పాటు జరిగే గ్లామర్, కళల అద్భుతమైన వేడుకలో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్లతోపాటు, ఈ సారి 76 ఏళ్ల సిమీ గరేవాల్‌ కేన్స్‌ ఉత్సవంలో అరంగేట్రం చేస్తోంది.. ఈ సంవత్సరం కేన్స్ ముఖ్యాంశాలలో ఒకటి, అమెరికన్ నట దిగ్గజం, రాబర్ డి నీరోకు జీవిత సాఫల్యానికి గౌరవ పామ్ డి'ఓర్ అవార్డును ప్రదానం చేయడం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ మీద నడిచింది.ఇదీ చదవండి: 76 ఏళ్ల వయసులో 56 ఏళ్ల తరువాత కేన్స్‌లో అరంగేట్రం..అస్సలు ఊహించలేదుఊర్వశి ధరించిన గౌనుతో పాటు, రంగురంగుల రత్నాలు, చెవిపోగులు, రంగురాళ్ల కిరీటం మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక మేకప్ విషయానికి వస్తే, ముదురు ఊదా రంగు ఐషాడోతో బోల్డ్, గ్లామరస్ మేకప్‌, కళ్ళపై రైన్‌స్టోన్స్ స్టిక్కర్‌తో తన మరింత ఎలివేట్‌ చేసుకుంది. పక్షి ఆకారంలో ఉన్న బ్యాగును పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. కేన్స్‌లో చిలుకలా దుస్తులు ధరించి వచ్చిన తొలి మహిళ, ఇది నిజమా; లేక ఏఐ మాయాజాలమా అంటూ ఆశ్చర్యంలో మునిగి పోయారు.హైలైట్ ఏంటంటేఊర్వశి లుక్‌లో మరో హైలైట్ ఆమె క్లచ్. సాధారణ, ప్రాథమిక క్లచ్‌లను పక్కనపెట్టి, జుడిత్ లిబర్ డిజైనర్ క్రిస్టల్ చిలుక క్లచ్‌ను ఎంచుకుంది.అద్భుతమైన క్లచ్ ధర 5,495 US డాలర్లు అంటే దాదాపు రూ. 4,57,744లు.గతంలో ఊర్వశి రౌతేలా క్రొకోడైల్‌ నెక్‌ పీస్‌ ధరించి పలువుర్ని ఆకర్షించింది. 2023 కేన్స్‌లో రూ. 200 కోట్ల విలువైన నకిలీ మొసలి నెక్‌పీస్ ధరించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది సిమా కౌచర్ రూపొందించిన పింక్ టల్లే గౌనులో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్‌పై తొలి సారి తన బ్యూటీని ప్రపంచానికి చాటా చెప్పింది.

Pakistan High Commissioner Syed Ahmed Maroof honeytrap9
వివాదంలో పాకిస్తాన్‌ హైకమిషనర్‌.. యువతితో వీడియోలు లీక్‌

ఢాకా: పాకిస్తాన్‌ హైకమిషనర్‌ హనీట్రాప్‌ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.వివరాల ప్రకారం.. సయ్యద్‌ అహ్మద్‌ మరూఫ్‌ పాకిస్తాన్‌ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్‌ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్‌ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్‌ వీడినట్టు చెప్పుకొచ్చింది.The Pakistani Ambassador to Bangladesh, Syed Ahmed Maroof, was in a relationship with a Bangladeshi Muslim girl. After some intimate details became public, he was sent on leave. There was a time when Pakistanis used to rape Bangladeshi Muslim women nowadays, some Bangladeshi… pic.twitter.com/p60WkJJslU— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) May 12, 2025అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.Pakistan Ambassador to Bangladesh Syed Ahmed Maroof is reportedly untraceable after his honey trapped videos emerged online.There's a leaked video too. pic.twitter.com/UfYmLYfKVl— Avinash K S🇮🇳 (@AvinashKS14) May 13, 2025ఇక, ఇటీవల మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆమెతో పాక్‌ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్‌ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌ కార్యాలయ అధికారి ఒకరిని భారత్‌ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్‌గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉ‍న్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్‌ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Pakistan Reacts On PM Modi Speech10
ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్‌ ఓవరాక్షన్‌.. హెచ్చరిక అంటూ..

ఇస్లామాబాద్‌: భారత్‌, పాక్‌ ఘర్షణల వేళ పాకిస్తాన్‌ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని ప్రధాని మోదీ (Modi) హెచ్చరించిన నేపథ్యంలో పాక్‌ స్పందించింది. మోదీ వ్యాఖ్యలు 'రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదమైనవి'గా ఉన్నాయని పేర్కొంటూ పాక్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.పాకిస్తాన్‌ యుద్ధం, కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై తాజాగా పాక్‌ విదేశాంగశాఖ స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో..‘భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్తాన్‌ తిరస్కరిస్తోంది. ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్‌ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. భారత్‌ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించదు. అణుబాంబు బెదిరింపుల్ని భారత్‌ సహించదని.. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్‌ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్‌ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు.మంగళవారం కూడా పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్‌లో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్‌ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement