Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

President Droupadi Murmu Sensational Question to supreme court1
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ ఏంటి?.. సంచలనంగా ద్రౌపది ముర్ము ప్రశ్నలు!

ఢిల్లీ: ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో, రాష్ట్ర బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై తాజాగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) స్పందించారు.ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్‌ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు పశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలను, బిల్లులకు ఆమోదం తెలపడం లేదా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం వంటి విధానాలను వివరిస్తుందని రాష్ట్రపతి హైలైట్ చేశారు. అయితే, ఈ రాజ్యాంగ ఎంపికలను ఉపయోగించుకోవడానికి గవర్నర్‌కు ఎలాంటి గడువును ఆర్టికల్ 200లో పేర్కొనలేదని అన్నారు.సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలివే..రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా?.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?.రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ వినియోగం న్యాయ సమ్మతమైనదా?రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?.సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?.ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?.రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా? అని ప్రశ్నించారు. Big showdown brews between Rashtrapati Bhavan & Supreme CourtPresident Droupadi Murmu invokes Article 143, seeking clarity on SC's ruling that set deadlines for Tamil Nadu Governor RN Ravi to act on bills—without Centre's nod. CJI Gavai to form a Constitution BenchKey… pic.twitter.com/1DShRAn21P— Nabila Jamal (@nabilajamal_) May 15, 2025సుప్రీంకోర్టు తీర్పు ఇదే..తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి!. ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్‌ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్‌ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్‌ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్‌ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్‌ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్‌ వర్సిటీ, వైస్‌ చాన్స్‌లర్ల బిల్లులు తదితరాలున్నాయి.రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్‌ ఆమోదం పొందాలి. గవర్నర్‌ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్‌ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్‌ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది.దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్‌ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్‌ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్‌ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్‌ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్‌ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది.

Minister Rajnath Singh Key Comments On POK2
పీవోకేపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీనగర్‌: ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అలాగే, దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ నేడు జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ యుద్ధ వీరులను రాజ్‌నాథ్‌ అభినందించారు. అనంతరం, రాజ్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘సైనికుల ధైర్యసాహసాలు గర్వకారణం. ఉగ్రవాదం అంతానికి ఎంత దూరమైనా, ఎక్కడికైనా వెళ్తాం. ఉగ్రవాదంపైనే కాదు.. పీవోకేపైనా మన యుద్ధం ఆగదు. పాకిస్తాన్‌ అణ్వయుధాల బ్లాక్‌మెయిల్‌కు భయపడం. ఎలాంటి పరిస్థితులలైనా మన సైన్యం ఎదుర్కోగలదు’ అంటూ ప్రశంసలు కురిపించారు. శత్రువులను నాశనం చేసిన ఆ శక్తిని అనుభూతి చెందడానికి నేను ఇక్కడ ఉన్నాను. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చౌకీలు, బంకర్లను మీరు ధ్వంసం చేసిన విధానాన్ని, శత్రువు దానిని ఎప్పటికీ మరచిపోలేడని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే, పహల్గామ్ దాడి తర్వాత, జమ్ముకశ్మీర్ ప్రజలు పాకిస్తాన్, ఉగ్రవాదులపై తమ కోపాన్ని వ్యక్తం చేసిన విధానం గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh says, "...I ask the entire world if nuclear weapons are safe in the hands of such an irresponsible and rogue nation. I believe that Pakistan's nuclear weapons should be taken under the supervision of International Atomic… pic.twitter.com/7tQA7mbZZI— ANI (@ANI) May 15, 2025 #WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh, J&K Lt Governor Manoj Sinha and CM Omar Abdullah join the jawans at Badami Bagh Cantonment in raising slogans of 'Bharat Mata ki Jai'. The Defence Minister addressed the jawans here. #OperationSindoor pic.twitter.com/r2sCXZGKkB— ANI (@ANI) May 15, 2025#WATCH | J&K: Defence Minister Rajnath Singh meets and interacts with jawans at Badami Bagh Cantonment. #OperationSindoor pic.twitter.com/vZXzX3W7FL— ANI (@ANI) May 15, 2025

US to levy 5pc tax on immigrant remittances impact NRIs3
అమెరికాలో కొత్త ట్యాక్స్‌.. అమలైతే ఎన్‌ఆర్‌ఐల జేబులు ఖాళీ!

అమెరికాలో మరో కొత్త రకం పన్నుకు ట్రంప్‌ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇది గనుక అమలులోకి వస్తే అక్కడ నివస్తున్న ప్రవాస భారతీయులపై (NRI) తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి సంబంధించి అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌లో మే 12న ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌పై 5 శాతం పన్ను విధించనున్నారు.స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు, చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను 2028 వరకు 2,500 డాలర్లకు పెంచడం ద్వారా 2017 పన్ను కోతలు, ఉద్యోగాల చట్టాన్ని శాశ్వతం చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండోసారి అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఈ చట్టాన్ని 'గ్రేట్' అని అభివర్ణిస్తూ, రిపబ్లికన్లు దీనిని ఆమోదించేలా చూడాలని కోరారు. మే 26 మెమోరియల్ డే నాటికి బిల్లును ఆమోదించాలని సభ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత అది సెనేట్‌కు వెళుతుంది. జూలై 4వ తేదీలోగా చట్టంగా మార్చాలని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.కొత్తగా వసూలు చేసే 5 శాతం రెమిటెన్స్ పన్నును పన్ను విరామాలకు నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు. ఇది యూఎస్ ట్రెజరీకి బిలియన్లకొద్దీ ఆదాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కష్టపడి డబ్బులు సంపాదించుకుని వాటిని తమ దేశాల్లోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావంభారత్‌లోని తమ కుటుంబాలకు డబ్బు పంపే ఎన్ఆర్ఐలకు ఈ పన్ను తీవ్ర ఆర్థిక ప్రభావాలను కలిగిస్తుంది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్‌కు ఏటా 8,300 కోట్ల డాలర్ల రెమిటెన్స్ లు పంపుతుండగా, అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచే అందుతున్నాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లోని తమ కుటుంబాలకు పంపే ప్రతి లక్ష రూపాయలకు రూ.5,000 పన్ను రూపంలో యూఎస్‌ ప్రభుత్వానికి వెళ్తుంది.

Supreme Court On Colonel Sofiya Qureshi And Vijay Shah4
సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఏమందంటే?

ఢిల్లీ: భారత సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు కూడా నమోదైంది. అనంతరం, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మంత్రి తీరును తప్పుపట్టింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి అని సూచనలు చేసింది.ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కల్నల్‌ ఖురేషీపై మంత్రి విజయ్‌ షా వ్యాఖ్యలు చేశారు. ఖురేషీని ఉద్దేశిస్తూ ఆమెను ‘ఉగ్రవాదుల సోదరి’ అంటూ ఉగ్రవాదులను హతమర్చేందుకు ఆమె పాకిస్తాన్‌ వెళ్లారని విజయ్‌ షా అన్నారు. దీంతో, సదరు మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని జస్టిస్‌ అతుల్‌ శ్రీధరణ్, జస్టిస్‌ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం, హైకోర్టు ఆదేశాలపై మంత్రి విజయ్‌.. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంత్రి పిటిషన్‌ను రేపు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేగాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ‘ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోవైపు.. అటు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.On the shameful statement of BJP minister Vijay Shah by referring to Colonel Sofia as Sister of Terrorists, The division bench of Jabalpur High Court has suo motu directed to register a case against Vijay Shah under serious criminal sections. Via : @sanjaygupta1304 pic.twitter.com/guS2ihv4hb— Mohammed Zubair (@zoo_bear) May 14, 2025

Tdp Wins No Confidence Motion Madakasira Municipal Chairman On Through Conspiracy5
శ్రీసత్యసాయి జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ!

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. దొడ్డిదారిన మడకశిర మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసం నెగ్గిన టీడీపీ.. బలం లేకపోయినా ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టింది. గతంలో మొత్తం 20 వార్డులకు 15 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించగా, కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది.కాగా, రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పెత్తనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఈ క్రమంలోనే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకున్న స్థానాలను సొంతం చేసుకునేందుకు దిగజారి రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకున్న టీడీపీ నేతలు మడకశిర మున్సిపాలిటీని కూడా అప్రజాస్వామికంగా కైవసం చేసుకున్నారు.మడకశిర మున్సిపాలిటీలో 20 వార్డులుండగా.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు 15 స్థానాల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో చైర్‌పర్సన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్‌ చైర్మన్‌గా రామచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వీరిద్దరినీ ఎలాగైనా పదవుల నుంచి తప్పించాలని టీడీపీ నేతలు ప్లాన్‌ వేశారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 8 మందికి పచ్చ కండువా కప్పారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఐదుగురితో పాటు పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు.

Prithvi Shaw Breaks Silence With Cryptic Post Amid IPL Comeback Talks6
IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఆటగాడి పోస్ట్‌

ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తాత్కాలిక రీప్లేస్‌మెంట్ల కోసం వెతుకుతున్న వేల, టీమిండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఓపెనర్‌ పృథ్వీ షా పెట్టిన ఓ పోస్ట్‌ ఆసక్తి రేపుతోంది. ఈ సీజన్‌ మెగా వేలంలో అమ్ముడుపోని షా.. "బ్రేక్‌ కావాలంటూ" ఓ పోస్ట్‌ పెట్టాడు. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు షా రీప్లేస్‌మెంట్‌ ఆటగాడిగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.2018లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల షా.. ఐపీఎల్‌లో డీసెంట్‌ రికార్డు (79 మ్యాచ్‌ల్లో 147.467 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు) కలిగి ఉన్నాడు. అయితే వ్యక్తిగత అలవాట్లు, ఫిట్‌నెస్‌ కోల్పోవడం అతన్ని ఐపీఎల్‌ పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరం చేశాయి. గత సీజన్‌లో ఢిల్లీకి ఆడిన షా.. 8 మ్యాచ్‌ల్లో 163.63 స్ట్రయిక్‌రేట్‌తో 198 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ సేవలు కోల్పోవడంతో షా ఆ జట్టులో చోటు ఆశిస్తున్నాడు.ప్రస్తుత తరుణంలో షాకు ఢిల్లీ అవకాశం ఇవ్వకపోయినా ముంబై ఇండియన్స్‌ ఛాన్స్‌ ఇవ్వొచ్చన్న టాక్‌ నడుస్తుంది. ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఇంగ్లండ్‌ ఆటగాడు విల్‌ జాక్స్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు దేశీయ బ్యాటర్‌ కోసం​ చూస్తుందని సమచారం. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్తుగా కీర్తించబడ్డ పృథ్వీ షా ఇప్పుడు ఐపీఎల్‌లో ఛాన్స్‌ కోసం వెంపర్లాడటం ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ లేకపోతే ఎంత టాలెంట్‌ ఉన్నా ఇలాంటి గతే పడుతుందని జనాలు అంటున్నారు. పృథ్వీ షాలా కావొద్దని ఇప్పుడిప్పుడే షైన్‌ అవుతున్న యువ ఆటగాళ్లకు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌-పాకిస్తాన్‌ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. యుద్దం నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ క్రికెటర్లు జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఐపీఎల్‌ తదుపరి లెగ్‌లో పాల్గొనలేకపోతున్నారు. కొందరు ఇతరత్రా కారణాల చేత ఐపీఎల్‌లో కొనసాగేందుకు విముఖత చూపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ తిరిగి రాని ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు వెసులుబాటు కల్పించింది. ​ఈ క్రమంలోనే పృథ్వీ షా లాంటి చాలా మంది భారత ఆటగాళ్లు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

Indian-Origin Techie Among 3succumbed In Tragic Climbing Accident In US7
అమెరికాలో ఘోరం : భారత సంతతి పర్వతారోహకుడి సహా ముగ్గురు దుర్మరణం

అమెరికాలోని వాషింగ్టన్‌లో పర్వతారోహణ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు పర్వతారోహకులు మరణించారు. అయితే, నాల్గవ సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పర్వతారోహణంపై ఆసక్తితో ఎంతో ఉత్సాహంగా మొదలైన వీరి ప్రయాణం విషాదాంతమైంది. దీంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.పశ్చిమ ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ కాస్కేడ్స్ పర్వతాలపై ఈ ప్రమాదంచోటు చేసుకుంది. ఈ క్లైంబింగ్ ప్రమాదంలో మరణించిన ముగ్గురిలో భారత సంతతికి చెందిన టెక్కీ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నారు. సియాటిల్ నివాసి అయిన 48 ఏళ్ల విష్ణు తన ముగ్గురు స్నేహితులు టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36) ఆంటన్ సెలిక్‌లతో (38), త్సేలిఖ్‌ లతో కలిసి శనివారం కాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని NBC న్యూస్ నివేదించింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక అధిరోహకుడు త్సేలిఖ్,తన ముగ్గురు స్నేహితుల మరణానికి దారి తీసిన ప్రమాదం గురించి అధికారులకు తెలియజేయడానికి 64 కిలోమీటర్లు ప్రయాణించాడు. త్సేలిఖ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ,అంతర్గత రక్తస్రావం, మెదడు గాయానికి చికిత్స పొందుతున్నాడు.అయితే పైకి ఎక్కుతున్నపుడు తుఫాను ప్రమాదాన్ని గుర్తించిన వీరు వెనక్కి తగ్గినప్పటికీ ఫలితం లేకపోయింది. కిందికి దిగుతున్న సమయంలో జట్టు యాంకర్ పాయింట్ విఫలం కావడంతో వారు 200 అడుగుల కిందకు పడిపోయారని క్లైంబింగ్ వెబ్‌సైట్ నివేదించింది. ఈ ప్రమాదంలోపై విష్ణు స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యకతం చేశారు. విష్ణు అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడని ప్రకృతిని బాగా ఇష్టపడేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు సియాటిల్‌లో అత్యంత నైపుణ్యమున్న టెక్నీషియన్లలో గొప్పవాడని, తనదైన విలువలతో జీవితాన్ని నిర్మించు కున్నాడంటూ కంట తడిపెట్టుకున్నారు. విష్ణు గౌరవార్థం అతని స్నేహితులు , కుటుంబ సభ్యులు రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు అందించనున్నారు. అలాగే మే 22 వరకు ఆ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలని వారు ఇతరులకు విజ్ఞప్తి చేశారు.విష్ణు గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని టెస్ట్ పరికరాల తయారీ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. విష్ణు గొప్ప టీం లీడర్‌ అనీ, ఆయన మరణం తీరని లోటు అంటూ కంపెనీ కూడా నివాళులర్పించింది. నార్త్ కాస్కేడ్స్‌లోని లిబర్టీ బెల్ సమూహంలోని గ్రానైట్ శిఖరం, నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్, అనుభవజ్ఞులైన పర్వాతారోహకులకు ప్రసిద్ధి చెందింది.

Supreme Court Serious On Telangana Govt8
తెలంగాణ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్‌.. పక్కా ప్లాన్‌ ప్రకారమే చేశారంటూ..

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో భూముల్లో చెట్ల నరికివేతపై జవాబు చెప్పాలి. పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందే. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు అంటూ హెచ్చరించింది.తెలంగాణలో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టారు. చీఫ్ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. వారాంతంలో చెట్లు నరకడంలో ఆంతర్యం ఏమిటి?. పక్కా ప్రణాళికతోనే వారాంతంలో చెట్లు నరికారు. డజన్ల కొద్ది బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికారు. సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. అధికారులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దు.. వాటిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి.. కంచె గచ్చిబౌలిలో పనులన్నీ నిలిపి వేశామని వెల్లడించారు. పర్యావరణం కాపాడుతూనే ఐటీ ప్రాజెక్టులు చేస్తామని చెప్పారు. రిజైన్డర్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని సింఘ్వీ కోరారు.అనంతరం, విద్యార్థుల అరెస్టు అంశాన్ని ఈ కేసులో చేర్చవద్దని తెలిపింది. విద్యార్థుల అరెస్టు అంశంపై మరొక పిటిషన్‌తో రావాలని సూచించింది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. తాము ఈ కేసులో పర్యావరణ విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

Raj Nidimoru Wife Shhyamali De Shares Note After His New Pic With Samantha Goes Viral9
రాజ్‌ భుజంపై వాలిన సమంత.. దర్శకుడి భార్య పోస్ట్‌ వైరల్‌!

దర్శకుడు రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru), హీరోయిన్‌ సమంత(samantha) ప్రేమలో ఉన్నారనే వార్త గతకొంత కాలంగా నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. తాజాగా సమంత షేర్‌ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ సక్సెస్‌ సెలెబ్రేషన్స్‌లో భాగంగా చిత్రబృందం రాజ్‌ నిడిమోరుతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి. రాజ్‌ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలు స్పందించారు. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతారని, ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోని షేర్‌ చేసిందని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేశారు. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే కామెంట్స్‌ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ్‌ సతీమణి శ్యామాలి(Shhyamali De) తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది.నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమతో ఆశీస్సులు పంపుతున్నాను’అని అమె ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కొంతకాలంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న శ్యామాలి సమంత ఫోటో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఇలాంటి పోస్ట్‌ పెట్టడంతో ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్‌ పెట్టారని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. శ్యామాలి ఇలాంటి పోస్ట్‌ ఎందుకు పెట్టారనేది తెలియదు కాని..నెటిజన్స్‌ మాత్రం సమంత,రాజ్‌ల గురించే ఈ పోస్ట్‌ పెట్టారని కామెంట్‌ చేస్తున్నారు. కాగా, రాజ్‌, శ్యామాలిల వివాహం 2015లో జరిగింది. వీరిద్దరి ఒక పాప కూడా ఉన్నారు. పెళ్లికి ముందు శ్యామాలి బాలీవుడ్‌ దర్శకులు రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మిశ్రా, విశాల్‌ భరద్వాజ్‌ వద్ద అసిస్టెంట్‌ దర్శకురాలిగా పనిచేశారు. వివాహం తర్వాత రాజ్‌ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్‌లో సాయం చేస్తుండేవారు. అయితే గతకొంత కాలంగా రాజ్‌, శ్యామాలి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వారిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.

YSRCP ravindranath reddy Serious On CBN Govt10
‘ఏపీలో జీహెచ్‌ఎంసీ యాక్ట్‌?.. కూటమిలో కుర్చీ కోసం కుమ్ములాట’

సాక్షి, వైఎస్సార్‌: కూటమి పాలనలో అభివృద్ధి లేదు.. కానీ కక్ష సాధింపులో మాత్రం ముందుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పుకొచ్చారు. కుర్చీల కోసం కుమ్ములాట నడుస్తోందన్నారు.వైఎస్సార్‌సీపీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో అభివృద్ధి లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగా రాక్షసానందం పొందుతున్నారు. వాళ్ళు పెడుతున్న కేసులు ఏవీ కోర్టుల్లో నిలబడటం లేదు. కడప మేయర్ సురేష్ బాబు విషయంలోనూ అదే తీరులో వెళ్తున్నారు. అసలు యాక్ట్ లేదు.. మనం జీహెచ్‌ఎంసీ యాక్టు అమలు చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి అసలు యాక్ట్ లేనే లేదు. జీహెచ్‌ఎంసీ యాక్టు చూపించి మా మేయర్‌పై చర్యలు తీసుకోవడం విడ్డూరం. మేయర్ కుమారుడి సంస్థకు కమిషనర్ రిజిస్టర్ చేస్తారు.. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు?ఆరోపణల్లో ఏదైనా అవినీతి చూపించలేదు. కుర్చీల కోసం కుమ్ములాట కోసం ఇదంతా జరుగుతోంది. వాళ్ళ పత్రికలే కుర్చీల కోసమే ఇదంతా జరుగుతుందని రాసింది. ఎమ్మెల్యేలకు చాలా కంపెనీలు ఉన్నాయి.. మరి వాళ్ళు కాంట్రాక్టులు చేయవచ్చా?. మేయర్ తన వివరణలో తన దృష్టికి రాలేదని వివరణ కూడా ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది.. న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేరుగా ఫిర్యాదు చేసారట.. దీనిలో ఇక రాజకీయం లేక ఏముంది?. నగరానికి ఆమె ఒక్క పైసా నిధులు తీసుకురాక పోగా కక్ష సాధింపులకు దిగడం సరికాదు.వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోవాలి.. అది చట్టం. నీకు కుర్చీ వేయలేదని కక్ష సాధింపు అంటే ఎలా?. దీనికి మేయర్ ఇంటిపై చెత్త వేయిస్తారా?. తప్పుడు ఫిర్యాదులు చేస్తారా?. ఈ ప్రభుత్వం రాగానే అవిశ్వాసం పెట్టీ దించాలని ప్రయత్నం చేశారు. అది వీలు కాకపోవడంతో ఈ రకంగా కక్ష సాధింపునకు దిగుతున్నారు. చిన్న విషయాన్ని చూపి అనర్హత అనడం దారుణం’ అంటూ మండిపడ్డారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement