Top Stories
ప్రధాన వార్తలు

‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమని శశిథరూర్ కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెస్సేజ్ పంపించారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న దానిని అస్సలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశిథరూర్. భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు శశిథరూర్.ప్రధానిగా మోదీ దేశానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో మోదీ వ్యవహరిస్తున్నరు నిజంగా అద్భుతమన్నారు. అది కోవిడ్ లాంటి మహమ్మారి అయినా దేశ ద్రోహులపై చేసే యుద్ధమైనా మోదీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేనిది. ఏది దేశానికి ముఖ్యమో అది మోదీ ఒక ప్రధానిగా చేసి చూపిస్తున్నారని శశిథరూర్ ప్రశంసించారు. ఈ మేరకు జాతీయ మీడియా ఎన్డీటీవో మాట్లాడిన శశిథరూర్.. దేశాన్ని నాలుగు కోణాల్లో చూస్తూ ముందుండి నడిపిస్తున్న నేత మోదీ అని కొనియాడారు. భారత్ సంక్షోభంలో ఉన్న ప్రతీసారి మోదీ ఇకపై కూడా ఇలానే వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు లోక్ సభ ఎంపీ శశథరూర్.ఇక్కడ చదవండి: ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ

వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్ జగన్.. అనంతరం తిరుగు పయనమయ్యారు.

ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానం: ప్రధాని మోదీ
ఆదంపూర్: భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో సైనికులు భారత్ మాతాకీ జై అంటే.. శత్రువు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ తరువాత మంగళవారం ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. అక్కడ వాయుసేన సేవలను ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన సత్తా చూపించిందని అన్నారు. భారత్ మాతాకీ జై.. ఇది దేశ ప్రజల నినాదం అని అన్నారు. యుద్ధ రంగంలో మన సైనికులు చరిత్ర సృష్టించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది ప్రపంచమంతా మార్మోగిందని, ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నా జీవితం ధన్యమైంది‘దేశ ప్రజలంతా సైన్యానికి అండగా నిలబడ్డారు. భారత్ శక్తి సామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. మన సైన్యం సామర్థ్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకం. వీర సైనికులందరికీ నా సెల్యూట్. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మారుమ్రోగింది. సైన్యం దేశ ఆత్మ విశ్వాసం పెంచింది. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సిద్ధాంతం. అక్క చెల్లెల సిందూరం తుడిచినవారిని నాశనం చేశాం’ అని మోదీ సైన్యాన్ని కొనియాడారు.‘గురిచూసి కొట్టిన దెబ్బతో.. శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి. వారు వెనుక నుంచి దాడి చేస్తే.. మీరు ముందు నిలబడి ధైర్యంగా దాడిచేశారు. పాకిస్తాన్ డ్రోన్స్, యూవీఏలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు మన రక్షణ వ్యవస్థ ముందు నిలబడలేకపోయాయి. పాక్ శత్రువులు పౌరులను అడ్డుపెట్టుకుని దాడులకు పాల్పడింది. కానీ మీరు మాత్రం పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా శత్రువును దెబ్బకొట్టారు. అణు బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎప్పటికీ సహించదు. మళ్ళీ ఉగ్రదాడి జరిగితే.. భారత్ కచ్చితంగా సమాధానం ఇస్తుంది. ప్రతి కుటుంబం మీకు రుణపడి ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.#WATCH | At the Adampur Air Base, PM Narendra Modi said, "Besides manpower, the coordination of machine in #OperationSindoor was also fantastic. Be it India's traditional air defence system which has witnessed several battles or our Made in India platforms like Akash - all of… pic.twitter.com/Y2dYnanFmN— ANI (@ANI) May 13, 2025

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రూ. 50 వేలతో పాటు రెండు షురీటిలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వంశీతో పాటు మరో నలుగురకి బెయిల్ వచ్చింది. సత్యవర్డన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ఈ రోజు(మంగళవారం) కోర్టుకు హాజరయ్యారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిసన్ పై విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

IPL 2025 Revised Schedule: దేశమా.. ఐపీఎలా..?
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం సమసిపోయాక ఐపీఎల్ 2025 పునఃప్రారంభ తేదీని ప్రకటించారు. మే 17 నుంచి క్యాష్ రిచ్ లీగ్ కొన్ని మార్పులతో కొనసాగుతుంది. మే 8న రద్దైన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మే 24కు షెడ్యూల్ కాగా.. కొన్ని మ్యాచ్‌ల వేదికల్లో మార్పులు జరిగాయి. లీగ్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్ వేదికలను ప్రకటించాల్సి ఉంది. వారం వాయిదా అనంతరం క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాక్ మధ్య యుద్దం నేపథ్యంలో ఐపీఎల్ 2025లో ఆడే విదేశీ ప్లేయర్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. లీగ్ పునఃప్రారంభం కానుండటంతో వారు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది క్రికెటర్లు ఐపీఎల్లో తిరిగి పాల్గొనేందుకు సంసిద్దత వ్యక్తం చేయగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్లు ఇంకా డైలమాలో ఉన్నారు.ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లు జరుగబోయే తేదీల్లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ షెడ్యూలై ఉంది. మే 29, జూన్ 1, 3 తేదీల్లో ఇరు జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ (గుజరాత్), విల్ జాక్స్ (ముంబై), జేకబ్ బేతెల్ (ఆర్సీబీ), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్), జేమీ ఓవర్టన్ (సీఎస్కే).. వెస్టిండీస్ ఆటగాళ్లలో ఫెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (గుజరాత్), రొమారియో షెపర్డ్ (ఆర్సీబీ), షమార్ జోసఫ్ (లక్నో) వేర్వేరు జట్ల తరఫున ఐపీఎల్లో ఆడుతున్నారు. ఐపీఎల్ తేదీలతో ఇంగ్లండ్, విండీస్ వన్డే సిరీస్ క్లాష్ కావడంతో వీరంతా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.మరోవైపు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం ఇరు జట్లను ఇవాళే ప్రకటించారు. ఇరు జట్లలో మొత్తం 13 మంది ఆటగాళ్లు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పాల్గొంటున్నారు. ఐపీఎల్ తర్వాత వారం రోజుల వ్యవధే ఉండటంతో వీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఐపీఎల్లో పాల్గొనే విషయాన్ని ఆటగాళ్లకే వదిలేయగా.. క్రికెట్ సౌతాఫ్రికా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్ (ఎస్ఆర్హెచ్)ట్రవిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్)జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)సౌతాఫ్రికా ఆటగాళ్లు..మార్క్రమ్ (లక్నో)ఎంగిడి (ఆర్సీబీ)స్టబ్స్ (ఢిల్లీ)కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)జన్సెన్ (పంజాబ్)రబాడ (గుజరాత్)ముల్దర్ (ఎస్ఆర్హెచ్)పైన పేర్కొన్న ఆటగాళ్లలో కొందరు ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం లేని జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్లకు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్, ముంబై, ఢిల్లీ) ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లతో సమస్య వస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో ఏకంగా ఎడుగురు ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా దేశమా.. ఐపీఎలా అని తలలు బాదుకుంటున్నారు.ఐపీఎల్ 2025లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్ల జాబితా..RCB: టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్, లుంగి ఎంగిడి, నువాన్ తుషార,CSK: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, సామ్ కర్రన్, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, మతీష పతిరణPBKS: జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జన్సెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్KKR: ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్, రోవ్‌మన్ పావెల్, రహ్మానుల్లా గుర్బాజ్, మోయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, అన్రిచ్ నోర్ట్జేSRH: ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్, కమిండు మెండిస్, వియాన్ ముల్డర్, ఎషాన్ మలింగGT: జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, కరీం జనత్, దాసున్ షనక, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడDC: ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సెదిఖుల్లా అటల్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్MI: బెవాన్ జాకబ్స్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్, రీస్ టాప్లే, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ రెహ్మాన్LSG: ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కీ, నికోలస్ పూరన్, షమార్ జోసఫ్RR: షిమ్రోన్ హెట్‌మైర్, వనిందు హసరంగ, డ్రి ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, క్వేనా మఫాకా, ఫజల్హక్ ఫారూకీ, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్

వీర జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.

కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే.. : హరీష్ రావు ఏమన్నారంటే
హైదరాబాద్: బీఆర్ఎస్ లో విభేదాలున్నాయంటూ గత కొంతకాలంగా వస్తున్న రూమర్లకు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు చెక్ పెట్టారు. అసలు బీఆర్ఎస్ లో విభేదాలున్నాయనే వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై ఈరోజు(మంగళవారం) హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ‘ మా పార్టీ బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవు. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. మా అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా’ అని హరీష్ రావు స్పష్టం చేశారు.కాగా, ఎప్పట్నుంచో ‘బీఆర్ఎస్ లో విభేదాలు’ అనే మాట తరచు వినిపిస్తూ వస్తోంది. ప్రధానంగా కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ బాధ్యతల్ని ఎవరు మోస్తారు అనేది ప్రధానంగా నడిచే చర్చ. ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆ బాధ్యతల్ని తీసుకుంటారా?, లేక మేనల్లుడైన హరీష్ రావు తీసుకుంటారా? అనే దానిపై రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే, హరీష్ రావు పరిస్థితి ఏంటి?, హరీష్ రావు మరొక పార్టీవైపు కన్నేస్తారా? అనేదే ప్రధానంగా నడిచిన చర్చ.దీనికి ముగింపు పలికారు హరీష్ రావు. తమ పార్టీలో విభేదాలు లేవని, కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తే తనకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు. , దాన్ని తాను స్వాగతిస్తాననన్నారు. తమ అధినేత కేసీఆర్ ఆదేశాలను పాటిస్తానన్నారు హరీష్ రావు.ధాన్యం రాశులు వదిలేసి.. అందాల రాశుల చుట్టూ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు యుద్ధం చేస్తుంటే.. రేవంత్ మాత్రం అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ అందాల పోటీల్లో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ ధాన్యం రాశులు వదిలేసి అందాల రాశుల చుట్లూ తిరుగుతున్నారని చమత్కరించారు. రైతు సమస్యలపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌కు టైమ్ లేదని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు.

సమంత కొత్త జర్నీ.. సక్సెస్ అయినట్లేనా?
స్టార్ హీరోయిన్ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. రిలీజ్‌కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్ ప్రాఫిట్‌ని పొందినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్‌కి ముందే ‘జీ’ సంస్థతో డీల్ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్‌గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్ ముందే బిజినెస్ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రిలీజ్‌కి ముందే సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ తర్వాత మంచి టాక్ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
భార్యాభర్తల్లో ఒకరు చనిపోయినపుడు మిగిలిన భాగస్వాముల జీవితం దుర్భరమే అవుతుంది. అయితే చాలా సందర్భాల్లో భార్య చనిపోయినపుడు భర్త రెండోపెళ్లి చేసుకోవడం, ఇంటి బాధ్యతలతోపాటు, మొదటి భార్య సంతానాన్ని పెంచే బాధ్యత కూడా రెండో భార్యకు అప్పగించడం లాంటివి చూస్తాం.కానీ స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తి ఇందుకు భిన్నం. తన రెండేళ్ల కూతురిని చూసుకుంటూ డెలివరీలు చేస్తున్న కథనం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వేలాది మంది హృదయాలను కదిలించింది.గురుగ్రామ్‌కు చెందిన స్విగ్గీ డెలివరీ ఏజెంట్ పంకజ్. భార్య చనిపోయిన తరువాత తన తన రెండేళ్ల కుమార్తె టున్ టున్ తల్లిలేని బిడ్డగా మారిపోయింది. కానీ పంకజ్ బిడ్డను ఒంటరిగా వదిలేయలేదు. స్వయంగా తనే తన పాపాయిని చూసుకుంటున్నాడు. టున్‌టున్‌ను వెంటబెట్టుకుని మరీ డెలివరీలు చేస్తున్నాడు. ఆమెను చూసుకోవడానికి మరెవరూ లేకపోవడం, పెద్ద కొడుకుసాయంత్రం తరగతులకు హాజరుకావడంతో పంకజ్‌కు మరే మార్గం కనిపించలేదు. ఇదీ చదవండి: కదులుతున్న కారుపై కొత్త జంట విన్యాసాలు, వైరల్ వీడియోగురుగ్రామ్కు చెందిన సీఈవో మయాంక్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో డెలివరీ ఏజెంట్ పంకజ్ వెలుగులోకి వచ్చాడు.మయాంక్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత డెలివరీ ఏజెంట్ పంకజ్‌కు కాల్ చేయగా.. అవతలినుంచి ఒక చిన్నారి వాయిస్ కూడా వినిపించడంతో, పైకి రమ్మని చెబుతామని కూడా ఆగిపోయి, స్వయంగా తానే కిందికి వెళ్లాడు. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బైక్‌పై ఫుడ్ డెలివరీ ఏజెంట్ పంకజ్‌తో పాటు అతని రెండేళ్ల పాపాపయి కూడా. దీంతో పంకజ్‌ను ఆరా తీసి, అసలు సంగతి తెసుకుని మయాంక్ భావోద్వేగానికి లోనయ్యాడు.తన అనుభవాన్ని మయాంక్ లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అసలేం జరిగిందంటేడెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న పంకజ్‌కు ఇద్దరు పిల్లలు. రెండో బిడ్డ టున్ టున్ పుట్టగానే భార్య కాన్పు సమయంలో చనిపోయింది. అప్పటినుంచి అన్నీ తానై అయ్యి బిడ్డలను సాదుకుంటున్నాడు. కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో అతన్ని సాయంత్రంపూట ట్యూషన్లకు పంపుతున్నారు. కూతురు చిన్నది కావడంతో తనతోపాటే తీసుకెళ్లి, బైకు మీద కూర్చో బెట్టుకొని స్విగ్గీలో డెలివరీ ఏజెంట్ విధులను నిర్వరిస్తున్నాడు. ఇది చాలా రిస్క్‌తో కూడినదే కానీ కానీ పనిచేయకపోతే బతుకు దెరువు కష్టం కదా అన్న పంకజ్ మాటలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి. చాలా రిస్క్ బాస్ అంటూ కొందరు విమర్శిస్తుండగా, శభాష్, హాట్సాఫ్ పంకజ్ అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే గిగ్ వర్కర్ల కనిపించని కష్టాలు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకొందరు అతనికి సాయం చేసేందుకు ముందుకు వస్తుండటం విశేషం.చదవండి: పానీ పూరీ తినడం నేర్చుకున్న అందాల సుందరి ఎవరంటే..!

పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,650 (22 క్యారెట్స్), రూ.95,620 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.160 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,620 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 పెరిగి రూ.87,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.160 పెరిగి రూ.95,770 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
అషూ అందాల జాతర.. క్యూట్ గా మాయ చేస్తున్న రితిక
‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’
ఇంటిగ్రేటెడ్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్: లక్ష్యాలు ఇవే..
IPL 2025: గుజరాత్, ఆర్సీబీ, ముంబై జట్లకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
ఆర్థిక భద్రతకు టర్మ్ ఇన్సూరెన్స్: అధ్యయనంలో వెల్లడైన విషయాలు
రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్
‘దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు’
'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం
హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
HMDA: ‘అనుమతులు’ ఎప్పుడిస్తరు?
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
భార్య ప్రసవం కోసం వచ్చి
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
అషూ అందాల జాతర.. క్యూట్ గా మాయ చేస్తున్న రితిక
‘మోదీ జీ.. మీరు దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘం’
ఇంటిగ్రేటెడ్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్: లక్ష్యాలు ఇవే..
IPL 2025: గుజరాత్, ఆర్సీబీ, ముంబై జట్లకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
ఆర్థిక భద్రతకు టర్మ్ ఇన్సూరెన్స్: అధ్యయనంలో వెల్లడైన విషయాలు
రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్
‘దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు’
'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం
హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
HMDA: ‘అనుమతులు’ ఎప్పుడిస్తరు?
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
భార్య ప్రసవం కోసం వచ్చి
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
సినిమా

సమంత కొత్త జర్నీ.. సక్సెస్ అయినట్లేనా?
స్టార్ హీరోయిన్ సమంత(samantha) కొత్త జర్నీ ప్రారంభించింది. ఇన్నాళ్లు తన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలను ప్రేక్షకులను అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.మూడు రోజుల్లో 5.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌తో పోలిస్తే..ఇది మంచి నెంబరనే చెప్పాలి. ఓవరాల్‌గా ఈ చిత్రానికి రూ. 3.5 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. రిలీజ్‌కి ముందే సమంత తనకున్న పలుబడితో టేబుల్ ప్రాఫిట్‌ని పొందినట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ హక్కులను మంచి రేటుకే అమ్మేసిందట. షూటింగ్‌కి ముందే ‘జీ’ సంస్థతో డీల్ కుదుర్చుకుందట సమంత. సినిమా మొత్తం ఓ సీరియల్ చుట్టు తిరుగుతుంది.. అది జీ టీవీలో ప్రసారం అయ్యే సీరియల్‌గా చూపిస్తామని ‘బ్రాండింగ్’మాట్లాడుకున్నారట. ఆ తర్వాత అదే సంస్థ ఓటీటీ, శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. నిజానికి ఇలాంటి చిన్న సినిమాకి రిలీజ్ ముందే బిజినెస్ జరగడం చాలా అరుదు. పెద్ద పెద్ద సినిమాలకే ఓటీటీ బిజినెస్ కావడం లేదు. సమంత ఉంది కాబట్టే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రిలీజ్‌కి ముందే సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ తర్వాత మంచి టాక్ రావడం.. వసూళ్లు రోజు రోజుకి పెరగడంతో ‘శుభం’తో సమంతకు మంచి లాభాలే వచ్చేశాయి. మొత్తానికి సమంత కొత్త జర్నీ లాభాలతోనే ప్రారంభం అయింది. భవిష్యత్తులో ఆమె బ్యానర్ నుంచి మరిన్ని క్వాలిటీ సినిమాలు, బలమైన కథలతో వస్తే, 'సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్'గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.

వీకెండ్ విన్నర్ '#సింగిల్'.. వసూళ్లు ఎంతొచ్చాయంటే?
గత వీకెండ్ మూడు నాలుగు సినిమాలు రిలీజైతే వాటిలో శ్రీ విష్ణు '#సింగిల్' హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలానే కలెక్షన్లలోనూ మంచి జోరు చూపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. అలానే లాభాలు కూడా వస్తున్నాయి. ఈ కామెడీ మూవీకి ఇప్పటివరకు ఎంత వసూళ్లు వచ్చాయి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన '#సింగిల్' సినిమాకు నాలుగు రోజుల్లో రూ.19.01 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. గత వీకెండ్ లో సమంత నిర్మించిన శుభం కూడా విడుదలైంది గానీ ఈ సినిమా దెబ్బకు పూర్తిగా డల్ అయిపోయినట్లు కనిపిస్తుంది.ట్రెండింగ్ సోషల్ మీడియా కంటెంట్ బేస్ చేసుకుని రాసుకున్న జోక్స్.. సింగిల్ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. అలానే శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కాంబో కూడా క్లిక్ అయింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీకే ఓటేస్తున్నారు. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి సింగిల్ చిత్రానికే ప్లస్ అవ్వొచ్చనిపిస్తోంది.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా)

చూస్తుంటేనే భయానకం... 14 ఏళ్ల తర్వాత ఆరో భాగం రిలీజ్
ఫైనల్ డెస్టినేషన్.. హాలీవుడ్ లో ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చావు ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ సినిమాల్లో చూపించారు. మన చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువులే మన ప్రాణాలు తీస్తాయి అని భయపెట్టారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోని ఆరో భాగం విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ముందురోజు 15వ తేదీనే మన దేశంలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ చేస్తుండటం విశేషం. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అవుతోంది. ఇదే చివరిది కూడా.కొన్నాళ్ల క్రితమే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది కూడా భయపెట్టేసింది. ఇంటి పెరటిలో ఓ ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్లని చావు వెంటాడుతుంది. బీర్ గ్లాస్ ముక్క, వాక్యూమ్ క్లీనర్.. ఇలా అక్కడున్న ప్రతి వస్తువు వీళ్ల చావుకు కారణమయ్యేలా ఉంటుంది. మరి చావు నుంచి తప్పించుకున్నారా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ట్విన్స్ కి జన్మనిచ్చిన హాలీవుడ్ ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?)

ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు డబ్బింగ్ చిత్రాలు నేరుగా తెలుగు స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?కొరియోగ్రాఫర్ గా మనకు తెలిసిన ప్రభుదేవా.. గత కొన్నాళ్ల నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. హీరో, సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన మూవీ 'జాలీ ఓ జింఖానా'. గతేడాది నవంబరులో తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా)మే 15 నుంచి ఆహా ఓటీటీలో ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. శవం బ్యాక్ డ్రాప్ కథతో తీసిన ఈ చిత్రం తమిళంలో జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. 'జాలీ ఓ జింఖానా' విషయానికొస్తే.. తంగసామి అనే వ్యక్తి కొందరు మహిళలతో కలిసి హోటల్ నడుపుతుంటాడు. అనుకోకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేతో వీళ్లకు గొడవ అవుతుంది. దీని తర్వాత మరో సమస్య వస్తుంది. దీన్ని నుంచి గట్టెక్కిస్తాడని ఓ లాయర్ దగ్గరకు వీళ్లంతా వెళ్తారు. అతడికి కలవడానికి వెళ్లేసరికి అతడు శవమై కనిపిస్తాడు. ఇంతకీ ఎలా చనిపోయాడు? బతికున్నాడని కవర్ చేయడానికి ఎలాంటి పాట్లు పడ్డారనేదే స్టోరీ.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా)They packed bags, snacks… and a dead body? 🚗💀Discover the most unexpected family journey in #JollyOGymkhana on aha!Watch #jollyogymkhana from May 15 on #aha#prabhudeva #Pujithaponnada #yogibabu #MadonnaSebastian pic.twitter.com/LGhsS1qCCW— ahavideoin (@ahavideoIN) May 13, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్
జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (మే 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు పేసర్లకు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) చోటు దక్కింది. లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుండటంతో సౌతాఫ్రికా సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయించారు.పేస్ దళంతో పోలిస్తే సౌతాఫ్రికా బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. ఆ జట్టులో బవుమా, మార్క్రమ్ మినహా అనుభవజ్ఞులైన బ్యాటర్లు లేరు. రికెల్టన్, స్టబ్స్, డేవిడ్ బెడింగ్హమ్ లాంటి పరిమిత ఓవర్ల స్టార్లు ఉన్నా టెస్ట్‌ల్లో వారు ఏ మేరకు రాణించగలరో చూడాలి.TEMBA BAVUMA ANNOUCING SOUTH AFRICA SQUAD FOR WTC FINAL. 🥶🔥 pic.twitter.com/uZbtbcxAGn— Johns. (@CricCrazyJohns) May 13, 2025డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికాకు ఇదే తొలి ఫైనల్. 1998 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. మరోవైపు ఫైనల్లో సౌతాఫ్రికా ఎదుర్కోబోయే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఆ జట్టు గత ఎడిషన్ (2021-23) ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియా కూడా ఇవాళే జట్టును ప్రకటించింది. ఆసీస్ జట్టుకు సారధిగా పాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ చాలా కాలం తర్వాత ఆసీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కెమారూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, మ్యాట్ కుహ్నేమన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్ఐపీఎల్ జట్టుకు షాక్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇవాళ ప్రకటించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లలో 13 మంది ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐదుగురు కాగా.. సౌతాఫ్రికాకు చెందిన వారు ఎనిమిది మంది. ఐపీఎల్ 2025 పూర్తైన వారం రోజులకే డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానుండటంతో ఈ 13 మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు ఏమేరకు అందుబాటులో ఉంటారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఐపీఎల్ 2025 స్టార్లు..ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్ (ఎస్ఆర్హెచ్)ట్రవిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్)జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)సౌతాఫ్రికా ఆటగాళ్లు..మార్క్రమ్ (లక్నో)ఎంగిడి (ఆర్సీబీ)స్టబ్స్ (ఢిల్లీ)కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)జన్సెన్ (పంజాబ్)రబాడ (గుజరాత్)ముల్దర్ (ఎస్ఆర్హెచ్)

ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్ అయ్యింది. మే 8న రద్దైన ఐపీఎల్ 2025, మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న రాత్రి ప్రకటించింది. మే 8న 10 ఓవర్ల పాటు సాగి రద్దైన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ ఈ నెల 24న మొదటి నుంచి నిర్వహించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు నిన్న ప్రకటించిన రీ షెడ్యూల్‌కు చాలా తేడాలున్నాయి. వేదికలు చాలా వరకు మారాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలు ఖరారు కావాల్సి ఉంది. క్యాష్ రిచ్ లీగ్ జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 వాయిదా పడటం ప్లే ఆఫ్స్‌కు అతి చేరువలో ఉన్న ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండటం, గాయాల బారిన పడటంతో జట్టును వీడనున్నారు. ఐపీఎల్ వాయిదాకు ముందే ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయపడ్డారు. పాటిదార్ ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత కూడా కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతాడు. పాటిదార్ స్థానంలో కొన్ని మ్యాచ్‌లకు విరాట్ కోహ్లి లేదా జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.రీ షెడ్యూల్లో ఆర్సీబీ ఆడబోయే మ్యాచ్‌లకు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఐపీఎల్ పూర్తికాక ముందే (మే 29) ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ మొదలవుతుంది. ఐపీఎల్ పూర్తైన వారం రోజులకే (జూన్ 11) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు చెందిన ఆటగాళ్లు ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.ఆర్సీబీ జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు: ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్వెస్టిండీస్ ఆటగాళ్లు: రొమారియో షెపర్డ్మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐపీఎల్ ఫైనల్ తర్వాత వారం రోజుల సమయమున్నా (డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం).. ఆ దేశ క్రికెట్ బోర్డు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్ల చాయిస్‌కే వదిలిపెట్టింది. దీంతో ఆ దేశ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడైన జోష్ హాజిల్‌వుడ్ తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమేనని తెలుస్తుంది. హాజిల్‌వుడ్ పోతే ఎంగిడి ఉన్నాడులే అనుకుంటే అతను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌నే తన మొదటి ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.ఈ లెక్కన చూస్తే ఆర్సీబీలో టిమ్ డేవిడ్ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేదు. శ్రీలంక పేసర్ నువాన్ తుషార ఉన్నా అతను ఏ మేరకు అందుబాటులో ఉంటాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తంగా చూస్తే, ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీని ఐపీఎల్ వాయిదా పడటం దారుణంగా దెబ్బకొట్టింది. ఆ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోతే లయ తప్పే ప్రమాదముంది. ఈ సీజన్‌పై ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సాలా కప్ నమ్మదే అని ఆర్సీబీ అభిమానులు ఇప్పుడిప్పుడే నమ్మడం మొదలుపెట్టారు. ఈ లోపే భారత్, పాక్ మధ్య యుద్దం మొదలై ఆర్సీబీ గెలుపు జోష్‌ను దెబ్బకొట్టింది. మరి, ఉన్న వనరులతో ఆర్సీబీ మున్ముందు మ్యాచ్‌ల్లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఐపీఎల్ వాయిదాకు ముందు ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, స్వస్థిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాఠీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, రసిఖ్ దార్ సలామ్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ భారత తుదిజట్టు ఇదే!
టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకోకుండానే విరాట్ కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్లో 123 టెస్టులాడిన ఈ దిగ్గజ బ్యాటర్.. 9230 పరుగుల వద్ద నిలిచిపోయాడు. అతడి టెస్టు కెరీర్లో 31 అర్ధశతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఫోర్లు 1027 కాగా.. సిక్సర్లు 30. అందుకున్న క్యాచ్‌లు 121.ఇక కెప్టెన్‌గానూ టెస్టుల్లో కోహ్లి చెరగని ముద్ర వేశాడు. సారథిగా మొత్తంగా టీమిండియాకు నలభై విజయాలు అందించి.. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ప్రయాణంలో కోహ్లి కలిసి టెస్టుల్లో ఆడిన భారత అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేయాలంటే..!ఓపెనింగ్ జోడీ.. టాపార్డర్ ఇదేవీరేందర్ సెహ్వాగ్.. కోహ్లితో కలిసి ఆడిన సమయంలో 83.79 స్ట్రైక్‌రేటుతో కనీసం 400 పరుగులు సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ.. కోహ్లి కెప్టెన్సీలో టాపార్డర్‌కు ప్రమోట్ అయిన హిట్‌మ్యాన్.. కోహ్లితో కలిసి దాదాపు 60 మ్యాచ్‌లు ఆడాడు.అలా రోహిత్ ఖాతాలో 3772 పరుగులు జమయ్యాయి. ఇక వన్‌డౌన్‌లో రాహుల్ ద్రవిడ్‌కే ఓటు వెయ్యవచ్చు. కోహ్లితో కలిసి ద్రవిడ్ ఎనిమిది టెస్టులు మాత్రమే ఆడాడు.ఇక ఛతేశ్వర్ పుజారా విషయానికొస్తే.. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చెప్పవచ్చు. 19 శతకాల సాయంతో 6664 రన్స్ సాధించాడు పుజ్జీ. అయితే, తనకంటే టెస్టు బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో వాల్ రాహుల్ ద్రవిడ్ ఉండటమే ఉత్తమమని గతంలో పుజారా పేర్కొన్నాడు.మిడిలార్డర్ ఇలాకాబట్టి ఈ జట్టులో అతడికి చోటు దక్కడం లేదు. ఇక నాలుగో స్థానంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్. కోహ్లితో కలిసి 17 టెస్టుల్లో భాగమైన సచిన్ 835 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి ఆడే సమయంలో సచిన్ నాలుగు, కోహ్లి ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేవారు.ఇక్కడ అత్యుత్తమ జట్టులోనూ అదే కొనసాగిస్తే బాగుంటుంది కదా! ఇక ఆరోస్థానం విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోని కంటే.. రిషభ్ పంత్ ఇక్కడ బెటర్ అనిపిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ టెస్టుల్లో ధోనిని మించిపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA)లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈసారి అతడికే ఓటు వేయవచ్చు.కోహ్లితో ఆడిన సమయంలో ధోని 1587 పరుగులు చేయగా.. పంత్ మాత్రం ఏకంగా 2657 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు శతకాలు కూడా ఉండటం విశేషం.అదరగొట్టిన స్పిన్ ద్వయంకోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అశ్విన్ కోహ్లి ఉన్న జట్టులో భాగమై ఏకంగా 475 వికెట్లు తీస్తే.. జడ్డూ 282 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటర్‌గా అశూ 3140 రన్స్ సాధిస్తే.. జడేజా 2920 పరుగులు చేశాడు.పేస్ దళంలో వీరేకోహ్లితో కలిసి.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ 13 టెస్టులు ఆడి.. 38 వికెట్లు కూల్చాడు. భారత జట్టు యువ రక్తంతో నిండిపోతున్న తరుణంలోనూ తన మార్కు చూపించాడు.ఇక మహ్మద్ షమీ.. కోహ్లితో కలిసి ఆడుతూ ఈ రైటార్మ్ పేసర్ 226 వికెట్లు పడగొట్టాడు. మరి జస్ప్రీత్ బుమ్రా ఈ జట్టులో లేకపోతే ఎలా?.. కోహ్లి కెప్టెన్సీలో రాటుదేలిన బుమ్రా 176 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ భారత తుదిజట్టు ఇదే..వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!

గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియా మీద కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి స్థానాల్ని భర్తీ చేసేదెవరన్న చర్చ నడుస్తోంది. కాగా గత కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో ఘోర పరాభవాలు చవిచూసిన భారత జట్టు.. తదుపరి ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.ఇరు జట్ల మధ్య ఈ మేర ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ కీలక సిరీస్‌కు టీమిండియా ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.పనిభారం పడకుండా ఉండేందుకే?ఇక ఈ సిరీస్ నుంచి యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బుమ్రా కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టెస్టు కెప్టెన్‌గా బుమ్రానే సరైనోడుటీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కాదని.. బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రతి ఒక్కరు పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి అతడికి మాత్రమే ఈ వర్క్‌లోడ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుంది.ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదు. ఎందుకంటే కెప్టెన్‌గా ఇతరులు ఎవరు ఉన్నా.. బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారు. మరి అలాంటపుడు పనిభారం పెరగదా?జట్టులో బుమ్రా నంబర్ వన్ బౌలర్. తనే కెప్టెన్‌గా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలడు. అందుకే నా వరకైతే జస్ప్రీత్ బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్‌గా నియమించాలి.పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు. కెప్టెన్‌గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో వ్యాఖ్యానించాడు.గతంలోనూ నాయకుడిగాకాగా బుమ్రా గతంలో ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలుత పెర్త్‌లో.. ఆఖరిగా సిడ్నీలో ఐదో టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి తిరగబడటంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్-2025తో ఇటీవలే పునరాగమనం చేశాడు. ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!
బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన మార్కెట్లు ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 172 పాయింట్లు నష్టపోయి 24,744కు చేరింది. సెన్సెక్స్(Sensex) 686 ప్లాయింట్లు పడిపోయి 81,753 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 3.26 శాతం లాభపడింది. నాస్డాక్ 4.35 శాతం ఎగబాకింది.టారిఫ్‌ల తగ్గింపు వల్ల, ఎల్రక్టానిక్స్, మెషినరీ, రసాయనాలు వంటి అధిక విలువ చేసే ఉత్పత్తులకు సంబంధించి అమెరి–చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరగవచ్చిన మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ పరిణామంతో భారత ఎగుమతిదార్లకు సవాళ్లు ఎదురుకావచ్చన్నారు. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలాంటి మార్కెట్లో చొచ్చుకుపోయిన భారత ఎగుమతిదార్లకు పోటీ పెరగవచ్చని చెబుతున్నారు. కానీ, ఆ రెండు దేశాల వాణిజ్య పరిధిలోకి రాని ఇతర రంగాలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: అన్ని ఐటీఆర్ పత్రాలు నోటిఫైమార్కెట్లో ఇటీవల లాభాలు ఎందుకంటేపహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో కాల్పులు పరిణామాలతో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వంలో, అనేక దౌత్యప్రయత్నాల తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఊపువచ్చింది. అమెరికా–చైనాల మధ్య ‘టారిఫ్ వార్’ సైతం ఒక కొలిక్కి వచ్చింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు సఫలమై ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ టారిఫ్‌లను 115% మేర తగ్గించుకోవడంతో పాటు కొత్త సుంకాలకు 90 రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ మార్కెట్లకు ఫుల్ జోష్ వచ్చింది. ఈక్విటీ ఫండ్లలోకి సిప్ల ద్వారా ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ.26,632 కోట్లు పెట్టుబడులు రావడం, అంతర్జాతీయ క్రిడెట్ రేటింగ్ ఏజెన్సీ మార్నింగ్‌స్టార్ డీబీఆర్ఎస్ భారత సావరిన్ క్రిడెట్ రేటింగ్‌ను దీర్ఘకాలానికి బీబీబీ(కనిష్టం) నుంచి బీబీబీ(స్థిరత్వం)కి అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలు మార్కెట్ల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

అన్ని ఐటీఆర్ పత్రాలు నోటిఫై
ఆదాయపన్ను శాఖ మొత్తం ఏడు ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) పత్రాలను నోటిఫై చేసింది. తద్వారా రిటర్నుల దాఖలుకు ఇవి అందుబాటులోకి వచ్చినట్టయింది. గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను జులై 31లోగా దాఖలు చేయాల్సి ఉంది. వ్యక్తులు, ఖాతాల ఆడిటింగ్ లేని వారికి ఈ గడువు వర్తించనుంది.ఐటీఆర్ 2, 3, 5, 6, 7లో మూలధన లాభాల స్థిరీకరణకు సంబంధించి మార్పు చోటుచేసుకుంది. దీనికింద పన్ను చెల్లింపుదారులు తమ మూలధన లాభాలను 2024 జులై 23కు ముందు, ఆ తర్వాత అని రెండు భాగాలుగా చూపించాల్సి ఉంటుంది. అలాగే, ఐటీఆర్ 1, 4కు సంబంధించి కూడా మరో మార్పు జరిగింది. వేతన జీవులు రూ.1.25 లక్షలు మించని దీర్ఘకాల మూలధన లాభం కలిగినప్పుడు ఐటీఆర్ 1 లేదా 4 ఎంపిక చేసుకోవచ్చు. గతంలో వీరు ఐటీఆర్ 2 దాఖలు చేయాల్సి వచ్చేది. వేతనంతోపాటు దీర్ఘకాల మూలధన లాభాలు రూ.1.25 లక్షలకు మించితే అప్పుడు ఐటీఆర్ 2ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలువ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025ఆడిట్ అవసరమయ్యే వ్యక్తులు, వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025కంపెనీలు: అక్టోబర్ 31, 2025

జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రమోటర్ల రాజీనామా
సంక్షోభంలో చిక్కుకున్న జెన్సోల్ ఇంజినీరింగ్ సంస్థ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ తమ పదవులకు రాజీనామా చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారు కంపెనీ నుంచి తప్పుకున్నారు. అన్మోల్ సింగ్ జగ్గీ ఎండీగా, పునీత్ సింగ్ జగ్గీ హోల్‌టైమ్ డైరెక్టరు పోస్టులకు రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలియజేసింది. అలాగే, వారిద్దరూ ఇకపై వివిధ కమిటీల్లో సభ్యులుగా కూడా ఉండబోరని పేర్కొంది. నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాల ఆరోపణలపై సెబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో రూ.848 కోట్ల పెట్టుబడిజెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది.

క్విక్ కామర్స్ కంపెనీలో కీలక పెట్టుబడులు
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహవ్యవస్థాపకులు మోతీలాల్ ఓస్వాల్, రామ్‌దేవ్ అగర్వాల్ తాజాగా క్విక్‌కామర్స్ కంపెనీ జెప్టోలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విడిగా 5 కోట్ల డాలర్లు(రూ.424 కోట్లు) చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెకండరీ లావాదేవీ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. వీటి విలువ 10 కోట్ల డాలర్లు(రూ.848 కోట్లు)గా ఉంది.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో 25 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న జెప్టో తాజా లావాదేవీ ద్వారా దేశీ యాజమాన్య వాటా పెంపువైపు సాగుతున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ యాజమాన్యానికి కంపెనీలో 42% వాటా ఉంది. ఇతర లావాదేవీల ద్వారా ఐపీవో కంటే ముందే వాటాను 50%కిపైగా పెంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024 ఆగస్ట్‌లో సాధించిన 5 బిలియన్ డాలర్ల విలువలో లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించాయి. కాగా.. మోతీలాల్ ఓస్వాల్ ఆధ్వర్యంలో ఎడిల్వీజ్, హీరో ఫిన్‌కార్ప్ తదితర సంస్థలు 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్లు సమచారం. తదుపరి దశలో భాగంగా 25 కోట్ల డాలర్ల పెట్టుబడికి జూన్‌లో తెరతీయనున్నట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీ

ఒత్తిడిని దూరం చేసే చిట్టిపొట్టి చేపలు..!
హైదరాబాద్ నగరంలో గృహ అక్వేరియం సంస్కృతి అంతకంతకూ విస్తరిస్తోంది. పాత అలంకరణే అయినా నగరవాసులు తమ ఇళ్లలో అక్వేరియంలను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త ఆహ్లాదకర వాతావరణాన్ని ఇష్టపడుతున్నారు. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను పొందేందుకు కూడా ఉపయోగపడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ఇంట్లో గడిపే సమయం పెరిగినప్పుడు అక్వేరియంల పట్ల ఆదరణ రెట్టింపైనట్టు అంచనా. ప్రస్తుతం వేసవి సెలవుల్లోనూ పిల్లలు, పెద్దలు వీటి వద్ద ఎక్కువ సమయం గడుపుతున్నారు. భాగ్యనగరంలోని గృహ అక్వేరియమ్స్లో పలు ఫిష్ వెరైటీలు సందడి చేస్తున్నాయి. వాటిలో గుప్పీ, బెట్టా, నియాన్ టెట్రా, కార్డినల్ టెట్రా, గోల్డ్ఫిల్డ్, కాయ్, ఫ్లవర్‌హార్న్ వంటి చేపలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చేపలు అందమైన రంగులు, ఆకారాలతో ఆకట్టుకుంటున్నాయిపలు చోట్ల అందుబాటులో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అక్వేరియం స్ట్రీట్ సహా అనేక చోట్ల అక్వేరియం షాపులు, బజార్లు ఉన్నాయి, అదే కాకుండా ఫిషీకార్ట్, బెస్ట్ 4పెట్స్ వంటి ఆన్లైన్ స్టోర్లు కూడా భిన్న రకాలైన చేపలు, ట్యాంకులు, ఆక్వాటిక్ ప్లాంట్స్, ఫిష్ ఫుడ్, ఫిల్టర్లు, ఇతర ఉపకరణాలను ఇంటి ముంగిటకే డెలివరీ చేస్తున్నాయి. ధరలు ఇలా.. అక్వేరియంకు ఉపయోగించేందుకు అవసరమైన చిన్న ట్యాంకులు (5–10 లీటర్లు) ధరలు రూ.1,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. మధ్యస్థ ట్యాంకులు (20–50 లీటర్లు): రూ.2,000 నుంచి రూ.5,000 వరకు, పెద్ద ట్యాంకులు (60 లీటర్లు పైగా): రూ.6,000 నుంచి రూ.15,000 వరకూ అందుబాటులో ఉన్నాయి. ఇక చేపలలో గుప్పీ, టెట్రా వంటి సాధారణ చేపలు రూ.30 నుంచి రూ.100 వరకు ఉన్నాయి. బెట్టా, కాయ్ వంటి ప్రత్యేక చేపలు రూ.100 నుండి రూ.500 వరకూ ధరల్లో లభిస్తున్నాయి. ఫిల్టర్లు, హీటర్లు, వంటి ఉపకరణాలు, లైటింగ్, డెకరేషన్ వస్తువులు రూ.500 నుండి రూ.2,000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఫిష్ వెరైటీలు.. ప్రత్యేకతలు.. గప్పీస్ : ఇవి చిన్నదైన, రంగురంగుల మత్సా్యల్లా వివిధ రంగుల్లో లభిస్తాయి.. సులభంగా సంరక్షించగలగడం వల్ల కొత్తవారికి మంచి ఎంపిక. మోల్లీస్ : ఇవి శాంతస్వభావ చేపలు. తక్కువ ఖర్చుతో పెంచవచ్చు. స్వీట్ వాటర్‌కి స్వల్ప ఉష్ణోగ్రత మార్పులకు అనువుగా ఉంటాయి. ప్లాటీస్: చిరు తడిగా సంచరించే ఇవి పిల్లలకు ఎంతో ఇష్టమైనవి. మిశ్రమ ఆహారంతో పెంచవచ్చు. బహుళ రంగుల్లో లభిస్తాయి. గోల్డ్‌ఫిష్ : శతాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ఈ చేపలు కొంచెం ఎక్కువ స్థలంతో కూడిన ట్యాంక్‌లో ఉంచాలి. శుభ్రత సరైన ఆహారానికి వీటికి బాగా అవసరం. టెట్రాస్ (Tetras) : ఇవి గుంపులుగా తిరిగే చేపలు. నియాన్ టెట్రాస్ వంటి జాతులు ఎంతో ప్రసిద్ధి. వీటికి సాఫ్ట్ వాటర్, మితమైన ఉష్ణోగ్రత అవసరం. ఏంజెల్ ఫిష్ : విలక్షణమైన ఆకారంతో ఇవి గుంపులుగా స్వేచ్ఛగా తిరుగుతాయి. సాఫ్ట్ వాటర్ సరైన ట్యాంక్ స్నేహస్వభావం కలిగిన చేపలతో పెంచితే మంచిది. బెట్టా ఫిష్.. గృహ అక్వేరియానికి ప్రత్యేక ఆకర్షణ.. అందమైన రెక్కలు, ప్రకాశవంతమైన రంగులు, చురుకైన స్వభావం.. ఇవన్నీ బెట్టా చేపలకు గుర్తింపు తెచి్చన లక్షణాలు. ‘సియామ్ ఫైటింగ్ ఫిష్’గా కూడా ప్రసిద్ధిగాంచిన ఈ చేపలు నగర గృహాల్లోని అక్వేరియంలలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. బెట్టా చేపలు తాయ్లాండ్, కంబోడియా వంటి ఆసియన్ దేశాలకు చెందినవి. మగ బెట్టాలు తమ ప్రదేశాన్ని రక్షించేందుకు ఇతర మగ చేపలపై దాడికి కూడా వెళతాయి. అందువల్ల ఒక ట్యాంక్‌లో ఒక్క మగ బెట్టా చేపను మాత్రమే ఉంచడం సురక్షితం. దీనిని పెంచడానికి కనీసం 5 లీటర్ల నీటి సామర్థ్యం ఉండే ట్యాంక్ అవసరం. చిన్న గాజు గిన్నెల్లో కాకుండా గాలి పంపు, హీటర్ కలిగిన ట్యాంక్ మంచిది. ఈ బెట్టా చేపలు 24డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలో జీవిస్తాయి. వీటికి ప్రత్యేకమైన బెట్టా పెలెట్స్, అకేషనల్ బ్లడ్ వారŠమ్స్, లేదా బ్రెయిన్ ష్రింప్స్ వంటివి రోజుకు రెండు సార్లు ఆహారంగా ఇవ్వాలి. ఇవి బ్లూ, రెడ్, వైట్, పర్పుల్, మెటాలిక్ షేడ్స్‌లో లభ్యమవుతాయి. హాఫ్ మూన్, క్రౌన్ టెయిల్, ప్లాకాట్ వంటి రెక్కల ఆకారాల్లోనూ ఉన్నాయి. ఈ సూచనలు పాటించాలి..ప్రతి చేపకు తనదైన ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటిపై అవగాహన, ఆహారం, నీటి శుభ్రత, పీహెచ్ స్థాయి వంటి అంశాల్లో శ్రద్ధ అవసరం. మొదటిసారిగా చేపలు పెంచే వారు గప్పీస్ లేదా ప్లాటీస్తో ప్రారంభించడం మంచిది. ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి ముందు, స్టోర్ గురించిన రివ్యూలు, రేటింగ్స్ పరిశీలించాలి. చేపల ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు, స్టోర్ నుంచి ఆరోగ్య సర్టిఫికెట్లు లేదా గ్యారంటీల వంటివి ఉన్నాయేమో చూడాలి. అక్వేరియం నిర్వహణకు సంబంధించిన సూచనలు మార్గదర్శకాలను స్టోర్ నుంచి పొందగలిగితే బెటర్. ప్రస్తుతం ట్యాంకులు శుభ్రపరిచేందుకు హానికరమైన వ్యర్థాలను తినేందుకు ప్రత్యేకంగా పలు వెరైటీల ఫిష్‌లు అందుబాటులోకి వచ్చాయి వాటిని పరిశీలించాలి.(చదవండి: ఇంటి 'గుట్టు' వంటింటికి చేటు..!)

పానీ పూరీ తినడం నేర్చుకున్న అందాల సుందరి ఎవరంటే..!
అందం అంటే స్వతహాగా మనం ఉండే విధానమే. అందానికి సూత్రాలేం లేవు. దేనినైనా స్వతహాగా ఆస్వాదించడమే అందం. ఇదే ప్రపంచంలోని అందమైన వైవిధ్యం అన్నారు హూన్ త్రాన్ నీ. తెలంగాణ (హైదరాబాద్) వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025పోటీల నేపథ్యంలో మిస్ వరల్డ్ వియత్నామ్ హూన్ త్రా నీ ‘సాక్షి’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. భారతీయతను, మానవత్వాన్ని, భిన్న సంస్కృతుల అద్భుత సమ్మేళనాన్ని గొప్పగా వర్ణించిన హూన్ త్రాన్ సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..!!ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి నన్ను ఆహ్వానించిన విధానం, ఇక్కడి సంస్కృతిలోని ఆప్యాయత నాకెంతో నచ్చింది. తెలంగాణ స్థానిక సంస్కృతిలో ప్రదర్శించిన నృత్యాలు నన్ను అబ్బుర పరిచాయి. ఇక్కడి కళాకారుల్లో ఒక వైవిధ్యముంది. ఇక్కడి ఆతిథ్యం నాకు మరో ఇంటిని తలపిస్తోంది. నేను బస చేస్తున్న హోటల్ సిబ్బంది నా కోసం పర్యావరణహితమైన పదార్థాలతో తయారు చేసిన అందమైన బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు. మరో సిబ్బంది నా కోసం వియత్నామీస్ భాషలో రాసిచ్చిన లేఖ నన్ను హత్తుకుంది. ఇంటికి దూరంగా ఉన్న నాకు ఈ లేఖ ఎంతో సాంత్వనను అందించింది. ఇవన్నీ ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీకలు. హైదరాబాద్‌లో నాకు బాగా నచ్చిన అంశం పానీ పూరీ. వియత్నాం, నేను చదువుకునే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పుడూ ఇంత రుచికరమైనది తినలేదు. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీ పూరీ ఎలా తినాలో నేర్చించింది. నా దేశం అందమైన, సాంస్కృతికమైన దేశం. మిస్ వరల్డ్ అంటే.. తమ దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. వ్యక్తిగత విశిష్టత గురించి గొప్పగా ప్రదర్శించే ప్రపంచ వేదిక. ఈ స్ఫూర్తితోనే నేను వియత్నామీస్ ఆత్మస్థైర్యం, సామాజిక బాధ్యత గల అమ్మాయిగా మిస్ వరల్డ్ వేదిక పైన సగర్వంగా నిలుచున్నాను. మిస్ థాయ్‌లాండ్ ఓపాల్, మరో దేశ వనిత సోమ నాకు స్ఫూర్తినిచ్చారు. సామాజికంగా ఎదురయ్యే కొన్ని అడ్డంకులు, అవరోధాలను ఎలా ఎదుర్కోవాలో వారి కథలు విని నేర్చుకున్నాను.ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించానువిద్య–విఙ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడి జీవితాలు బాగుంటాయని నమ్ముతాను. అందుకే మా దేశంలో ‘హర్టీ హెల్ప్’ అనే ప్రాజెక్ట్ చేపట్టాను. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్ థీమ్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించాను, అక్కడి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడానికి బుక్ రూంలను ఏర్పాటు చేశాను. నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేస్తున్నాను.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీరపుస్తకాలే నాకు సాంత్వన నా ఫ్యాషన్ మోడలింగ్‌లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. దానిని అధిగమించడానికి నాకు తోడుగా నిలిచింది పుస్తకాలు మాత్రమే. పుస్తకాలే నాకు గురువులు, స్నేహితులు, సాంత్వన. వ్యక్తులు, వ్యక్తిత్వాలు, సామాజిక అంశాలను రచయితలు ఎంతో హృద్యంగా మనకు చేరవేస్తారు. ‘ఎలయర్’ అనే పుస్తకం నాకెంతో నేర్పించింది. ఎప్పుడైనా సరే ఇతరుల విజయాన్ని చూసి మనల్ని పోల్చుకోవద్దు. వారి విజయాలకు కారణాలు వేరు. మన వాస్తవ పరిస్థితులు వేరు. ప్రతీ ఒక్కరికి ఒక వినూత్నమైన దారి ఉంటుంది, ఒక అందమైన ప్రయాణముంటుంది. అందరినీ గౌరవించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయి. నేనూ వాటిని దాటుకునే వచ్చిన దానినే. ఈ సందర్భంగా నేనొక విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో దయతో ఉండండి. ఎవరినీ తక్కువ చేసి చూడొద్దు, సామాజిక అసమానతలు, అస్పశ్యతలు నాలాంటి అమ్మాయిలను వేదనకు గురి చేస్తాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ వేదికపైన చెప్పాలనుకున్నాను.. కానీ ‘సాక్షి’ దీనిపై నన్ను స్పందన కోరడంతో ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరిని గౌరవించండి, వారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. – హూన్ త్రాన్ – హనుమాద్రి శ్రీకాంత్ ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

సాయంకాలాన.. సాగరతీరాన.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల సందడి..!
సాయంకాలాన.. సాగర తీరాన.. అని ఇటీవల ఓ చిత్రంలోని పాట గుర్తొచ్చేలా.. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన పోటీదారులు సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి చేశారు. ఇందులో భాగంగా కొందరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించి తెలంగాణ విశిష్టతలను తెలుసుకున్నారు. ఇక్కడ నిర్మితమైన చారిత్రక కట్టడాల తిలకించి వాటి ప్రత్యేకతలను ఆరాతీశారు. భాగ్యనగరం అంటేనే ఓ చారిత్రక నేపథ్యం ఉన్న నగరం.. ఇక్కడ విభిన్న రకాల సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసి ఉంటాయి. అలాంటి సమ్మిళితమైన జీవనశైలి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాగే మిస్ వరల్డ్ పోటీదారులను నగర సంస్కృతి ఆకట్టుకుంటోంది. మిస్ వరల్డ్ పోటల్లో పాల్గొంటున్న ఆయా దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంలో పాలుపంచుకుంటూ నగరంలో సందడి చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు ఆహ్వానం మొదలు గచ్చిబౌలి ప్రారంభ వేడుకల వరకూ నగర ప్రత్యేకతలను ఆశ్చర్యంగా ఆరా తీస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయా చారిత్రక, ప్రత్యేక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక ఎక్స్పీరియం పార్క్‌ను సందర్శించి అక్కడ ప్రత్యేకంగా నిర్వహించిన టమాటోరినా ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఇక మంగళవారం చారిత్రాత్మక లాడ్ బజార్లో, చార్మీనార్ వీధుల్లో సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మిస్ వరల్డ్ నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిథులు సన్నహాలు పూర్తి చేశారు. మిస్ థాయ్‌లాండ్ ఓపాల్ సుచేత వంటి పలువురు తారలు ఇప్పటికే తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు వేదికల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్పోటీల నేపథ్యంలో ముందస్తుగా రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా నగరంలోని మరికొన్ని సందర్శనీయ ప్రదేశాల్లో, ఇతర కార్యక్రమాక్లూ పాల్గోనున్నారు. (చదవండి: ఓల్డ్ సిటీ.. న్యూ బ్యూటీ)

ఇంటి 'గుట్టు' వంటింటికి చేటు..!
వాస్తవానికి ఇల్లు అనగానే అక్కడ మనకే భయాలూ ఉండవని ఫీలవుతాం. మన ఇంటిని మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. అక్కడ నిర్భయంగా ఫీలవుతూ హాయిగా ఉంటాం. కానీ అక్కడా మనకు అడుగడుగునా అపాయాలు పొంచి ఉంటాయి. అది సోఫాలో కావచ్చు. కర్టెన్ల వెనకాల కావచ్చు. డైనింగ్ టేబుల్‌ను తుడిచే స్పాంజి కావచ్చు. ఇక్కడా, అక్కడా అని కాకుండా మన ఇంట్లోనే ప్రతిచోటా ముప్పులెలా పొంచి ఉంటాయో, వాటిని తెలుసుకుని మనమెలా జాగ్రత్తపడాలో చూద్దాం... ఇంట్లో ఉన్నవన్నీ మన ఉపయోగానికి అనుకుంటాం. మనకు ఉపయోగపడుతున్నాయని మనం భావించే అవన్నీ మనకు ఎలాంటి కీడు చేస్తున్నాయో తెలుసుకుందాం. ప్లాస్టిక్ అనేది ఓ అందమైన విషం... చాలామంది డైనింగ్ టేబుల్స్ మీద ఉండే డిన్నర్‌సెట్ల తాలూకు సూప్ బౌల్స్, కూరలు వడ్డించడానికి వాడే ప్లాస్టిక్ గిన్నెలన్నీ పైకి కనిపించేటంతటి అందమైనవి కావు. నిజానికి ఇవన్నీ ‘మెలామైన్’ అనే ఒక రకం ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ఇందులోకి వేడి వేడి కూరలు, పులుసులు తీయగానే వేడికి ఆహారంతోపాటు ఆ మెలామైన్ అనే ప్లాస్టిక్ కూడా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయన నివేదిక ప్రకారం దేహంలోకి వెళ్లిన మెలామైన్ కారణంగా కిడ్నీలో రాళ్లు వస్తాయని తేలింది. గతంలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా... కొంతమంది వాలంటీర్లకు మెలామైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో అదే పదార్థాన్ని వడ్డించారు. నిర్ణీత కాలవ్యవధి తర్వాత ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలామైన్ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలామైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువనీ, దాంతో కిడ్నీఫెయిల్యూర్ అవకాశాలూ ఎక్కువని తేలింది. క్యాన్సర్ ముప్పు కూడా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ∙మైక్రోవేవ్ ఓవెల్‌లో ఉంచి వేడి చెయవద్దు వడ్డించడానికి మెలామైన్ బౌల్లోకి పులుసునో, కూరనో తీశాక... ఇక అందులోని పదార్థాన్ని వేడిచేయడం కోసం ఆ బౌల్‌ను మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. ఈ ప్లాస్టిక్ బౌల్స్‌లో ఉంచుకుని వేడి వేడి ఆహారం తింటే అది హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావంపై దాని దుష్ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఫలితంగా ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గుతాయంటున్నారు. ఇలాంటి బౌల్స్‌లో తినే చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా మరో అధ్యయనంలో తేలింది. అనేక ముప్పుల పుట్ట ఆ మెలామైన్ బౌల్ స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. దీంతో రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమైపోయి జ్ఞాపకశక్తి తగ్గే ముప్పు ఉందనీ, అలాగే వెంటవెంటనే మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు కూడా గుర్తించారు. ఫలితంగా అల్జీమర్స్ వంటి నాడీసంబంధమైన సమస్యలూ పెరుగుతున్నాయంటూ అనేక అధ్యయనాల్లో తేలింది. పరిష్కారమిది వేడివేడి సూప్‌లను వడ్డించాలనుకుంటే పింగాణీ బౌల్స్ లేదా పింగాణీ ప్లేట్లే ఆరోగ్యదాయకం. గాజు బౌల్స్ లేదా గాజు ప్లేట్లు కూడా వాడుకోవచ్చు. నల్లాల్లోంచి ఈ–కొలై... దీర్ఘకాలం పాటు నిల్వ ఉండే నీళ్లు... కొళాయి (నల్లా/పంపు) నుంచి వస్తున్నప్పుడు అందులో ఆ నీళ్లతో పాటు ‘ఈ–కొలై’ (ఎష్చరీషియా కొలై) అనే ఏకకణ పరాన్న జీవులూ రావచ్చు. ఎందుకంటే అవి నిల్వ ఉండే నీళ్లలో పెరిగి, ఆ నీళ్లను కలుషితం చేస్తాయి. ఈ నీటితో ఆహారాలను కడిగినప్పుడూ లేదా ఆహారం తింటున్నప్పుడు... కలుషితమైన ఆ నీళ్లను తాగినప్పుడు ‘ఈ–కొలై’ సూక్ష్మజీవులు ఒంట్లోకి ప్రవేశించే అవకాశముంది. దాంతో నీళ్ల విరేచనాల వంటి ప్రమాదముంది. నిజానికి ఆ నీళ్లతో వంట చేసే సమయంలో మరిగించినప్పుడు ఈ–కొలై నశించిపోవచ్చు. కానీ నీళ్లను మరిగించకుండా వాడే పానీపూరీ/ గప్‌చుప్ / గోల్గప్పా’ వంటి వాటిల్లో... ఈ–కొలై ఉన్న నీటిని ఉపయోగిస్తే నీళ్ల విరేచనాల ముప్పు తప్పదు. పైగా దూర్రప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి ఈ–కొలై ఉన్న నీళ్లను వాడితే ఆరోగ్య సమస్యలతోపాటు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఇతరత్రా అనేక ఇతర సమస్యలతోనూ ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశముంటుంది. పరిష్కారమిది ఇంటికి దూరంగా దూర్రప్రాంతాల్లో ప్రయాణాలు చేస్తున్నవారు మరిగించకుండా తయారు చేసే ఆహారాలనూ లేదా వేడిగా లేని ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది కర్టెయిన్లతో కల్లోలాలిలా... గతంలో మన ఇళ్లలో బట్టతో నేసిన కర్టెయిన్లు ఉండేవి. మాసి΄ోగానే ఉతుక్కునేందుకు వీలుగా ఉండేవి. కొద్దికాలంలో పాడైపోతే మళ్లీ కొత్త కర్టెయిన్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత బట్టలతో చేసిన కర్టెయిన్లు కాకుండా మరింత కాలం మన్నడానికి ప్లాస్టిక్ వంటి పదార్థంతో రూపొందించిన కర్టెయిన్లను వాడటం మొదలుపెట్టాం. అవి కాల ప్రభావానికి లోనై పాడైపోకుండా చాలాకాలం మన్నికతో ఉంటాయని ఆశపడ్డాం. ఇక బాత్రూమ్ల విషయానికి వస్తే... అక్కడ నీళ్లతో తడిసి పాడైపోకుండా ఉండటం కోసం, అలాగే షవర్ కర్టెయిన్లుగా పిలిచే వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారైనవే ఎక్కువగా వాడుతున్నాం. ‘థాలేట్’ అనే పదార్థంతో తయారయ్యే ఈ ప్లాస్టిక్ కర్టెయిన్లు ఎటు పడితే అటు వంగేందుకు ఎలా పడితే అలా వంచేందుకు వీలుగా రూపొందుతాయి. ఈ షవర్ కర్టయిన్లే కాకుండా, ఇండ్లలో అలంకరణ కోసం ఉపయోగించే వాల్పేపర్లు, ఫ్లెక్సీలు కూడా ఈ థాలేట్ అనే పదార్థంతోనే తయారవుతాయి. ఈ థాలేట్ అనే పదార్థంతో తయారయ్యే అన్ని రకాల ఉత్పాదనలు పురుష సెక్స్ హార్మోన్‌పై దుష్ప్రభావం చూపుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు వీటి వల్ల వీర్యం క్వాలిటీ దెబ్బతింటుందని కూడా నిర్ద్వంద్వంగా తేలింది. ఈ తరహా ప్లాస్టిక్‌తో తయారయ్యే ఉత్పాదనల మీది నుంచి వచ్చే గాలి పీల్చడం కారణంగా అలర్జీలు, శ్వాససంబంధ సమస్యలు ఉత్పన్నం కావడం జరగవచ్చు. ఆస్తమా, పిల్లికూతల వంటి లక్షణాలు కనిపించవచ్చు.ఇళ్లలో గర్భవతులు ఉంటే అది వారికి మరీ ప్రమాదం. ఇవి ఉపయోగించడం అంటే... ఇళ్లను అందంగా చేసి, ఆ ఇండ్లలో పుట్టి పెరగబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే. ఎందుకంటే ఇలాంటివి ఉపయోగించే ఇళ్లలో పెరిగే పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటివి కనిపించే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా నాలుగు నుంచి తొమ్మిదేళ్ల పిల్లల్లో ఈ ధోరణులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువని మౌంట్ సినాయ్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితాలు తెలుపుతున్నాయి. పరిష్కారమిది ఇంట్లో డోర్ కర్టెయిన్లు, షవర్ కర్టెయిన్లు కేవలం నేసిన బట్టతో తయారైన నిరపాయకరమైన కర్టెయిన్లనే వాడాలి. అలంకరణ కోసం అమర్చేవీ, ఫర్నిచర్లు... ప్లాస్టిక్ లేదా పీవీసీతో తయారు చేసిన వాటి కంటే కలపతో చేసినవే మంచివని గుర్తుంచుకోవాలి. వంటచేసే ప్రదేశంలో ధారాళంగా గాలి... చాలామంది వంటగదిని ఇరుకుగా రూపొందించుకుంటారు. కేవలం వంట సమయంలో తప్ప మిగతా వేళల్లో అక్కడ పెద్దగా ఉండబోమనే అభిప్రాయంతో వంటగదిని ఇరుగ్గా నిర్మించుకుంటారు. నిజానికి కిచెన్‌లోకి ధారాళంగా గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా కిరోసిస్ స్టవ్‌లు ఉపయోగించడం లేదుగానీ... గతంలో ఇలాంటివి ఎక్కువగా వాడేవారు. అలాగే కట్టెలపొయ్యి మీద కూడా వంటలు చేసుకునేవారు. వంటగది ఇరుగ్గా ఉంటే అక్కడ ఇంధనం మండే సమయంలో కార్బన్ డై ఆక్సైడ్తో పాటు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు వెలువడే అవకాశాలు ఎక్కువే. ఒక్కోసారి వాటివల్ల ప్రాణాపాయం కలిగే అవకాశమూ ఉండవచ్చు. అందుకే కిచెన్ తగినంత విశాలంగా, గాలి ఆడేలా ఉండాలి. ఒక్కోసారి గ్యాస్ వాటర్ హీటర్స్ నుంచి కూడా విషవాయువులు వెలువడే ప్రమాదం ఉంది. పరిష్కారమిది వంటగది విశాలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అనవసరమైన వస్తువులతో దాన్ని నింపేయవద్దు. బొగ్గులు, నిప్పుల మీద చేసే వంటలను కిచెన్‌లో చేయకపోవడమే మంచిది. అలాంటి వంటకాలను ఆరుబయటే చేయాలి. ఆర్థిక స్తోమత ఉన్నవారు వంటిళ్లలో పొగ, కార్బన్‌మోనాక్సైడ్ డిటెక్టర్లను, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అమర్చుకోవడం వల్ల ఎన్నో అనర్థాలూ, ప్రమాదాలు తప్పుతాయి. సోఫాలో కూర్చుండే విషాలూ అనేకం... ఇటీవల ఆధునికమైన ఇంటి ఫర్నిచర్‌తో పాటు కొన్ని రకాల సోఫాల వంటి వాటిని నిప్పు అంటుకోకుండా ఉండేందుకు వాటిని ఫైర్ రెసిస్టెంట్ పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ ఫైర్ రెసిస్టెంట్ రసాయనాలను ‘ఫ్లేమ్ రిటార్డెంట్స్’ అంటారు. మనం ఈ ఫర్నిచర్‌తోపాటు సోఫాలపై చేతులు ఉంచినప్పుడు ఈ రసాయనాలూ చేతులపైకి చేరతాయి. ఆ చేతులతోనే మనం ఏవైనా ఆహారపదార్థాలను తిన్నప్పుడు అవి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి విషపదార్థాలన్నీ మన వినాళ గ్రంథుల వ్యవస్థ (ఎండోక్రైన్ సిస్టమ్)ను దెబ్బతీస్తాయి. దాంతో మన గ్రంథుల నుంచి స్రవించే అనేక ఎంజైముల, అలాగే జీవరసాయనాల సమతౌల్యం దెబ్బతినడానికి అవకాశముంది. దాంతో మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద వాటి తాలూకు దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో కొన్ని రకాల ప్రత్యుత్పత్తి సంబంధిత వ్యాధులూ (రీప్రోడక్టివ్ డిజార్డర్స్) రావచ్చు. ఒక్కోసారి కొన్ని క్యాన్సర్లు వచ్చేందుకూ అవకాశముంది. పరిష్కారమిది : సోఫాలను క్రమం తప్పకుండా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఇలా శుభ్రపరిచే సమయంలో ఎయిర్‌ఫిల్టర్ ఉపయోగించడం మరింత శ్రేయస్కరం. సోఫా మీద కూర్చున్న తర్వాత ఏదైనా తినాల్సి వస్తే... చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినేముందు నోటిని నీళ్లతో పుక్కిలించడం అవసరం. (ఇది సోఫాలోని విష రసాయనాలనుంచే కాకుండా, ఈ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఇతరత్రా జబ్బులు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి). మౌల్డ్ (బూజు)కు ఆస్కారమివ్వద్దు... బ్రెడ్ ప్యాకెట్ తెరచి కొన్ని స్లైస్‌లు తిన్నతర్వాత, అలాగే ఉంచేస్తే మిగతా స్లైస్లపైన బూజు రావడం చాలామంది అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ బూజునే మౌల్డ్ అంటారు. ఈ బూజు నుంచి వచ్చే గాలులు పీల్చినప్పుడు ముక్కులు బిగుసుకుపోవడం, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలు (విండ్పైప్స్) సన్నబడినట్లుగా మారి ఆయాసం, ఆస్తమా రావడం చాలామందిలో కనిపించే సమస్యే. ఇక చూసుకోకుండా అలాంటి బ్రెడ్ స్లైస్ తింటే విరేచనాల వంటి అనారోగ్యాలు తప్పవు. అందుకే డైనింగ్ టేబుల్ మీద ఉండే బ్రెడ్ వంటి ఆహారాలకు మౌల్డ్ సోకనివ్వకుండా తాజాగా ఉన్నప్పుడే తినేయాలి. పరిష్కారమిది తేమ ఎక్కువగా ఉండే చోట్ల ఆహారాలను నిల్వ చేయడం వల్ల మౌల్డ్ వెంటనే వస్తుంది. అందుకే అలాంటి వాతావరణం ఉండేచోట్ల ఆహారాన్ని నిల్వ చేయకూడదు. మన వంటపాత్రలను వీలైనంత వరకు డిష్–వాషింగ్ సోప్‌తో కడిగి పెట్టుకోవాలి. పల్లెల్లో కొందరు మట్టితో గిన్నెలు కడుగుతుంటారు. అలా మట్టితో కడగడం ఎంతమాత్రమూ సబబు కాదు. ఎందుకంటే మట్టిలో సైతం మన ఆరోగ్యానికి కీడు చేసే సూక్ష్మజీవులు ఉండే అవకాశముంది. అందుకే పల్లెల్లోని వారు సబ్బు ఉపయోగించకపోతే గిన్నెలు తోమడానికి బూడిదను ఉపయోగించడం మంచిది. ఎందుకంటే మట్టితో పోలిస్తే బూడిదలో హానికరమైన పదార్థాలు అంతగా ఉండవు. ప్లాస్టికే కాదు... ‘నాన్‌స్టిక్’ కూడా... ఈమధ్యకాలంలో వంట చేస్తున్నప్పుడు పదార్థాలు ఆ పాత్రల అడుగు భాగాన అంటుకుపోకుండా ఉండే గిన్నెలు, పెనం వంటివాటిని ఉపయోగించేందుకు గృహిణులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలా అడుగున అంటకుండా ఉండే వంట పాత్రలను ‘నాన్‌స్టిక్ కుక్వేర్’ అంటారన్న విషయం తెలిసిందే. పాత్రలు శుభ్రపరచుకునేటప్పుడు ఈ తరహా వంటసామగ్రి, గిన్నెలు కడగడానికి వీలుగా, సౌకర్యంగా తేలిగ్గా కడగడానికి వీలుగా ఉంటాయి. దాంతో ఈ తరహా నాన్‌స్టిక్ వంటపాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ నాన్‌స్టిక్ కుక్‌వేర్‌లో వండిన ఆహారం అంత ఆరోగ్యకరమైనది కాదని అనేక అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి వంటపాత్రలను ఉపయోగించడం వల్ల ఆ వంటలను తిన్న పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, డయాబెటిస్ వంటివి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువని తేలింది. అంతేకాదు... ఈ వంటపాత్రల్లో వండిన ఆహారం తిన్నవారిలో దీర్ఘకాలంలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతౌల్యత వంటివి వచ్చేందుకు అవకాశాలూ ఎక్కువే. అంతేకాదు... వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశాలూ ఎక్కువేనని ఆ అధ్యయనాల్లో తేలింది. వ్యాధి నిరోధకత కోసం వేసే టీకాల ప్రభావం కూడా మందగిస్తుందన్నది పరిశోధకుల మరోమాట. అనేక అధ్యయనాల్లో తేలిన ఈ విషయాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ నివేదికల్లో ప్రచురితమయ్యాయి. ఇక మరో హెల్త్ జర్నల్ అయిన ‘ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్’ నివేదికల ప్రకారం... ఈ తరహా గృహ ఉపకరణాలు వాడేవారిలో వంధ్యత్వం (ఇన్ఫెర్టిలిటీ) లేదా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గి΄ోవడం వంటి సమస్యలు వస్తుంటాయని తెలుస్తోంది. పరిష్కారమిది వంట΄పాత్రలుగా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న నాన్‌స్టిక్ కుక్‌వేర్‌కు బదులుగా మామూలు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలనే ఉపయోగించాలి. కనీసం ఇంట్లో ఎవరైనా గర్భవతులుగా ఉన్నప్పుడు ఈ తరహా నాన్‌స్టిక్ గృహోపకరణాలను ఉపయోగించడం సరికాదు. అంతేకాదు... ఒకవేళ కొన్ని వంటలు చేయడానికి అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వండాల్సి వస్తే... అలాంటప్పుడు నాన్‌స్టిక్ కుక్‌వేర్‌ను వాడకపోవడమే మంచిది. ఇలాంటి నాన్‌స్టిక్ వంటసామగ్రిని ఉపయోగించేవారు ఆ పొగలూ, గాలులు (ఫ్యూమ్స్) కిచెన్ విస్తరించకుండా, ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చడం మంచిది. బాత్‌రూమ్‌ల్లోనూ హానికర రసాయనాలు! బాత్రూమ్లో కూడా హానికరమైన రసాయనాలు ఉండేందుకు అవకాశాలెక్కువ. అక్కడ ఉపయోగించే షాంపూలలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇక సువాసన వెలువరించేందుకు కొన్ని రకాల సబ్బుల్లో చేర్చే కొన్ని రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కూడా చర్మంపై అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు రావచ్చు. పరిష్కారమిది రసాయనాలు తక్కువగా ఉండేలా... చాలావరకు స్వాభావికమైన ఆర్గానిక్ పదార్థాలతో చేసిన సబ్బులు, షాంపులు ఉపయోగించడం మంచిది. ఇళ్లలో ఎలుకలతో కలకలం... ఇంటి కిచెన్‌లోకి అర్ధరాత్రి వెళ్లినప్పుడు ఆహారపదార్థాలను ఎలుకలు తింటున్నట్లుగా గమనిస్తే... ఎలుకలు అలా ఆహారాలను తాకడం చాలా ప్రమాదమని గుర్తుంచుకోవాలి. ఎలుకలు ఆహార పదార్థాలను తాకడం వల్ల ‘లెప్టోస్పైరోసిస్’ అనే వ్యాధి వస్తుంది. అది స్ప్లీన్, మూత్రపిండాలు, మెదడును దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. పరిష్కారమిది కిచెన్‌లోని ఆహార పదార్థాలను ఎలుకల నుంచి దూరంగా ఉంచాలి. వాటిని మెస్తో ఉన్న కప్బోర్డులలో ఉంచి ఎలుకలు తాకని విధంగా జాగ్రత్తపడాలి. బొద్దింకల నుంచీ జాగ్రత్త... ఎందుకంటే బొద్దింకలకు ఆహారం కానిదేదీ ఈ లోకంలో లేదు. అందుకే ఈ ప్రపంచంలోని ఏ కిచెన్ కూడా బొద్దింలు లేకుండా ఉండదంటే అది అతిశయోక్తి కాదు. బొద్దింకలనుంచి వెనువెంటనే వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినా... ఆహారాన్ని కలుషితం చేసే పనులను అవి కూడా చేస్తాయి. దాంతో ఆరోగ్యానికి నీళ్ల విరేచనాల వంటి ముప్పు ఉండవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... బొద్దింకలు అలర్జీని, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. కాబట్టి ఆస్తమా బాధితులు తమ ఇండ్లలోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పరిష్కారమిది ఆహారాన్ని బొద్దింకలు తాకకుండా ఉండేలా మెష్ ఉండే సురక్షితమైన చోట ఉంచుకోవాలి. బొద్దింకలు బాగా తేమగా, తడిగా, వెలుగు అంతగా ప్రసరించని చోట పెరుగుతాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి ప్రదేశమూ పొడిగా, వెలుతురూ,గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. దాంతో బొద్దింకలు వృద్ధి కావు. షూస్, సాక్స్... పాదరక్షలు ఇంటి బయటనే ఒకసారి వేసుకున్న సాక్స్ (మేజోళ్లు) మళ్లీ రెండుమూడు రోజులు వేసుకుంటే దుర్వాసన వస్తాయన్నది తెలిసిందే. సాక్స్‌లో బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇలా దుర్వాసన వస్తుంటుంది. ఆ సాక్స్‌తోనే ఇంట్లోకి వచ్చి అక్కడ విప్పితే ఆ బ్యాక్టీరియా ఇంట్లోకీ వచ్చేసే అవకాశాలుంటాయి. దాంతో ఇంట్లోని వాతావరణం కలుషితం కావచ్చు. పరిష్కారమిది షూజ్, పాదరక్షలూ, సాక్స్ వంటివి ఇంటి బయటే వదలాలి. సాక్స్ ఉతికి పొడిగా మారాకే ఇంట్లోకి తీసుకురావాలి. వీలైనంతవరకు చెప్పులు, పాదరక్షలు, షూస్ స్టాండ్, సాక్స్ వంటివి ఇంటి బయట ఉండటమే మంచిది. చివరిగా... పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం వల్ల ఆరోగ్యాల్ని పదిలంగా కాపాడుకోవచ్చు.డాక్టర్ కె. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: వామ్మో..! రైలు 40 నిమిషాలు ఆలస్యమైతే ఇంతలానా..!)
ఫొటోలు
అంతర్జాతీయం

బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం
లండన్: గత ప్రభుత్వాల ఉదారవాద విధానాల కారణంగా బ్రిటన్‌లోకి వలసలు పోటెత్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని ఆరోపిస్తూ అధికార లేబర్ పార్టీ కఠిన నిబంధనలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. బ్రిటన్‌లో వలసకార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమలుచేయనుంది. వలసదారులు బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా పొందాలంటే ఇకపై ఐదేళ్లకు బదులు కనీసం పదేళ్లు యూకేలో నివసిస్తూ ఉండాలని నిబంధనను కఠినతరం చేయనున్నారు. దీంతో అత్యధిక వర్క్ వీసాల పొందే భారతీయుల బ్రిటన్ శాశ్వత స్థిరనివాస కలలు నెలవేరడం మరింత కష్టంకానుంది. భారతీయులు ఎక్కువగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, విద్య, ఆతిథ్యం, కేటరింగ్, వాణిజ్యవిభాగాల్లో పనిచేసేందుకు వీసాలు పొంది బ్రిటన్‌కు వస్తుంటారు. 2024 జూన్‌లో ముగిసిన 12 నెలల కాలానికి 1,16,000 మంది భారతీయులు వర్క్ వీసాలు పొంది బ్రిటన్‌లో పలు రకాల్లో వృత్తుల్లో స్థిరపడ్డారు. వీసా నిబంధనల్లో ముఖ్యమైన మార్పులేంటి?చిన్నారులు, వృద్ధులు, రోగుల బాగోగులు చూసుకునే ఓవర్సీస్ కేర్ వర్కర్లకు ఇచ్చే వీసాలను ఇకపై ఆపేయనున్నారు. ఇకపై విదేశీయులను కేర్ వర్కర్లుగా నియమించుకోకూడదనే నిబంధనను అమల్లోకి తేనున్నట్లు పార్లమెంట్లో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనున్న హోం శాఖ మంత్రి వెట్టీ కూపర్ చెప్పారు. దీంతో ఈ ఉద్యోగాలు స్థానికులకు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. నైపుణ్యమున్న వాళ్లకు మంజూరుచేసే స్కిల్డ్ వర్కర్ వీసాను ఇకపై కనీసం గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉన్న వ్యక్తులకే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైద్యులు, ఇంజనీర్లు, కృత్రిమ మేధ ఉద్యోగులు ఇలా నైపుణ్యమున్న వాళ్లకే స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరుచేయాలని శ్వేతపత్రంలో ప్రతిపాదించారు. నిబంధనలను పాటిస్తూ దేశార్థికాన్ని తమ వంతు తోడ్పాటునందించే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్కిల్డ్ వర్కర్ వీసా కోరే వాళ్లు కనీసం యూనివర్సిటీ డిగ్రీ పట్టభద్రులై ఉండాలి. ఈ నిబంధనలతో బ్రిటన్ హోం శాఖ సోమవారం ఒక శ్వేతపత్రం విడుదలచేసింది.డిపెండెంట్లకూ ఇంగ్లిష్ పరీక్షవీసాదారులపై ఆధారపడి బ్రిటన్‌లో అడుగుపెట్టే వారి జీవితభాగస్వాములు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఇంగ్లిష్ భాషపై కనీస పరిజ్ఞానం, పట్టు ఉండాల్సిందే. వీళ్లంతా ఏ1–లెవల్ ఇంగ్లిష్ టెస్ట్‌ను పాసవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఉంటున్నారు?. ఏ పని మీద వచ్చారు?. ఏం చేస్తారు? ఇలా బ్రిటన్ పోలీసులు ఎక్కడైనా ప్రశ్నిస్తే కనీసం సమాధానం ఇంగ్లిష్‌లో చెప్పేలా బేసిక్ లెవల్ ఇంగ్లిష్ తెలిసి ఉండాలనే నిబంధనను జతచేయనున్నారు. వీసా గడువు కాలాన్ని వర్కర్లుగానీ, వాళ్ల కుటుంబసభ్యులుగానీ పెంచుకోవాలనుకుంటే వారిపై ఆధారపడే వాళ్లు హై లెవల్ ఏ2 ఇంగ్లిష్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. బ్రిటన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులు అదనంగా మరో 24 నెలలపాటు బ్రిటన్‌లోనే ఉండేందుకు వెసులుబాటు ఉండేది. దానిని ఇప్పుడు 18 నెలలకు కుదించారు. ఊహించనంతగా చట్టబద్ధంగా, అక్రమంగా వస్తున్న వారితో బ్రిటన్ ‘అపరిచితుల ద్వీపం’గా తయారవుతోందని సోమవారం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రధాని స్టార్మర్ వ్యాఖ్యానించారు.

ఇటు30 అటు10
జెనీవా: ఎడాపెడా టారిఫ్‌లు విధించుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని మొదలెట్టిన అమెరికా, చైనా ఎట్టకేలకు శాంతించాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా సమష్టిగా సంధికి ఆమోదముద్ర వేశాయి. ఇందులోభాగంగా సోమవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగర వేదికగా వాణిజ్య ఒప్పందాన్ని కుదర్చుకుని టారిఫ్ రణానికి ముగింపు పలికినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. చైనా ఉత్పత్తులపై 145 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ సర్కార్, అందుకు దీటుగా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్ వసూలుచేస్తామని జిన్‌పింగ్ ప్రభుత్వం గతంలో ప్రకటించడం తెల్సిందే. సోమవారం కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందంతో ఈ టారిఫ్‌లు భారీగా దిగిరానున్నాయి. ఒప్పందం మేరకు ఇకపై చైనా ఉత్పత్తులపై అమెరికా 30 శాతం టారిఫ్‌లు విధించనుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా కేవలం 10 శాతం టారిఫ్‌లు విధించనుంది. తొలుత 3 నెలలపాటు అమలుతొలుత 90 రోజులపాటు ఈ టారిఫ్‌లనే అమలుచేసి, సమీక్ష జరిపి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. జెనీవాలో ఈ మేరకు అమెరికా, చైనా తరఫున అత్యున్నత స్థాయి అధికారులు మంతనాల జరిపి ట్రేడ్ డీల్‌ను ఖరారుచేశారు. ఐక్యరాజ్యసమితిలో స్విస్ రాయబారి అధికారిక నివాసంలో జరిగిన ఈ చర్చల్లో అమెరికా తరఫున అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి జేమ్సన్ గ్రీర్ పాల్గొన్నారు. ఆర్థిక, వాణిజ్యం సంబంధాలపై ఇకమీదటా ద్వైపాక్షిక చర్చలు కొనసాగుతాయని స్కాట్బెసెంట్ అన్నారు. ‘‘ ఇరువైపులా పెరిగిన అత్యధిక టారిఫ్‌లతో వాణిజ్యం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చైనాతో వాణిజ్యబంధం బలోపేతానికే కృషిచేస్తున్నాం. అందుకే పెంచిన టారిఫ్‌లను మళ్లీ తగ్గిస్తున్నాం. సమతుల వాణిజ్యం కోరుకుంటున్నాం. ఈ తరహా వాణిజ్యాన్ని సాకారాంచేస్తాం’’ అని బెసెంట్ వ్యాఖ్యానించారు. తర్వాత చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఇరువైపులా 91 శాతం టారిఫ్ తగ్గించుకున్నాం. మేం మరో 90 రోజులకోసం మరో 24 శాతం తగ్గించాం. దీంతో అమెరికాపై మా టారిఫ్ 10 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్ రెండో తేదీన అమెరికా టారిఫ్‌లు పెంచాక మేం తీసుకున్న ప్రతీకార నిర్ణయాలనూ ఉపసంహరించుకుంటున్నాం’’ అని చైనా ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే 90 రోజులపాటు ఈ రేట్లనే కొనసాగించి తర్వాత సమీక్ష జరపనున్నారు. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఇది తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం లాంటిదే. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని క్యాపిటల్ ఎకనమిక్స్‌లో చీఫ్ ఆసియా ఎకానమిస్ట్ మార్క్ విలియమ్స్ వ్యాఖ్యానించారు. ‘‘ 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందనే ఇక్కడ అసలు ప్రశ్న’’ అని చైనాలో యురోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జేన్స్ ఎస్కీలెండ్ అన్నారు. సింథటిక్ డ్రగ్ అయిన ఫెంటానిల్‌ను తమ దేశంలోకి చైనా పోటెత్తిస్తోందంటూ ట్రంప్ సర్కార్ తొలుత టారిఫ్‌ల పెంపు జెండా ఎగరేయడం తెల్సిందే.

భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు. #WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF— ANI (@ANI) May 12, 2025

పాకిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం
పాకిస్థాన్‌లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్తాన్లోని అష్కాషెమ్కు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది.కాగా, అంతకుముందు.. ఈ నెల 10న భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన పాకిస్థాన్ ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తాజాగా, మరో భూకంపం రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎన్సీఎస్ నివేదిక ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని.. 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం... 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైంది.
జాతీయం

40 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు
కొరుక్కుపేట(తమిళనాడు): చిన్న వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ హోటల్ యజమాని 40 ఏళ్ల తరువాత తల్లిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ త్రంలో ఆనందాన్ని నింపింది. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని కదిర నరసింహం గ్రామానికి చెందిన నటరాజన్, అతని భార్య రుక్మిణి. ఈ దంపతులకు కుమార్, సెంథిల్, మురుగన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు 1985లో తమ కుటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లారు. ఆ సమయంలో, అతని తల్లిదండ్రులు పెద్ద కొడుకు కుమార్‌ను పనికి వెళ్లమని కోరారు. దీంతో తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా, 12 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయిన కుమార్‌కు పుదుకోట్టై జిల్లాలోని మాచువాడి ప్రాంతంలోని ఆరుముగం అనే వ్యక్తికి చెందిన హోటల్లో ఉద్యోగంలో చేరాడు. కుమార్‌కు వివాహమై మాచువాడి గ్రామంలో భార్యతో పాటూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తర్వాత కుమార్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బస్సులో తేని వెళ్లేసరికి గతం అంతా కళ్లముందు మెదిలింది. దీంతో కుటుంబ సమేతంగా కదిర నరసింగపురంలో దిగారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిని చూశాడు. మిగిలిన కుటుంబ సభ్యులు పెద్ద కొడుకు కుమార్ వచ్చాడని తల్లికి సమాచారం అందించారు. తన భార్య, కుమార్తెలను కూడా పరిచయం చేశాడు. రుక్మిణి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై తిరిగి కలుసుకున్నందుకు ఆనందంతో కన్నీళ్లతో కౌగిలించుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని నింపింది.

విజయ్‌కు 105 సీట్లు?
సాక్షి, చెన్నై: విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికలలో 105 సీట్లలో గెలుపు ఖాయం అన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మూడు నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయట పడ్డాయి. గత ఏడాది విజయ్ తమిళగ వెట్రికళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుక అనంతరం కొంత కాలం విజయ్ సినీమా షూటింగ్ బిజీలో పడ్డారు. గత మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి పెట్టి, ప్రజలలోకి దూసుకెళ్లే కార్యాచరణలో ఉన్నారు. ఆ పార్టీ వర్గాలు విజయ్ పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బూత్ కమిటీలు తమ పనిని వేగవంతం చేశారు. ఇక, విజయ్ ప్రజా పర్యటనకు కార్యచరణలో ఉన్నారు. ఈ షెడ్యూల్ త్వరలో వె లువడనుంది. ఈ పరిస్థితులలో గత మూడు నెలలుగా సోషల్ మీడియాతో పాటూ పలు వర్గాల నుంచి ఓ సంస్థ సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వే మేరకు తాజాగా విజయ్ కు 105 సీట్లు ఖాయం అన్న సమాచారం చర్చకు దారి తీసింది. ఈ సర్వే మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు 95 నుంచి 105 సీట్లతో ఆపటుగా 34.55 శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా సామాజిక మాధ్యమంలో సమాచారం వైరలైంది. అలాగే డీఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాల వరకు 30.20 శాతం ఓటింగ్‌తో, అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు 28.85 శాతం ఓట్లతో దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఈ సమాచారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. తమకు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో మరింతగా శ్రమించేందుకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తమ తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రైవేటుకు చెందిన ప్రహరీ గోడలు, ప్రదేశాలలో గోడ ప్రచారం కోసం ముందస్తుగా బుక్ చేసుకుంటుండడం గమనార్హం.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఒహియోలోని క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మానవ్ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్(23) మృతిచెందినట్లు ప్రకటిస్తూ కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసింది.మే 10న లాంకాస్టర్ కౌంటీలోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్ వద్ద వారి వాహనం చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టిందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. Deeply saddened to learn about the unfortunate road accident in which two Indian students from Cleaveland State University, Manav Patel and Saurav Prabhakar lost their lives;Our thoughts and prayers are with their families during this difficult time. The Consulate is in touch…— India in New York (@IndiainNewYork) May 12, 2025

ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్!
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025
ఎన్ఆర్ఐ

పహల్గామ్ విషాదం, ఎన్ఆర్ఐల శాంతి ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.

లండన్‌లో ఘనంగా తాల్ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు
తెలుగు అసోసీయేషన్ ఆఫ్ లండన్(తాల్(TAL)) 20వ వార్షికోత్సవం తోపాటు, ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిలల 26న ఈస్ట్ లండన్‌లోని లేక్వ్యూమార్కీలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. దీంతో ఇది తాల్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ప్రత్యేక అథిధులుగా పాల్గొన్నారు. ముందుగా ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిముషాల మౌనం పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్ సమైక్యతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. తాల్ 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఛైర్మన్ రవి సబ్బా ఈ తాల్ విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్లు, ట్రస్టీలు, ఉగాది కన్వీనర్లందర్నీ ఘనంగా సత్కరించారు. తాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజుని తాల్ కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. తాల్ వార్షిక పత్రిక "మా తెలుగు 2025"ని కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. అందుకు కృషి చేసిన సూర్య కందుకూరి, ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల తదితర సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తాల్ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలోనే స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను కూడా ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.(చదవండి: టంపాలోనాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు)

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
క్రైమ్

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రెండు గంటలకు పైగా చేసిన తనిఖీల్లో సరైన ఆధారాలు దొరకడంతో డీఎస్పీ, సీఐపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణంలో ఓ స్కానింగ్ సెంటర్‌ను నడిపిస్తున్న వ్యక్తిపై గత నెలలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన్ను రిమాండ్‌కు తరలించకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు డిమాండ్ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.16 లక్షలైనా ఇవ్వాలంటూ ఆ వ్యక్తిపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక బాధితుడు ఈ నెల మొదటి వారంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతను ఇచి్చన ఫిర్యాదును పరిశీలించి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ, సీఐలపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. కేసులో రిమాండ్ చేయకుండా ఉండటానికి, అతని స్కానింగ్ సెంటర్‌ను భవిష్యత్‌లో సక్రమంగా నడిపించడానికి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో డబ్బులు డిమాండ్ చేసినట్టు తేలడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ కమలాకర్‌రెడ్డి, నల్లగొండ రేంజ్ ఏసీబీ టీం సభ్యులు పాల్గొన్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ ఉంటుందని, లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064కు కాల్ చేయాలని డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపారు.

Ameerpet: స్నేహితుడి భార్యపై లైంగిక దాడికి యత్నం
అమీర్‌పేట(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన మహిళ భర్త గతంలో ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. అతడి స్నేహితుడైన పసుపులేటి వెంకట నరసింహారావు అలియాస్ పీవీ అనే వ్యక్తి అతడితో ఉద్యోగం మాన్పించి తన సొంత సంస్థ అయిన లోన్ వాలా డాట్ కామ్‌లో చేర్చుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాననే సాకుతో తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లే వాడు. స్నేహితుడి భార్యపై కన్నేసిన అతను తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు. బాధితురాలు ఈ విషయం భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను పీవీ వద్ద పని మానేసి మరో సంస్థలో చేరాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పీవీ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గర్భవతినని చెప్పినా వినిపించుకోకుండా లైంగిక దాడికి యత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇష్టపడిన యువతి దక్కలేదని..
కూకట్పల్లి(హైదరాబాద్): తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, అడవిపూడి గ్రామానికి చెందిన జగదీష్ అతడి సోదరుడు దుర్గా ప్రసాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సర్ధార్ పటేల్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువు కాళ్ల వెంకటరమణ భగత్ సింగ్ నగర్లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కా చెల్లెళ్లు కావటంతో మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకట రమణ తరచూ దుర్గా ప్రసాద్, జగదీష్ ల వద్దకు వచ్చి వెళుతుండేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన పవన్ ఎనిమిదేళ్ల క్రితం వెంకట రమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం నగరానికి మకాం మార్చిన పవన్ కూడా కూకట్పల్లి ప్రాంతంలోనే ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రావణి సంధ్యను వివాహం చేసుకున్న వెంకటరమణపై కక్ష పెంచుకున్న పవన్ అతడిని హత్య చేసేందుకు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్‌ను గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమా మహేశ్వరితో కలిసి స్వగ్రామంలో పెళ్లికి వెళ్లింది. ఆదివారం రాత్రి వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు. జగదీష్ ఇంటి గేటు స్కూటీని అడ్డు పెట్టి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉండటాన్ని గుర్తించిన జగదీష్ అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ జగదీష్‌తో గొడవపడుతుండటాన్ని గుర్తించిన వెంకట రమణ బయటికి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ కత్తితో వెంకటరమణ చాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ సంజన సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించగా వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. జగదీష్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు పవన్పరారీలో ఉన్నట్లు తెలిసింది.

బావమరుదులపై బల్లెంతో బావ దాడి
సీలేరు (అల్లూరి జిల్లా): ముగ్గురు బావమరుదులపై బావ బల్లెంతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, సీలేరు మేజర్ పంచాయతీ, చింతపల్లి క్యాంపు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిముడు కృష్ణ (36) కిముడు రాజు (40) కిముడు రాజు (25)అన్నదమ్ములు. వీరు ముగ్గురికీ వివాహాలు జరిగాయి. వీరికి నలుగురు, ముగ్గురు, ఇద్దరు చొప్పున పిల్లలున్నారు.బంధువు దినకార్యానికిగాను ఆదివారం చింతపల్లి క్యాంప్‌లో నివాసముంటున్న బావ వంతల గెన్ను ఇంటికి కుటుంబ సభ్యులతోసహా హాజరయ్యారు. బావ ఇంట్లోనే రాత్రి బస చేశారు. ఈ సమయంలో మద్యం తాగిన బావ తమ సోదరితో గొడవపడుతూ, కొడుతుండటంతో ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మొదలైన గొడవ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉంది.సుమారు ఒంటిగంట సమయంలో ఇంట్లో ఉన్న బల్లెంతో గెన్ను తన భార్య సోదరులను ఒకరి తర్వాత ఒకరిని కడుపులో పేగులు బయటికి వచ్చేలా పొడిచాడు. తరువాత బల్లెంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, గాయాలతో ఉన్న రాజు అనే మరో బావ మరిదిని కుటుంబ సభ్యులు, స్థానికులు సీలేరు పీహెచ్‌సీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నారు.నిందితునిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నిందితుడు వంతల గెన్ను అత్యంత కిరాతకుడు. ఇతనిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల కిందట ఒడిశాలో ఒకరిని కిరాతకంగా నరికి చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. తర్వాత సీలేరులో బంధువుల దగ్గరికి చేరాడు. నాలుగేళ్ల కిందట ఇదే గ్రామంలో వంతల గురువు అనే వ్యక్తిని గొడ్డలితో నరకగా కేసు నమోదై, జైలుకి వెళ్లొచ్చి ప్రస్తుతం చిన్నా చితకా పనులు చేస్తున్నాడు.