Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

E Passport Launched In India Its Features Benefits Application Process1
ఈ-పాస్‌పోర్ట్‌ వచ్చేసింది.. హైదరాబాద్‌లోనూ..

అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని భారత ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రారంభించింది. ఇప్పుడున్న సంప్రదాయ డిజైన్‌లోనే మరింత అత్యాధునిక భద్రతను జోడిస్తూ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్, పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (PKI) ఎన్క్రిప్షన్‌తో వీటిని రూపొందించింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన పాస్‌పోర్ట్‌ సేవా కార్యక్రమం(PSP) వర్షన్‌ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని జారీ చేస్తోంది.ఎక్కడెక్కడ?ప్రస్తుతం నాగ్‌పూర్‌, రాయపూర్‌, భువనేశ్వర్, గోవా, జమ్మూ, అమృత్‌సర్, సిమ్లా, జైపూర్, చెన్నై, సూరత్, హైదరాబాద్, రాంచీ నగరాల్లో ఈ-పాస్‌పోర్ట్‌లను పైలట్‌ విధానంలో జారీ చేస్తున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే గత మార్చి నెలలో చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం వీటి జారీని ప్రారంభించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 2025 మార్చి 22 నాటికి 20,729 ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి.ఏమిటి ఈ-పాస్‌పోర్ట్ ప్రత్యేకత?భారతీయ ఈ-పాస్‌పోర్ట్ కవర్లో యాంటెనా, చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్‌ను అనుసంధానం చేస్తారు. పాస్‌పోర్ట్ హోల్డర్ బయోమెట్రిక్, వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ చిప్ ద్వారా మెరుగైన భద్రత, వేగవంతమైన వెరిఫికేషన్ లభిస్తుంది. ఈ-పాస్‌పోర్ట్‌ను దాని ముందు కవర్ కింద ముద్రించిన ప్రత్యేకమైన బంగారు రంగు చిహ్నం ద్వారా గుర్తించవచ్చు. చిప్ లోని సున్నితమైన డేటా దుర్వినియోగం కాకుండా పబ్లిక్ కీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ) ఎన్‌క్రిప్షన్ వ్యవస్థ రక్షిస్తుంది.తప్పనిసరా?ప్రస్తుతం ఉన్న పాస్ పోర్టులను ఈ-పాస్‌పార్ట్‌లుగా మార్చుకోవడం తప్పనిసరి కాదు. అవి గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులకు మారడం స్వచ్ఛందం. అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సాంకేతిక ఆధారిత, భద్రత-కేంద్రీకృతంగా మారుతున్న నేపథ్యంలో భారత్‌ కూడా ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తోంది.ఈ-పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు ఇలా..నాగ్‌పూర్, చెన్నై, జైపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో పౌరులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని నిర్దిష్ట పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలులేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల నుండి వీటిని తీసుకోవచ్చు.🔸 దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి.🔸 ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఐడీని ఉపయోగించి లాగిన్ కావాలి.🔸 "అప్లై ఫర్‌ ఫ్రెష్‌ పాస్‌పోర్ట్‌/ రీ-ఇష్యూ పాస్‌పోర్ట్" ఆప్షన్‌ ఎంచుకోండి.🔸 మీరు కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తుంటే "ఫ్రెష్" ఎంచుకోండి. ఇప్పటికే ఉన్నవారు "రీఇష్యూ" ఎంచుకోండి.🔸అపాయింట్ మెంట్ తీసుకుని ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.🔸 అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మీ దరఖాస్తు రసీదును ప్రింట్‌ లేదా సేవ్ చేయవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ధృవీకరణను సమర్పించవచ్చు.🔸 నిర్ణీత తేదీలో, మీరు ఎంచుకున్న పాస్‌పార్ట్‌ కార్యాలయానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లండి.

Rajasthan Deports First Batch of  Illegal Bangladeshis2
మొన్న గుజరాత్ .. నేడు రాజస్థాన్!

జైపూర్: దేశంలో అక్రమ వలస దారుల ఏరివేత కార్యక్రమం మరింత పుంజుకుంది.. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారుల్ని ఏరివేసే పనిలో పడ్డాయి. ఇటీవల గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీయులను వెనక్కి పంపించగా, తాజాగా రాజస్తాన్ లో కూడా వెయ్యికి పైగా బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.వీరిని ప్రస్తుతం తమ దేశానికి పంపించే యత్నం చేస్తున్నారు. రాజస్తాన్ లోని 17 జిల్లాల్లో జల్లెడ పడితే 1,008 మంది బంగ్లాదేశీయులు దొరికారు. ఒక్క సిల్కార్ జిల్లాలోనే 394 మంది అక్రమ బంగ్లాదేశీయులు ఉండటం గమనార్హం. వీరందర్నీ ఇప్పుడు దేశం దాటించే పనిలో పడ్డాయి ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది.పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ లో ఉండే అక్రమ వలసదారుల్ని ఏరివేస్తున్నారు. ప్రధానంగా అక్రమంగా ఉండే పాకిస్తానీయులిపై వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క‍్రమంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో అక్రమంగా స్థిరపడిన వారు వేలల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు. #WATCH | Rajasthan: First batch of Bangladeshi nationals, who were living illegally in India, and were caught in the past few days were brought to Jodhpur today. They are being deported to Bangladesh. pic.twitter.com/hLqKxDSlb5— ANI (@ANI) May 14, 2025 ఇది కూడా చదవండి:జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!

pakistan letter to india over Indus Waters Treaty 3
భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ

ఇస్లామాబాద్‌: భారత్‌కు పాకిస్తాన్‌ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్‌ సిందూర్‌పై (operation sindoor) జాతినుద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అంటూ ఉగ్రవాదంపై భారత్‌ వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్‌ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు.👉పాక్‌పై భారత్‌ సింధూ అస్త్రం.. ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి (2025 Pahalgam attack) తర్వాత పాకిస్తాన్‌పై భారత్‌ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. అయితే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపి వేయడంతో దాయాది దేశంలో నీటి కటకట మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్‌ పంటపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్‌.. భారత్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్‌ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా.. భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ అధికారిక లేఖ రాసారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని లేఖలో కోరారు.

Karun Nair should get Virat Kohlis No. 4 position for England tour: Anil Kumble4
కోహ్లి స్ధానంలో అత‌డే స‌రైనోడు.. ఇంగ్లండ్‌కు పంపండి: కుంబ్లే

ఇంగ్లండ్‌ ప‌ర్య‌టన‌కు ముందు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి అంద‌రికి షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలుత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ప్ర‌క‌టించగా.. ఆ త‌ర్వాత వారం రోజుల‌కే విరాట్ కోహ్లి కూడా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. దీంతో యువ ఆట‌గాళ్ల‌తో కూడిన భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జట్టును బీసీసీఐ వ‌చ్చే వారం ప్ర‌క‌టించింది. అయితే ఇన్నాళ్లు విరాట్ కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేస్తార‌న్న ప్ర‌శ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్థానాన్ని కరుణ్ నాయర్ భర్తీ చేయగలడని కుంబ్లే జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండడంతో నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారంట."కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతడు భారత జట్టులోకి తిరిగి రావడానికి అర్హుడు. అతడు నాలుగో స్ధానంలో ఆడొచ్చు. ఎందుకంటే భారత్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. కరుణ్‌కు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ అనుభవం ఉంది. అతడికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కరుణ్ వయస్సు పరగా 30 ఏళ్లు దాటిండొచ్చు. కానీ అతడు ఇంకా చాలా యంగ్ కన్పిస్తున్నాడు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు" అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నారు.కాగా క‌రుణ్ నాయ‌ర్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీల‌క పాత్ర‌. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నాయర్‌ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్‌ నాయర్ కొన‌సాగుతున్నాడు.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు(అంచ‌నా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్‌, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

Kadapa Mayor Suresh Babu Accuses Coalition Government of Conspiracy5
కడప మేయర్‌ సురేష్‌ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

వైఎస్‌ఆర్‌ జిల్లా,సాక్షి: కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సురేష్ బాబు తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ కార్పొరేషన్‌లో కాంట్రాక్టులు చేసిందంటూ అభియోగాలు మోపింది ప్రభుత్వం. అయితే, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయలేదనే అక్కసుతో సురేష్‌ బాబును తొలగింపునకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం కార్పోరేషన్‌లో కాంట్రాక్టులనే అభియోగం మోపి సురేష్‌ బాబును పదవి నుంచి తొలగించింది. కడప మేయర్ సురేష్ బాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్‌సీసీ నేతలు మండిపడుతున్నారు. నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Nawaz Sharif Behind Military Strike on India6
‘నవాజ్‌ షరీఫ్‌ కనుసన్నుల్లోనే పాక్‌ సైనిక దాడులు’

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్‌ సిందూర్‌ జరిగే సమయంలో భారత్‌పై పాక్‌ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్‌-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ జరిగే సమయంలో భారత్‌పై పాక్‌ సైనిక దాడికి దిగింది. పాక్‌ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్‌ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్‌ మే 7న ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్‌ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి. దీంతో పాకిస్తాన్‌ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Trump Comments For India Analysts think US stance complicates matters7
మీ వైఖరేంటో?... మొన్న కాల్పుల విరమణ.. నేడు డిన్నర్!

డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. ఆయన రెండోసారి అధ్యక్షుడైన దగ్గర్నుంచి సుంకాల పెంపుతో ప్రపంచ దేశాల్ని రాజీకి వచ్చేలా చేయడం, ఆపై దేశాల మధ్య సమస్యలకు, యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించడం మాత్రమే చేస్తున్నారు. ట్రంప్.. ఇదే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అసలు అమెరికా ఎలా ఉందో చూసుకుంటున్నారో, లేదో కానీ మిగతా దేశాలపై ఆసక్తి మాత్రం ట్రంప్‌లో విపరీతంగా పెరిగిపోయింది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జ‌పిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్‌ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకుంటున్నారు ట్రంప్. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్న‌ది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్ర‌రాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.భారత్, పాకిస్తాన్ ల యుద్ధాన్ని తానే ఆపేశానని ;పదే పదే చెప్పుకుంటున్నారు ట్రంప్. ఇది మంచిదే. యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. అయితే ఏ సందర్బంలో పాక్ బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది.ఉగ్రదాడులతో జనాల ప్రాణాల్ని తీసేస్తుంటే, భారత్ కు యుద్ధ పరిస్థితిని కల్పించింది దాయాది పాక్ . అది ఆపరేషన్ సిందూర్ తో మొదలుపెట్టింది. ఇక్కడ పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ షురూ చేసింది. అయితే పాక్ కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ రక్షణ స్థావరాలపై దాడులకు చేసి ఆ దాయాది దేశానికి చెందిన పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి త‌గిన బుద్ధి చెప్పింది.మిమ్మల్ని అడిగింది ఎవరు?అసలు విషయం వదిలేసి, కొసరు విషయం చెప్పే అలవాటు ట్రంప్ కే ఉందా.. లేదా అగ్రరాజ్యమే అలా ఉంటుందా? అనేది మరో ప్రశ్న. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ గురించి ప్ర‌క‌టించిన ట్రంప్‌.. యుద్ధం ఆప‌డానికి త‌న‌ను ఎవరు ఆశ్రయించార‌నే విష‌యాన్ని ఎక్కడా వెల్ల‌డించ‌లేదు.భారత్, పాక్‌ల‌ కాల్పుల విరమణ అంటూ త‌నకు తానుగా ప్రకటించారు ట్రంప్‌. త‌మ‌కు క్లయింట్ అయిన పాకిస్థాన్‌కు పూర్తి సహకారం అందిస్తూనే, మరొకవైపు ఇండియాతో స్నేహాన్ని నటిస్తున్నారనేది భారత ప్రజలకు బాగా అర్ధమైంది. భారత్ దాడి ముమ్మరం చేసిన వేళ.. పాక్ ప్రధాని మిమ్మల్ని ఆశ్రయించారా? లేదా? అనేది మీరు చెప్పకపోయినా భారత్ ప్రజలకు ఆ విషయం అర్దమైంది. పాక్ భారీగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే కాల్పుల విరమణకు ఒప్పించారని అంతా అనుకుంటున్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రిస్తే ఓ ప‌నైపోతుంద‌న్న‌ట్టుగా ట్రంప్ చేసిన వాఖ్య‌ల‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ గ‌ట్టి కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని, పీవోకేను భారత్‌కు పాక్ అప్పగించడమే ఒక్కటే మార్గమని క్లియర్ చేసేశారు.ఇప్పుడు కలిసి డిన్నర్ చేయాలా?తాజాగా ట్రంప్ మరో రాగం అందుకున్నారు. భారత్, పాకిస్థాన్‌లు కలిసి డిన్నర్ చేయాల్సిందేనని అంటున్నారు. రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్.. తొలిసారి మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో పర్యటించారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌లు కలిసి డిన్నర్ చేస్తే చూడాలని అంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో భారత్ ఎలా కలిసి డిన్నర్ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణ అన్న మూడు గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందని మరి ఆ దేశాన్ని ఎలా నమ్మాలని కొంతమంది నిలదీస్తున్నారు. మీ వైఖరేంటో మాకు బాగా అర్ధమైందని మరికొందరు ట్రంప్‌ను విమర్శిస్తున్నారు.

Court Orders Case Against minister Vijay Shah For Remarks On Colonel Sofiya Qureshi8
కర్నల్‌ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు

భోపాల్‌: ఆపరేషన్‌ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్‌లో పాల్గొన్న కల్నల్‌ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్నల్‌ సల్మాన్‌ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి విషయ్‌ షాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది.కర్నల్‌ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మంత్రి విజయ్‌ షా వ్యాఖ్యలు మంత్రి విజయ్‌ షా (Kunwar Vijay Shah) మంగళవారం మౌలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైనిక విమానంలో వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని పాక్‌కు పంపించి అదే రీతిలో పాఠం నేర్పించారు’ అని అన్నారు.అయితే, విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. జబల్‌పూర్‌ హైకోర్టు న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, అనురాధ శుక్లాతో కూడిన ధర్మాసనం కల్నల్‌ సల్మాన్‌ ఖురేషీపై విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, తక్కువ చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలను వేర్వేరుగా చూడాలనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, ఎవరు ముస్లిం అయితే వాళ్లు దేశభక్తులు కాదనే భ్రమను కలించేందుకు దారితీస్తాయి. ఇది భారత రాజ్యాంగంలో ఐకమత్యం,సోదర భావం అనే మౌలిక విలువలకు విరుద్ధం’అని వ్యాఖ్యానించిందిఈ సందర్భంగా నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థత, స్వభావం, గౌరవం, దైర్యం వంటి విలువలకు ప్రతీక సాయుధ దళాలు’ అని ప్రశంసలు కురిపించింది. ఇలా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారిపట్ల మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.India Pakistan News: MP Court Orders FIR Against BJP Leader Over Colonel Sofiya Qureshi Remark#DNAVideos | #IndiaPakistanTensions | #MadhyaPradesh | #BJP | #sofiyaqureshi For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/W0kMjYhATB— DNA (@dna) May 14, 2025

KSR Comments Over AP Police9
ఏపీ పోలీసుల ఆగడాలకు హద్దు ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు ఏమైంది?. ప్రభుత్వమేదైనా.. రాజకీయ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు కానీ.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వంలో మాత్రం పోలీసింగే తక్కువైపోతోంది!. వేసే ప్రతి అడుగు రాజకీయ ప్రేరేపితంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు మహిళలన్న విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు లాకప్‌ మరణాలూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 1980లలో తరచూ కనిపించిన లాకప్‌డెత్‌ వార్తలు మళ్లీ పత్రికలకు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రమీజాబి, షకీలా అనే ఇద్దరు మహిళల లాకప్‌ డెత్‌ రాష్ట్రం మొత్తాన్ని కుదిపేశాయి. విపక్షాల ఆందోళనను అదుపు చేయడమే ప్రభుత్వానికి కష్టమైపోయింది. ఒక మహిళను గన్నవరం వద్ద పోలీసులు హింసిస్తే ప్రజలే తిరుగుబాటు చేసినంత పనిచేశారు. లాకప్‌డెత్‌లకు సంబంధిత పోలీసు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకునేవారు. ఒకసారి విజయవాడలో మురళీధరన్ అనే కేరళ వ్యక్తి లాకప్‌లో మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యాయ వ్యవస్థ జోక్యంతో లాకప్ డెత్‌ల విషయంలో పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.తాజా పరిణామాల విషయానికి వస్తే.. సాక్షి దినపత్రికలో ‘ప్రకాశం జిల్లాలో లాకప్‌ డెత్‌’ శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ బాస్‌లను మెప్పించేందుకు పోలీసులు ఎంతకైనా తెగిస్తారా? అనిపిస్తుంది. దీన్ని చదివితే టీడీపీ జిల్లా నేత, అధిష్టానానికి సన్నిహితుడైన వీరయ్య చౌదరి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీలోని మరో వర్గం వారే హత్య చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీరయ్య చౌదరి అంత్యక్రియలకు స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడంతో ఈ కేసు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆ తరువాత పోలీసులు ఈ హత్య కేసులో అనుమానితులన్న పేరుతో కొందరిని నిర్బంధించి హింసిస్తున్నట్లు.. నేరం తామే చేసినట్టుగా ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిందితులైతే అరెస్టు చేయడం తప్పు కాకపోవచ్చు కానీ.. అనధికారికంగా నిర్బంధించడంతోనే వస్తోంది సమస్య.పోలీసుల హింస తట్టుకోలేక ఒక అనుమానితుడు ప్రాణాలు కోల్పోవడంతో సమస్య జటిలమైంది. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కితే మిమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారట. పోలీసు ఉన్నతాధికారి ఒకరి పాత్ర కూడా ఇందులో ఉందట. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కొంత డబ్బు ముట్టచెప్పి అంత్యక్రియలు కూడా జరిపించేశారట. ప్రజలను కాపాడవలసిన పోలీసులే ఇలా లాకప్ డెత్‌లకు కారణం అవుతుంటే ఏపీలో పాలన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం అవుతుంది.ఎల్లో మీడియా గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఏ ఘటన జరిగినా భూతద్దంలో చూపుతూ నానా యాగీ చేసేవి. రాజమండ్రి వద్ద ఒక పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడికి శిరోముండనం చేశారు. అది బయటకు వచ్చింది. వెంటనే జగన్ ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులపై కేసు కూడా పెట్టి చర్య తీసుకుంది. అయినా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా కలిసి దారుణమైన రీతిలో ప్రచారం చేశాయి. సుధాకర్ అనే ఒక డాక్టర్ మద్యం తీసుకుని విశాఖ రోడ్డుపై రచ్చ చేస్తుంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. దానిపై ఎంత గందరగోళం సృష్టించారో అందరికి తెలుసు. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా విరుచుకుపడేవారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పోలీసుల కారణంగానే మరణించినా ప్రభుత్వం పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించదు.మరోవైపు మాజీ మంత్రి విడదల రజని పట్ల పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వ్యవహరించిన తీరు శోచనీయం. ఆమెను కారు నుంచి బలవంతంగా దించి, కారణం, కేసు వివరాలు చెప్పకుండా ఆమె వద్ద పనిచేసే వ్యక్తిని అరెస్టు చేసిన వైనం తీవ్ర విమర్శలకు గురైంది. గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎంపీటీసీని రాత్రివేళ కనీసం డ్రెస్ మార్చుకోనివ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కృష్ణవేణి అనే సోషల్ మీడియా కార్యకర్తను గతంలో అరెస్టు చేసి పలు స్టేషన్లకు తిప్పారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలు వంటి వాటిని అరికట్టడానికి పోలీసులు ఏం చర్యలు చేపడుతున్నది తెలియదు కాని, ఇలా వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళలను మాత్రం పలు రకాలుగా పోలీసులతో వేధిస్తున్న తీరు అభ్యంతరకరం అని చెప్పాలి.ఇవే కాదు.. అటవీ శాఖాధికారి, సీనియర్‌ అధికారి సిసోడియా వద్ద ఓఎస్డీగా పనిచేసిన మూర్తి అనే అధికారిని సిసోసియా మనుషులే కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూర్తి ఇంటెలిజెన్స్‌ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేశారట. ఈ కేసు సంగతి వదలి, అతనిని పోలీసులు ఇబ్బంది పెడుతుంటే హైకోర్టు జోక్యం చేసుకుని రక్షణ కల్పించిందట. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మార్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ప్రత్యర్దులు కారు టిప్పర్‌తో ఢీకొట్టి వేట కొడవళ్లతో హత్య చేశారు. ఇది టీడీపీ నేతతో ఉన్న ఫ్యాక్షన్ గొడవతోనే. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు వాపోతున్నారు.మరో ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డిని గత నవంబర్ 8న అరెస్టు చేసి పదో తేదీన జరిగినట్లు రికార్డుల్లో చూపించారన్న విషయమై హైకోర్టు కూడా సీరియస్ అయింది. రెడ్ బుక్ పాలనలో సీనియర్ ఐపీఎస్‌ అధికారులు కొందరికి కూడా అక్రమ కేసుల బెడద తప్పడం లేదు. గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండటమే వీరు చేసిన తప్పుగా ఉంది. ఈ పరిణామాలేవీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది కాదు. ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు ఇదే మ్యూజిక్‌ను ఎదుర్కోవలసి వస్తుందని వైఎస్సార్‌సీపీ హెచ్చరికలు చేస్తున్నా, పోలీసు అధికారులు కొందరు రాజకీయ బాస్‌లకు అత్యంత విధేయులుగా ఉండడానికి, వారి మెప్పు పొందడానికి ఆగడాలకు దిగుతున్నారు. ఇది దురదృష్టకరం!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Samantha gives Hints her relationship with Raj Nidimoru in latest post10
అతనితో రిలేషన్‌లో సమంత.. ఆ ఫోటోతో ‍క్లారిటీ ఇచ్చేసిందా?

సమంత ఇటీవల నిర్మాతగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన సొంత బ్యానర్‌లో నిర్మించిన శుభం మూవీతో నిర్మాతగా మారిపోయింది. మే 9న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా తనకు ఎదురలేదని చెబుతోంది సమంత. అయితే తాజాగా శుభం సినిమా వీక్షించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోల్లో బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరు కూడా సామ్‌తో పాటే ఉన్నారు. శుభం వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే గత కొద్దికాలంగా సమంతపై డేటింగ్ రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. దీనికి కారణం సిటాడెల్‌ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు. అతనితో ఇప్పటికే సమంత చాలాసార్లు పలు వేదికలపై జంటగా కనిపించింది. పికిల్ బాల్ లీగ్‌లో వీరిద్దరూ ఒక్కసారిగా వేదికపై మెరిశారు. అప్పుడు కూడా రాజ్‌తో సామ్ డేటింగ్‌లో ఉందని వార్తలొచ్చాయి.తాజాగా మరోసారి శుభం మూవీని సమంత, రాజ్‌ కలిసి వీక్షించిన ఫోటోలు షేర్ చేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ ఫోటోల్లో విమానంలో రాజ్ భుజాలపై సన్నిహితంగా కనిపిస్తూ పోజులిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోతో రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారంటూ పోస్టులు పెడుతున్నారు. మరో నెటిజన్స్‌ ఈ జంటకు సామ్రాజ్‌ అనే కొత్త పేరు బాగుంటుందని కామెంట్ చేశాడు. ఏదేమైనా వీరిద్దరు కలిస్తే డేటింగ్‌ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ వీటికి ఫుల్‌స్టాప్‌ పడేలా కనిపించడం లేదు. కాగా. గతంలో తిరుమలకు వెళ్లిన సమయంలోనూ సమంత, రాజ్‌ నిడిమోరు జంటగా కనిపించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement