Top Stories
ప్రధాన వార్తలు

Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్..!
హైదరాబాద్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. మెట్రో ట్రైన్ టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర రూ. 10 నుంచి రూ. 12కు పెంచగా, గరిష్ట ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. తాజాగా పెంచిన ధరలు మే 17 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎల్ అండ్ టీ స్సష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..ప్రస్తుతం కనిష్ట ధర ₹10.. గరిష్ట ధర 60 రూపాయలురెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలునాలుగు కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు6 కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు 40 రూపాయలు9 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు12 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు18 కిలోమీటర్ల నుంచి 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు21 కిలోమీటర్ల నుంచి 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు24 కిలోమీటర్ల నుంచి ఆపై కిలోమీటర్లకు 75 రూపాయలు పెంచుతూ ఎల్ అండ్ టి నిర్ణయం

డ్రోన్ ఫుటేజ్.. ఉగ్రవాదుల్ని ఎంత క్లియర్‌గా రికార్డు చేసిందో..!
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మరో ఉగ్రదాడికి విఫలయత్నం జరిగింది. రెండు రోజుల క్రితం పలువురు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో మరో కిరాతకానికి పాల్పడే ప్రయత్నంలో దాన్ని మన నిఘా వర్గాలు పసిగట్టి వారిని హతమార్చాయి. మంగళవారం జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు.. మన భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. వారిని లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.జమ్మూ కశ్మీర్ లోని అవంతిపోరాలో ఉగ్రవాదులు తమ పన్నాగానికి సిద్ధమైన సమయంలో దాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టి వారిపై కాల్పులు జరిపి హతమార్చాయి. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదిగా భావించినా దానిపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంచితే, ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ డ్రోన్ ఫుటేజ్ ఒకటి బయటకొచ్చింది.तो ऐसे अपने वीर जवानों ने आतंकी को जहन्नुम पहुंचाया ।#TralEncounter pic.twitter.com/FCkDRqeYe3— Manish Yadav (@itsmanish80) May 15, 2025ఒక కాంక్రీట్ పిల్లర్ కింద ఉగ్రవాదులు తమ రైఫిల్స్ ను సరిచేసుకుంటున్న సమయంలో డ్రోన్ దానిని రికార్డు చేసింది. మరొక వీడియోలో విరిగిన షెడ్ లో గుమిగూడి ఉన్న మరి కొందరు కనిపించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక గడిచిన రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులు.. భారత బలగాల చేతిలో హతమయ్యారు.అయితే వీరంతా పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ తర్వాత తప్పించుకునే క్రమంలో ఓ ఇంట్లో ఆశ్రయం పొంది ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇలా 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు బయటకొచ్చి భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు.

జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది.

మిలటరీ చేతలకు.. నేతల మాటలకు పొంతనేది?
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.👉ఆపరేషన్ సింధూర్ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.👉కశ్మీర్లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

పాకిస్తాన్ మొత్తం జీడీపీ కలిపితే.. తమిళనాడంత లేదు!
పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను చూసి.. ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి భారతీయ రాష్ట్రాల కంటే ముందున్న దాయాది దేశం (పాకిస్తాన్) ఆర్థిక స్థితి గత రెండు దశాబ్దాలుగా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. తమిళనాడు జీడీపీ ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీని దాటేసినట్లు కొత్త డేటా ద్వారా తెలుస్తోంది.పాకిస్తాన్ జీడీపీ కంటే తమిళనాడు జీడీపీ ఇప్పుడు ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతే కాకుండా తమిళనాడులోని ఒక వ్యక్తి సంపాదన.. పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తి సంపాదన కంటే మూడు రెట్లు ఎక్కువ. ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ వివాదాన్ని మానుకుని.. ఆర్ధిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిపై ద్రుష్టి పెట్టాలి. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలి. అప్పడే మీ దేశం బాగుపడుతుందని నౌక్రీ.కామ్ ఫౌండర్ సంజీవ్ బిఖ్‌చందానీ వెల్లడించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. 1995లో తమిళనాడు జీడీపీ 15.7 బిలియన్ డాలర్ల వద్ద, పాకిస్తాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. కాగా 2025 నాటివి తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు) కాగా.. పాకిస్తాన్ జీడీపీ 397.5 బిలియన్ డాలర్లు (రూ. 33.9 లక్షల కోట్లు).ఇదీ చదవండి: అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలుసోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు తమ గర్వాన్ని చాటుకుంటూ.. పాకిస్థాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు అని యూజర్ వెల్లడించగా.. ఒక్క కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ సమస్య తీరితే.. ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్తాన్ జీడీపీ దాటేస్తుందని మరో యూజర్ అన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఎప్పుడో పాకిస్తాన్ జీడీపీని దాటేశాయని ఇంకో యూజర్ అన్నారు.TN GDP is now greater than the GDP of Pakistan. And the population of Pakistan is more than thrice that of Tamil Nadu. In other words the average resident of TN is more than 3X better off than the average resident of Pakistan. To the govt and military of Pakistan - focus on… https://t.co/2AbOw3LAE1— Sanjeev Bikhchandani (@sbikh) May 15, 2025

డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీని అంతర్జాతీయ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే.. ప్రైజ్ మనీనీ ఈసారి రెండింతలు ఐసీసీ పెంచింది.ఈ మెగా మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ. 31 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కనున్నది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల ( సుమారు రూ. 18 కోట్లు) నగదు బహుమతి లభించనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 ఫైనల్లో భారత జట్టుపై గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. అలాగే రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు ప్రైజ్‌మనీని డబుల్ చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగమైన ఇతర జట్లకు కూడా నగదు బహుమతి లభించనుంది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌కు 1.44 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12 కోట్లు), నాల్గవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 1.2 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీ అందనుంది. ఇక డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో దక్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 50.00 పాయింట్లతో ఇండియా మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి పాలవ్వడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామీ, డేన్ పాటర్సన్చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు?

'పంజరం నుంచి బయటపడ్డా'.., భార్య ఆర్తికి జయం రవి కౌంటర్
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల పంచాయితీ కోర్టులో ఉంది. అయితే జయం రవి కుటుంబానికి దూరంగా సింగిల్‌గానే ఉంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో జయం రవి సందడి చేశారు. అదే పెళ్లికి ఆయన గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా కూడా హాజరైంది. దీంతో మరోసారి వీరిద్దరి పంచాయతీ హాట్‌టాపిక్‌గా మారింది. ఇది చూసిన జయం రవి భార్య ఓ రేంజ్లో విమర్శలు చేసింది. తనని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని.. పిల్లల్ని పట్టించుకోనివాడు అసలు తండ్రేనా అంటూ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది. దీనిపై తాజాగా నటుడు జయం రవి స్పందించారు. దీనిపై దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య ఆర్తిని వేధించానన్న ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మౌనంగా ఉండడం తన మనుగడ కోసం ఒక వ్యూహమని పేర్కొన్నాడు.రవి తన లేఖలో రాస్తూ.. "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అనుమతించను. ఇదేం ఆట కాదు.. నా జీవితం. నేను చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. సరైన సమయంలో సత్యం గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయంలో నేను గౌరవంగా ముందుకు వెళ్తా. ఆర్తితో ఉన్నప్పుడు పంజరంలో ఉన్నట్లు అనిపించింది. చివరకు బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నా. నేను శారీరక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపుల నుంచి బయటపడ్డాను. గతంలో నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. అయినప్పటికీ నా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. కానీ చివరికీ దూరంగా వెళ్లాలనేది తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా బరువైన హృదయంతోనే ఇది రాస్తున్నా" అని ప్రస్తావించారు.(ఇది చదవండి: కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు.. స్టార్ హీరో భార్య సంచలన పోస్ట్)జయం రవి లేఖలో రాస్తూ..' నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. ఇలాంటి కల్పిత వాదనలను నేను ఖండిస్తున్నా. నేను ఎప్పటిలాగే నా మాటపై నిలబడతా. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకముంది. ఆర్తి తన పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక లాభం కోసం, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి నా పిల్లలను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం చాలా బాధగా ఉంది. అయితే మేము విడిపోయినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా పిల్లలకు నన్ను దూరం చేసింది. ఇన్నేళ్లు నన్ను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ఏకంగా ఛాతిలో కత్తితో పొడిచినందుకు సంతోషంగా ఉంది. నా నుంచి ఇదే మొదటిది.. చివరిదీ కూడా. ప్రేమతో జీవించండి.. జయం రవిని జీవించనివ్వండి' అని వివరించారు.కాగా.. జయం రవి గతేడాది సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఆర్తితో తన బంధానికి ముగింపు పలకనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ తర్వాత తన అనుమతి లేకుండా ఎలా ప్రకటిస్తారని ఆర్తి ఖండించింది. తాజాగా సింగర్ కెనిషాతో రవి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కోలీవుడ్‌లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ravi Mohan (@iam_ravimohan)

రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ఏంటి?.. సంచలనంగా ద్రౌపది ముర్ము ప్రశ్నలు!
ఢిల్లీ: ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో, రాష్ట్ర బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ గడువు విధించడంపై తాజాగా ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) స్పందించారు.ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు.. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు పశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై స్పందించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 గవర్నర్ అధికారాలను, బిల్లులకు ఆమోదం తెలపడం లేదా నిలిపివేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం వంటి విధానాలను వివరిస్తుందని రాష్ట్రపతి హైలైట్ చేశారు. అయితే, ఈ రాజ్యాంగ ఎంపికలను ఉపయోగించుకోవడానికి గవర్నర్‌కు ఎలాంటి గడువును ఆర్టికల్ 200లో పేర్కొనలేదని అన్నారు.సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలివే..రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా?.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?.రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ వినియోగం న్యాయ సమ్మతమైనదా?రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?.సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?.ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?.రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా? అని ప్రశ్నించారు. Big showdown brews between Rashtrapati Bhavan & Supreme CourtPresident Droupadi Murmu invokes Article 143, seeking clarity on SC's ruling that set deadlines for Tamil Nadu Governor RN Ravi to act on bills—without Centre's nod. CJI Gavai to form a Constitution BenchKey… pic.twitter.com/1DShRAn21P— Nabila Jamal (@nabilajamal_) May 15, 2025సుప్రీంకోర్టు తీర్పు ఇదే..తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి!. ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ చాన్స్లర్ల బిల్లులు తదితరాలున్నాయి.రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది.దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది.

పీవోకేపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అలాగే, దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ నేడు జమ్ము కశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ యుద్ధ వీరులను రాజ్‌నాథ్ అభినందించారు. అనంతరం, రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘సైనికుల ధైర్యసాహసాలు గర్వకారణం. ఉగ్రవాదం అంతానికి ఎంత దూరమైనా, ఎక్కడికైనా వెళ్తాం. ఉగ్రవాదంపైనే కాదు.. పీవోకేపైనా మన యుద్ధం ఆగదు. పాకిస్తాన్ అణ్వయుధాల బ్లాక్‌మెయిల్‌కు భయపడం. ఎలాంటి పరిస్థితులలైనా మన సైన్యం ఎదుర్కోగలదు’ అంటూ ప్రశంసలు కురిపించారు. శత్రువులను నాశనం చేసిన ఆ శక్తిని అనుభూతి చెందడానికి నేను ఇక్కడ ఉన్నాను. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చౌకీలు, బంకర్లను మీరు ధ్వంసం చేసిన విధానాన్ని, శత్రువు దానిని ఎప్పటికీ మరచిపోలేడని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే, పహల్గామ్ దాడి తర్వాత, జమ్ముకశ్మీర్ ప్రజలు పాకిస్తాన్, ఉగ్రవాదులపై తమ కోపాన్ని వ్యక్తం చేసిన విధానం గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh says, "...I ask the entire world if nuclear weapons are safe in the hands of such an irresponsible and rogue nation. I believe that Pakistan's nuclear weapons should be taken under the supervision of International Atomic… pic.twitter.com/7tQA7mbZZI— ANI (@ANI) May 15, 2025 #WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh, J&K Lt Governor Manoj Sinha and CM Omar Abdullah join the jawans at Badami Bagh Cantonment in raising slogans of 'Bharat Mata ki Jai'. The Defence Minister addressed the jawans here. #OperationSindoor pic.twitter.com/r2sCXZGKkB— ANI (@ANI) May 15, 2025#WATCH | J&K: Defence Minister Rajnath Singh meets and interacts with jawans at Badami Bagh Cantonment. #OperationSindoor pic.twitter.com/vZXzX3W7FL— ANI (@ANI) May 15, 2025

సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఏమందంటే?
ఢిల్లీ: భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు కూడా నమోదైంది. అనంతరం, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మంత్రి తీరును తప్పుపట్టింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి అని సూచనలు చేసింది.ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కల్నల్ ఖురేషీపై మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు చేశారు. ఖురేషీని ఉద్దేశిస్తూ ఆమెను ‘ఉగ్రవాదుల సోదరి’ అంటూ ఉగ్రవాదులను హతమర్చేందుకు ఆమె పాకిస్తాన్ వెళ్లారని విజయ్ షా అన్నారు. దీంతో, సదరు మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం, హైకోర్టు ఆదేశాలపై మంత్రి విజయ్.. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంత్రి పిటిషన్‌ను రేపు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేగాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ‘ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోవైపు.. అటు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.On the shameful statement of BJP minister Vijay Shah by referring to Colonel Sofia as Sister of Terrorists, The division bench of Jabalpur High Court has suo motu directed to register a case against Vijay Shah under serious criminal sections. Via : @sanjaygupta1304 pic.twitter.com/guS2ihv4hb— Mohammed Zubair (@zoo_bear) May 14, 2025
AP ECET 2025: ఏపీ ఈసెట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ మాస్టర్ ప్లాన్
పెళ్లి వేడుక ఆనందంగా వధూవరులు తప్ప..అందరూ
సిద్దమవుతున్న ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్: లాంచ్ ఎప్పుడంటే?
కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు: జైశంకర్
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్..!
Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!
ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..
కిలో చికెన్‌కు రూ.20 కమిషన్ ఇవ్వాల్సిందే.. ఆళ్లగడ్డలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
కర్నూలులో కాలుష్య కాసారం
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
AP ECET 2025: ఏపీ ఈసెట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ మాస్టర్ ప్లాన్
పెళ్లి వేడుక ఆనందంగా వధూవరులు తప్ప..అందరూ
సిద్దమవుతున్న ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్: లాంచ్ ఎప్పుడంటే?
కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు: జైశంకర్
Hyderabad: ప్రయాణికులకు మెట్రో షాక్..!
Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!
ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..
కిలో చికెన్‌కు రూ.20 కమిషన్ ఇవ్వాల్సిందే.. ఆళ్లగడ్డలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్.. దారుణంగా నష్టపోనున్న ఆర్సీబీ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
కర్నూలులో కాలుష్య కాసారం
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
మన వేలితో మన కన్నే..!
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
"చివరికి ప్రకృతి కూడా కరుణించింది! 'సూపర్ సిక్స్' చలని కబురు ఎప్పుడు వింటామో..ఏమో! "
సినిమా

‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’పై విజయ్ దేవరకొండ!
తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ పత్రిక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తన తాజా ఎడిషన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండను ప్రచురించింది. "విజయ్ దేవరకొండ: ది మ్యాన్ ఆన్ ఎ మిషన్" అనే ఆకర్షణీయ టైటిల్‌తో విడుదలైన ఈ మ్యాగజైన్ దృష్టిని సొంతం చేసుకుంటోంది. "ఆత్మవిశ్వాసం, ఆకర్షణతో నిండిన విజయ్ దేవరకొండను మేము క్యాప్చర్ చేశాం. తన రాబోయే చిత్రం 'కింగ్డమ్'తో విజయ్ ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు" అని 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తమ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన పాన్-ఇండియా చిత్రం "కింగ్డమ్"తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. "కింగ్డమ్" జూలై 4, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ మరియు జోమన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా కూడా ఉన్నతంగా రూపొందుతోంది. 'కింగ్డమ్' విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RAPO 22: ఆంధ్రాకింగ్ తాలుకా.. టికెట్ ఇవ్వాల్సిందే..
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం ‘RAPO 22’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అభిమానుల్లో సందడి రేపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. నేడు (మే 15) రామ్ బర్త్‌డేను పురస్కరించుకుని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’(Andhra King Taluka) అనే టైటిల్‌ను ఆకర్షణీయమైన గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.ఈ గ్లింప్స్ ఒక కిక్కిరిసిన థియేటర్ వెలుపల అభిమానుల కోలాహలంతో ప్రారంభమవుతుంది. అక్కడ ‘ఆంధ్ర కింగ్’ సూర్య కుమార్ (ఉపేంద్ర) కొత్త సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎమ్మోర్వో నుంచి ఎమ్మెల్యే వరకు వీఐపీ రిఫరెన్స్‌లతో టికెట్లు తీసుకోవడంతో విసిగిపోయిన థియేటర్ యజమాని వద్దకు రామ్ సైకిల్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అభిమానిగా చెప్పగానే యజమాని టికెట్లను అందజేస్తాడు. వాటిని తీసుకున్న రామ్ తోటి అభిమానులతో సంబరాలు చేసుకుంటాడు. అనంతరం సూర్య కుమార్ భారీ కటౌట్‌పై పూల వర్షం కురిపిస్తూ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని అరవడంతో టైటిల్ కార్డ్ పడుతుంది.పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సాగర్ పాత్రలో, భాగ్యశ్రీ బోర్సే మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.మరోవైపు, సోషల్ మీడియాలో రామ్ పోతినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు #HappyBirthdayRAPO హ్యాష్‌ట్యాగ్‌తో ఈ టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2, 2025న విడుదల కానుందని సమాచారం.

దేశభక్తిని రగిలించే సినిమా.. తెలుగులో విడుదల
జలియన్ వాలాబాగ్ విషాదం నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేసరి చాప్టర్ 2’ (Kesari Chapter 2). ఏప్రిల్ 18న బాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 23న టాలీవుడ్లో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్‌లైన్‌ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. అక్షయ్ కుమార్ నటించిన దేశభక్తి చిత్రాల్లో ‘కేసరి’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా ‘కేసరి: ఛాప్టర్ 2’ను మేకర్స్ రూపొందించారు. ప్రముఖ రచయితలు రఘు, పుష్ప పలాట్ రచించిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ ఆధారంగా కరణ్ సింగ్ దీన్ని తెరకెక్కించారు. కేసరి చాప్టర్2 సినిమాకు కూడా బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన కాల్పులు, తొక్కిసలాటలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. హిందీ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అయిన ఈ చిత్రం మే 23న తెలుగులో కూడా విడుదల కానుంది. గంతంలో ఛావా సినిమా కూడా మొదట హిందీలో విడుదలై ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.దేశభక్తిని రగిలించే కోర్టు రూం డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను బ్రిటీష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలని అక్షయ్ కుమార్ గతంలో కోరారు. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ చిత్రాన్ని చూసి వారి తప్పులను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ఈ సినిమా చూశాక వారు కచ్చితంగా క్షమాపణలు చెబుతారని ఆయన అన్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు, దర్శకుడు సుందర్ సి కలిసి నటించిన 'గ్యాంగర్స్' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది. ఖుష్బు సుందర్ నిర్మించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.'గ్యాంగర్స్' తమిళ యాక్షన్ కామెడీ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, మునిష్కాంత్, భగవతి పెరుమాల్ నటించగా వెంకట్ రాఘవన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. ఒక చిన్న పట్టణంలో ఉండే పాఠశాలలో ఒక బాలిక తప్పిపోతుంది, ఉపాధ్యాయురాలు సుజిత (కేథరిన్ థ్రెసా) ఆమెను కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు ఓ పోలీసు అధికారి రహస్యంగా అదే స్కూల్లో పీటీగా అండర్ కవర్లో నియమించబడతారు. పోలీస్ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి..? ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల వద్ద ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. వీరికి, తప్పిపోయిన బాలికకు ఉన్న లింక్ ఏంటి..? వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు?
ఐపీఎల్-2025 పునఃప్రారంభానికి సర్వం సిద్దమైంది. మే 17వ తేదీ నుంచి క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగిలిన మ్యాచులు మొదలవనున్నాయి. అయితే ఐపీఎల్ పునఃప్రారం వేళ గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్.. జాతీయ విధుల కారణంగా ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్..తిరిగి ఐపీఎల్లో పాల్గోనేందుకు రావడం లేదు. ఈ విషయాన్ని బట్లర్ ఇప్పటికే గుజరాత్ ఫ్రాంచైజీకి తెలియజేశాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో బట్లర్ సభ్యునిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మే 29 నుంచి ఇంగ్లండ్ జట్టు విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. కాగా తొలుత బట్లర్ ఐపీఎల్లో ఆడేందుకు తిరిగి భారత్‌కు వస్తాడని, ప్లే ఆఫ్స్‌కు మాత్రమే దూరం కానున్నడాని వార్తలు వినిపించాయి. కానీ పూర్తిగా ఇప్పుడు మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జోస్ బట్లర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన బట్లర్..71.43 సగటుతో 500 పరుగులు చేశాడు. ప్లే ఆఫ్స్‌కు ముందు బట్లర్ దూరం కావడం గుజరాత్‌కు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. గుజరాత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది. టైటాన్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు గిల్ సేన తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.గుజరాత్ జట్టులోకి స్టార్ ప్లేయర్..ఇక గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం బట్లర్ స్ధానాన్ని శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ శ్రీలంక క్రికెటర్ పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అయితే పీఎస్ఎల్ తాత్కాలికంగా వాయిదా పడడంతో మెండిస్‌తో గుజరాత్ టైటాన్స్‌తో జతకట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025 Resumption: ఢిల్లీ క్యాపిటల్స్‌పై దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు

IPL 2025 Resumption: ఆర్సీబీకి శుభవార్త.. హాజిల్‌వుడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..?
మే 17 నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానున్న వేల ఆర్సీబీకి శుభవార్త అందింది. భారత్-పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన ఆ ఫ్రాంచైజీ ప్లేయర్లంతా తిరిగి వచ్చేందుకు అంగీకరించారని తెలుస్తుంది. జాతీయ విధుల కారణంగా జేకబ్ బేతెల్ ఒక్కడే తదుపరి లెగ్‌కు అందుబాటులో ఉండడని సమాచారం.స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగొచ్చేందుకు అంగీకరించడం ఆర్సీబీకి అతి పెద్ద శుభవార్త. వాస్తవానికి హాజిల్‌వుడ్ ఐపీఎల్ వాయిదా పడకముందే గాయపడ్డాడు. రీ షెడ్యూల్ తర్వాత అతను అందుబాటులో రావడం దాదాపుగా అసాధ్యమేనని అంతా అనుకున్నారు. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే (జూన్ 11) డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో హాజిల్‌వుడ్ జాతీయ విధులకే ప్రాధ్యాన్యత ఇస్తాడని ప్రచారం జరిగింది.అయితే ఆర్సీబీ యాజమాన్యం చర్చల కారణంగా హాజిల్‌వుడ్ సీజన్ అయిపోయే వరకు ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. మరోవైపు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు లీగ్ అయిపోయే వరకు కొనసాగేందుకు అనుమతి ఇవ్వడంతో లుంగి ఎంగిడి సేవలు కూడా ఆర్సీబీ లీగ్ అయిపోయే వరకు వినియోగించుకోనుంది.మిగతా విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. ఫిల్ సాల్ట్ విండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. దీంతో అతను ప్లే ఆఫ్స్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. టిమ్ డేవిడ్, లివింగ్‌స్టోన్ వారి జట్లలో సభ్యులుగా లేరు. వీరి నుంచి కూడా ఎలాంటి సమస్య లేదు. ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా రొమారియో షెపర్డ్ తమ బోర్డును ఒప్పించుకుని లీగ్ మొత్తానికి అందుబాటులోకి వచ్చాడు. మొత్తంగా చూస్తే.. విదేశీ ఆటగాళ్లంతా లీగ్ అయిపోయే వరకు అందుబాటులో ఉండటం ఆర్సీబీకి శుభపరిణామంగా చెప్పవచ్చు.ఈ సీజన్లో ఆర్సీబీ గతంలో ఎన్నడూ లేనట్లుగా హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తుంది. విదేశీ ఆటగాళ్లతో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా పూర్తిగా అందుబాటులో ఉండటం (టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడం), అందులోనూ భీకర ఫామ్‌లో ఉండటం ఆర్సీబీ తొలి టైటిల్ కలను నెరవేర్చేలా కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ దేశీయ ఆటగాళ్లు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉన్నారు. బౌలర్లలో యశ్ దయాల్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఆర్సీబీ ప్రస్తుమున్న ప్రధాన సమస్య వారి కెప్టెన్ రజత్ పాటిదార్ ఒక్కడే. పాటిదార్ గాయంతో బాధపడుతుండటంతో పాటు పెద్దగా ఫామ్‌లో లేడు. అతనితో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. వీరిద్దరు కూడా లైన్లోకి వచ్చారంటే ఈ సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. దేవ్‌దత్ పడిక్కల్ స్థానంలో వచ్చిన మయాంక్ అగర్వాల్ కూడా టాపార్డర్‌లో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో (11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు) ఉన్న ఆర్సీబీ.. ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు), మే 23న సన్‌రైజర్స్‌తో (బెంగళూరు), మే 27న లక్నోతో (లక్నో) తలపడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.

IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్
ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాత్కాలిక రీప్లేస్మెంట్ల కోసం వెతుకుతున్న వేల, టీమిండియా ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఓపెనర్ పృథ్వీ షా పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఈ సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని షా.. "బ్రేక్ కావాలంటూ" ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షా రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.2018లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల షా.. ఐపీఎల్లో డీసెంట్ రికార్డు (79 మ్యాచ్‌ల్లో 147.467 స్ట్రయిక్‌రేట్‌తో 1892 పరుగులు) కలిగి ఉన్నాడు. అయితే వ్యక్తిగత అలవాట్లు, ఫిట్నెస్ కోల్పోవడం అతన్ని ఐపీఎల్ పాటు దేశవాలీ క్రికెట్‌కు దూరం చేశాయి. గత సీజన్లో ఢిల్లీకి ఆడిన షా.. 8 మ్యాచ్‌ల్లో 163.63 స్ట్రయిక్‌రేట్‌తో 198 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ సేవలు కోల్పోవడంతో షా ఆ జట్టులో చోటు ఆశిస్తున్నాడు.ప్రస్తుత తరుణంలో షాకు ఢిల్లీ అవకాశం ఇవ్వకపోయినా ముంబై ఇండియన్స్ ఛాన్స్ ఇవ్వొచ్చన్న టాక్ నడుస్తుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు దేశీయ బ్యాటర్ కోసం చూస్తుందని సమచారం. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్తుగా కీర్తించబడ్డ పృథ్వీ షా ఇప్పుడు ఐపీఎల్లో ఛాన్స్ కోసం వెంపర్లాడటం ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఇలాంటి గతే పడుతుందని జనాలు అంటున్నారు. పృథ్వీ షాలా కావొద్దని ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న యువ ఆటగాళ్లకు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 మే 17 నుంచి పునఃప్రారంభం కానుంది. యుద్దం నేపథ్యంలో స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ క్రికెటర్లు జాతీయ జట్ల అవసరాల దృష్ట్యా ఐపీఎల్ తదుపరి లెగ్‌లో పాల్గొనలేకపోతున్నారు. కొందరు ఇతరత్రా కారణాల చేత ఐపీఎల్లో కొనసాగేందుకు విముఖత చూపారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తిరిగి రాని ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనే పృథ్వీ షా లాంటి చాలా మంది భారత ఆటగాళ్లు ఛాన్స్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

IPL 2025 Resumption: ఆ దేశ ఆటగాళ్లు లీగ్ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటారు..!
ఐపీఎల్ 2025 విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తొలుత తమ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండరని (డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాల కోసం) ప్రకటించిన ఆ క్రికెట్ బోర్డు, తాజాగా మనసు మార్చుకున్నట్లు సమాచారం. లీగ్ పూర్తయ్యే వరకు (జూన్ 3) వారి ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంచైజీలతో ఉండేందుకు క్రికెట్ సౌతాఫ్రికా అంగీకరించినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.ఈ ప్రచారం నిజమైతే ఫ్రాంచైజీలకు సగం టెన్షన్ వదిలినట్లే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మంది డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఎనిమిది మందిలో ఆరుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్, స్టబ్స్) ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్‌లో ముందున్నాయి. ఈ ఆరుగురు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోతే సంబంధిత ఫ్రాంచైజీలు భారీగా నష్టపోతాయి.చక్రం తిప్పిన ఫ్రాంచైజీ యజమానులుక్రికెట్ సౌతాఫ్రికా ఆథ్వర్యంలో నడిచే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. తాజా పరిస్థితి నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పాయి. వారు క్రికెట్ సౌతాఫ్రికాతో మాటామంతి జరిపి ఆ దేశ ఆటగాళ్లను ప్లే ఆఫ్స్ పూర్తయ్యే వరకు కొనసాగేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది.కాగా, రీ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ సౌతాఫ్రికా తమ ఆటగాళ్లను ముందుగా అనుకున్నట్లు మే 26వ తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పడంతో క్రికెట్ సౌతాఫ్రికా తమ సన్నాహకలను (డబ్ల్యూటీసీ ఫైనల్) వాయిదా వేసుకుంది. జూన్ 3 తర్వాతే వాటి షెడ్యూల్‌ను ప్లాస్ చేసుకుంది.ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు చెందిన సౌతాఫ్రికా ఆటగాళ్లు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.
బిజినెస్

కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధం
భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పాక్ యుద్ధ విమానాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విధానం ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు కలిసొచ్చే అంశంగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న యుద్ధ వ్యూహాలు, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలతో భారతదేశ డ్రోన్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలు యుద్ధం, భద్రతా అవసరాలను తీర్చే వేగవంతమైన ఆవిష్కరణలవైపు అడుగులు వేస్తున్నాయి. ఇది ఆయా కంపెనీల్లో పెట్టుబడులు ఆకర్షించి, సమర్థంగా వాటిని ఖర్చు చేసేందుకు వీలవుతుందని నిపుణులు భావిస్తున్నారు.డ్రోన్ వార్ఫేర్లో ఆవిష్కరణలుశత్రు డ్రోన్లు నిరంతర భద్రతకు ముప్పుగా మారడంతో బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్, కెప్లర్, జెబు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలు అడ్వాన్స్డ్ డిటెక్షన్, జామింగ్, న్యూట్రలైజేషన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నాయి. సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాలు, పౌర మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఇవి పరిష్కారాలు అందిస్తున్నాయి.ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?కొత్త టెక్నాలజీలపై దృష్టిఇటీవల యుద్ధంలో తక్కువ ఖర్చుతో కూడిన అధిక ప్రభావవంతమైన డ్రోన్ల పాత్రను భారత సాయుధ దళాలు గుర్తించాయి. ఇది కంబాట్ యూఏవీలు, నిఘా డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థల్లో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ డ్రోన్ రంగం 2019 నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా నిధులను ఆకర్షించింది. ఇది తదుపరి తరం సైనిక సాంకేతికతపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తుంది. ఆధునిక యుద్ధాన్ని తట్టుకోగల కచ్చితమైన పేలోడ్లను మోసుకెళ్లే డ్రోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇది స్టార్టప్‌ల వృద్ధికి తోడ్పడుతుంది. స్మార్ట్, డిస్ట్రిబ్యూటెడ్ డిఫెన్స్ సొల్యూషన్స్, రియల్ టైమ్ బ్యాటిల్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలపై కంపెనీ దృష్టి సారిస్తున్నాయి.

‘అందుకే ప్రభుత్వ ఉద్యోగం మేలు అనేది’..
టెక్ దిగ్గజాలు వరుస పెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా సత్య నాదళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీతాలు, జాబ్ సెక్యూరిటీ పరంగా ఐటీ జాబ్‌లు, ప్రభుత్వ ఉద్యోగాలను పోలుస్తూ చర్చ నడుస్తోంది. అమెరికాలోని ఈ సంస్థలో పనిచేస్తున్న తన సోదరుణ్ణి ఉద్యోగం నుంచి తొలగించారంటూ సోషల్ మీడియాలో ఓ మహిళ చేసిన పోస్ట్ దానికి గూగుల్ కు చెందిన ఇంజినీర్ ప్రతిస్పందన వైరల్‌గా మారాయి.మైక్రోసాఫ్ట్ లేఆఫ్‌ల (Microsoft Layoffs) నేపథ్యంలో స్నేహ అనే మహిళ ‘ఎక్స్’లో ఓ పోస్ట్‌పెట్టారు. ‘అమెరికాలో పనిచేస్తున్న నా కజిన్ బ్రదర్‌ను మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి తొలగించింది. టెక్ అనేది స్థిరంగా ఉండే ర రంగం కాదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలని, కనీసం అక్కడ ఉద్యగ భద్రత అయినా ఉంటుందని మా పెద్దవాళ్లు చెబుతుంటారు’ అంటూ రాసుకొచ్చారు.బెంగళూరుకు చెందిన గూగుల్ ఇంజనీరు రాహుల్ రాణా ఈ పోస్టకు ప్రతిస్పిందించారు. ప్రభుత్వ ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే భావనను ఆయన తిప్పికొట్టారు. టెక్ పరిశ్రమలో అధిక సంపాదన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ఉద్యోగ భద్రత ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటుందని వాదించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితకాలంలో సంపాదించే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ మొత్తాన్ని టెక్ ఉద్యోగి కొన్ని సంవత్సరాలలోనే సంపాదించవచ్చని చెప్పుకొచ్చారు.ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మరికొంత మంది యూజర్లు ప్రతిస్పందించారు. టెక్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాల మధ్య లాభనష్టాలను బేరీజు వేస్తూ, ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రయోజనాలు , కెరీర్ స్థిరత్వంపై తమ దృక్పథాలను పంచుకున్నారు. తన వాదనలను మరింత పెంచుతూ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు వేతనానికి మించి గణనీయమైన ప్రయోజనాలను అందించగలవని, గృహనిర్మాణం, విద్యుత్తు, ఇతర సౌకర్యాల అలవెన్సులతో సహా, ఇది గణనీయమైన సంపద సేకరణకు దారితీస్తుందని స్నేహ పేర్కొన్నారు.

రూ.3,076 కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
భారతదేశ సెమీకండక్టర్ మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహంగా ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో రూ.3,076 కోట్ల సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రూ.76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా ఉంది.సెమీకండక్టర్లు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలకు కీలకంగా మారాయి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పారిశ్రామిక పరికరాలు.. వంటి ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్‌లో వీటి వాడకం అనివార్యం అయింది. తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్ట్ సెమీకండక్టర్ డిస్ప్లే డ్రైవర్ చిప్ తయారీపై దృష్టి పెడుతుంది. ఈ డిస్ప్లే డ్రైవర్ చిప్ అనేది స్క్రీన్లపై చిత్రాలు ఎలా కనిపిస్తాయో నియంత్రించే కీలకమైన భాగం.దేశీయ అవసరాలు తీర్చేలా..నెలకు 20,000 వేఫర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ నెలకు 36 మిలియన్ చిప్స్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. డిస్ప్లే డ్రైవర్ చిప్‌లకు సంబంధించి 40% దేశీయ డిమాండ్‌ను తీర్చగలదని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?డిజిటల్ భవిష్యత్తు5జీ, ఏఐ, ఐఓటీ, స్మార్ట్ మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు సెమీకండక్టర్ పరిశ్రమ కీలకం. భారతదేశం గ్లోబల్ సెమీకండక్టర్ పవర్‌హౌజ్‌గా మారేందుకు అడుగులు వేస్తున్న తరుణంగా జెవార్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు సాంకేతికత వృద్ధితోపాటు దేశానికి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతాయని నిపుణులు అంటున్నారు.

రుణాలపై ప్రొవిజనింగ్ తగ్గించే యోచనలో ఆర్బీఐ
బ్యాంకులు అనుసరిస్తున్న ప్రాజెక్టు రుణాల ప్రొవిజనింగ్‌ను తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తున్నట్లు తెలిసింది. ప్రాజెక్ట్ ఫైనాన్స్ ప్రొవిజనింగ్‌ను గతంలో ప్రతిపాదించిన 5 శాతం నుంచి 1-2.5 శాతానికి తగ్గించబోతున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేలా రుణదాతలకు ఈ విధాన మార్పు వల్ల ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే అధిక ప్రొవిజనింగ్ రుణ లభ్యతను పరిమితం చేస్తుంది. బ్యాంకులు రుణాలపై రిస్క్‌ను పరిమితం చేసేందుకు తమ లాభాల్లో కొంత భాగాన్ని ప్రొవిజనింగ్ రిజర్వుకు కేటాయించాల్సి ఉంటుంది.ఈ మార్పు ఎందుకు?మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రాజెక్టు ఫైనాన్స్ రుణాలు కీలకం. ఇంతకు ముందు ప్రతిపాదించిన అధిక ప్రొవిజనింగ్ అవసరాలు ఇంకా కార్యరూపం దాల్చని ప్రాజెక్టులతో ముడిపడి ఉన్న బ్యాంకింగ్ నష్టాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రొవిజనింగ్‌ను తగ్గించడంతో ఇప్పటికే అమలవుతున్న రవాణా, ఇంధనం, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్ట్‌లకు మరింత రుణాన్ని అందించే అవకాశం ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది. దీనికి తోడు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, క్యాపిటల్ మార్కెట్ల హెచ్చుతగ్గులతో సహా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి దీర్ఘకాలిక పెట్టుబడులకు సవాళ్లను సృష్టించింది. ప్రొవిజనింగ్ అవసరాన్ని తగ్గించడం వల్ల బ్యాంకులు ఆర్థిక భారం లేకుండా రుణ సౌలభ్యాన్ని కొనసాగించేందుకు వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?బ్యాంకులు, ఆర్థిక వృద్ధిపై ప్రభావంక్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్కు సంబంధించి ఆర్బీఐ విధాన మార్పులను బ్యాంకింగ్ రంగం నిశితంగా గమనిస్తోంది. ప్రొవిజనింగ్ అవసరాన్ని 1-2.5 శాతానికి తగ్గిస్తే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలను ప్రోత్సహించవచ్చు. తద్వారా దేశీయ పెట్టుబడులు పెరుగుతాయి. ఇది మౌలిక సదుపాయాల వృద్ధిని వేగవంతం చేయడం, ఆర్థిక విస్తరణకు మద్దతు ఇవ్వడం అనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. గతంలో నిర్బంధ బ్యాంకింగ్ నిబంధనల వల్ల పెట్టుబడి ఆలస్యం జరిగిన రంగాల్లో ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అనుమతులను పెంచడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది.
ఫ్యామిలీ

మహిళలు తప్పక చదవాల్సిన పుస్తకం..!
మహిళల హక్కుల గురించి అస్పష్టత ఉన్నచోట, అంతగా అవగాహన లేని చోట ఉపయోగపడే పుస్తకం లీగల్లీ యువర్స్: ఎవ్రీ ఉమెన్స్ గైడ్ టు హర్ లీగల్ రైట్స్. లాయర్, రైట్స్ అడ్వకేట్ మానసి చౌదురి రాసిన ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ప్రచురించింది. భారతీయ మహిళల న్యాయ హక్కులపై సమగ్రమైన స్పష్టతను అందించే పుస్తకం ఇది. మన దేశ న్యాయవ్యవస్థను అర్థమయ్యేలా చేస్తూ, సంక్లిష్ట చట్టాల గురించి సులువైన రీతిలో పరిచయం చేస్తుంది.వారస్వత హక్కులు, ఉద్యోగ ప్రదేశంలో వేధింపులు, రీప్రొడిక్టివ్ రైట్స్...మొదలైన వాటి గురించి వివరిస్తుంది.‘జ్ఞానం అనేది ఎంపవర్మెంట్కు తొలి అడుగు’ అంటున్న మానసి చౌదురి ‘పింక్ లీగల్’ వ్యవస్థాపకురాలు.‘ఈ పుస్తకం మహిళలకు మాత్రమే కాకుండా, మహిళల హక్కులను అర్థం చేసుకోవడంలో పురుషులకు కూడా ఉపకరిస్తుంది’ అంటుంది హార్పర్‌కాలిన్స్ ఇండియా ఎడిటర్ హిమాకుమార్.(చదవండి: Miss world 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్)

పురుషులూ మేలుకోండి..హాట్ టాపిక్‌గా ఇద్దరు మహిళల పెళ్లి!
ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్లో జరిగిన సంఘటన నెట్టింట చర్చకు దారి తీసింది. ఇద్దరు మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో వింత ఏముంటుంది.. ఇవి ఈ మధ్యకాలంలో కామనే కదా అనుకుంటున్నారా? అయితే మీరీ అసాధారణ సంగతి గురించి తెలుసుకోవాల్సిందే.బదాయూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరు ఈ పెళ్లికి చెప్పిన కారణం ఏంటో తెలుసా? వారికి పురుషులంటే ఇష్టం లేదుట. డేటింగ్లు, డేటింగ్ యాప్ మెసాలు, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న నమ్మకద్రోహాలతో విసిగిపోయారట. ఎందుకంటే బదౌన్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు భర్తలు తమ కులాన్ని, మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ మోసాన్ని భర్తించలేక ఇద్దరూ తమ భర్తల్ని వదిలేశారు. ఇక పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు మహిళల జంట తెలిపింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీ యాంశమైంది.ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కలిసిన ఈ జంట, తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇద్దరూ ఫేస్బుక్లో ఇద్దరు వ్యక్తులను ప్రేమించి, మోసపోయారు. సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న దానికి పూర్తి భిన్నంగా వారి వైఖరి ఉండటంతో చాలా బాధపడ్డారు. పైగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఈ అనుభవమే వారిద్దరిని దగ్గరి చేసింది. డిల్లీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరూ స్నేహితులయ్యారు. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బాధలను, బాధలను పంచుకోవడం ప్రారంభించారు. వారిద్దరూ తమ కథలను ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు, వారి ఇద్దరి అనుభవాలు ఒకేలా ఉండటంతో వారు ఆశ్చర్యపోయారు. మూడు నెలలుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరు ఇక జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయించు కున్నారు. దీనికి సంబంధించికి న్యాయపరమైన మద్దతు కోరుతూ న్యాయవాదిని కూడా సంప్రదించారు. సమాజంలో భార్యాభర్తలుగా జీవించడానికి అవకాశాలపై ఆరాతీశారు. అయితే, భారతీయ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలకు గుర్తింపు లేదని న్యాయవాది దివాకర్ తేల్చి చెప్పారు. అయినా తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న యువతులు కోర్టు ఆవరణలోని శివాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.స్వలింగ వివాహాన్ని న్యాయస్థానం అంగీకరించదని తెలుసు. చట్టం అనుమతి లేకపోయినప్పటికీ, భార్యాభర్తలు తమ జీవితాన్ని కొనసాగిస్తామని వధూవరులు మీరా, స్వప్న(పేర్లు మార్పు) వెల్లడించారు. ముందుగా మా కుటుంబ సభ్యులకు చెబుతాము, వారు అంగీకరించకపోతే ఢిల్లీలో ఇల్లు కట్టుకుంటాం. జీవితంలో సంతోషకరమైన రోజులు గడపడానికే నిర్ణయం తీసుకున్నా మన్నారు.“మా పురుషులు మమ్మల్ని మోసం చేశారు, ఇకపై వారిని విశ్వసించలేము కాబట్టి మేము ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము” అని సప్నా ప్రకటించింది. వధువు మీరా, వరుడు సప్న న్యాయవాదుల బృందం పర్యవేక్షణలో చట్టబద్ధంగా, స్థానిక హనుమాన్ ఆలయ పూజారి వారిద్దరికీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఒళ్ళంతా పురుగులు పాకుతున్నాయంటుంది!
మా అమ్మ గారికి 78 సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఆమె ఒక 6–7 నెలల నుండి ఒళ్ళంతా చిన్న చిన్న పురుగులు పాకుతున్నాయని, దురదగా ఉందని వళ్లంతా గోక్కుంటోంది. స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకుని చర్మం డాక్టర్ గారి దగ్గరికి తీస్కుని వెళ్ళాము. పరీక్ష చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని దురద తగ్గడానికి కొన్ని మందులు ఆయింట్మెంట్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత కూడా ఆమెకు ఉపశమనం లేదు. పురుగులు చర్మంలోకి చొచ్చుకు పోతున్నాయని గొడవ చేస్తుంది. పుండ్లు పుట్టేలా చర్మాన్ని గోకుతుంది. ఒక చిన్న ఖాళీ డబ్బా తీస్కుని దాంట్లో పురుగులు వేశానని మమ్మల్ని కూడా చూడమని చెప్తుంది. ఆ డబ్బాలో ఆమె బట్టలవి చిన్న చిన్న దారపు పోగులు తప్ప ఏమి లేవు అంటే ఒప్పుకోదు. ఆవిడ బాధ తట్టుకోలేక ఇంకో స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళ్ళాము. ఆయన తల స్కాన్ చేసి ఒకసారి మానసిక వైద్యునికి చూపించమని చెప్పారు. ఆమె అన్ని రకాలుగా బాగుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. జ్ఞాపక శక్తి బాగుంది. ఈ పురుగులు పాకుతున్నాయిని ఒక్క కంప్లెట్ తప్ప! ఆమెకు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అవసరం అంటారా?– పద్మావతి, బళ్ళారిమీరు మీ అమ్మగారిలో చూస్తున్న లక్షణాలు క్లాసికల్‌గా ‘డెల్యూజనల్ పారా సైటోసిస్‘ లేదా ‘ఎక్బామ్ సిండ్రోమ్‘ అనే మానసిక సమస్య వచ్చిన వారిలో కనబడతాయి. ఇది ఒక అరుదైన మానసిక సమస్య. దీనిని ఎక్కువగా స్త్రీలలో చూస్తాము. మెదడు రసాయనాల్లో వచ్చే మార్పులు ఈ జబ్బు రావడానికి ప్రధాన కారణం. రక్త హీనత, విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలు లాంటివి ఉండే వారిలో కూడా జబ్బు వచ్చే ఆవకాశాలు ఎక్కువ. కొన్ని సార్లు పెద్దవయసులో వచ్చే ‘ఆల్జీమర్స్ డిమెన్షియా‘ ఈ లక్షణంతోనే ప్రారంభం అవ్వొచ్చు. అలాగే అత్యంత అరుదుగా మెదడులో కణుతులు లాంటివి ఉన్నా డెల్యూజన్లో పారా సైటోసిస్ లక్షణాలు కనపడే అవకాశముంది. తమ వంటిమీది లేదా చర్మం కింద పురుగులు పాకుతున్నాయనే సందేహం తప్ప ఇతర లక్షణాలు ఏమి కనపడవు. దురద తట్టుకోలేక కొంతమంది చర్మానికి క్రిమి సంహారక మందులు పూసుకొని ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటారు. యాంటీ సైకోటిక్ మందుల ద్వారా ఈ జబ్బు లక్షణాలని పూర్తిగా తగ్గించవచ్చు. మీరు దగ్గర్లోని మానసిక వైద్యుని వెంటనే కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం మందులు వాడితే త్వరగా ఆమె సమస్య తగ్గుతుంది. ఇది మానసిక జబ్బు లక్షణమే తప్ప శారీరక అనారోగ్యం ఏమాత్రం కాదనేది అందరూ గుర్తించాలి! (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com) (చదవండి: Miss worl 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్)

బుజ్జి చేతులు సాయం చేయాలి..!
పిల్లలూ...చదువుకోవడం అందరూ చేస్తారు. సాయం కొందరే చేస్తారు. సాయం చేసే చేతులకు దేవుని ఆశీస్సులుంటాయి తెలుసా? మరి సాయం ఎలా చేయాలి? సింపుల్. పుస్తకాలు పంచినా... పేద విద్యార్థికి ఫీజ్ పే చేసినా... దుస్తులు కొనిచ్చినా సాయమే. స్నానం అలవాటు చేసుకున్నట్టుగా... సాయం అలవాటు చేసుకోవాలి. ఈ వేసవిలో సాయం మొదలెట్టండి... వచ్చే వేసవి వరకూ కొనసాగించండి. ఇక మీరు గొప్ప సామాజిక సేవకులు అయినట్టే.పిల్లలూ.... మీకు మదర్ థెరిసా తెలుసు కదా. ఆమె ఏమన్నారో తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. అంటే? ‘ఈ ప్రపంచంలోని కష్టాలన్నీ తొలిగిపోవాలి’ అని దేవుణ్ణి ప్రార్థించడం కంటే సాటి మనుషుల ఆ కష్టాలను కొన్నైనా దూరం చేయడానికి మనం సాయం చేయడమే మేలని అర్థం.పేదవాళ్లందరూ మంచి కంఫర్ట్స్‌తో జీవించాలి అని దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడు ఆ కోరికను ఎప్పుడు తీరుస్తాడో ఏమో. కాని ఒక పేదవాడికైనా మనం కొద్దిగా కంఫర్ట్ ఇస్తే మంచిది కదా. అదో సంతృప్తి. ప్రపంచంలో సైంటిస్టులు, లీడర్లు, స్పోర్ట్స్ పర్సన్లు ఉన్నట్టే సేవ చేసేవారు కూడా ఉంటారు. కైలాష్ సత్యార్థి పేరు విన్నారా? ఆయన వీధి బాలల కోసం చాలా పని చేశాడు. వారి బాగు కోసం తన జీవితాన్ని వెచ్చించాడు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. ఆయనే కాదు... బాబా ఆమ్టే, సుందర్‌లాల్ బహుగుణ, మేధా పాట్కర్... ఇలా ఎందరో సామాజిక సేవకులు ఉన్నారు. వారి గురించి మీరు ఈ సెలవుల్లో గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. స్ఫూర్తి ΄÷ందవచ్చు. అయితే సేవ ఎలా చేయాలి? సేవ చేయడం అంటే ఏమిటి?సేవామార్గం అంటే ఏమిటి?మన చుట్టూ ఎంతోమంది అనాథలు, అభాగ్యులు ఉంటారు. తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక ఇబ్బంది పడేవారు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో చేరుతుంటారు. అలాంటి వారికి సేవ చేయడం ఎంతో మేలైన పని. దివ్యాంగులు, అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బడులు ఉంటాయి. అక్కడికి వెళ్లి, వారితో కాసేపు గడపడం, వారి యోగక్షేమాలు కనుక్కోవడం, వారికి చేతనైన సాయం అందించడం చేస్తే మనసుకు తృప్తి దక్కుతుంది. ఇలాంటి పనుల మీద మీరు శ్రద్ధ చూపిస్తే తప్పక మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. మంచి పనులు చేస్తే ఎవరు వద్దంటారు?ఎక్కడికి వెళ్లొచ్చు?అనాథాశ్రమాలు: తల్లిదండ్రులు లేని చిన్నారుల కోసం మండల, జిల్లా కేంద్రాల్లో అనాథాశ్రమాలు ఉంటాయి. అలాంటి చోటికి తీసుకెళ్లమని మీ పేరెంట్స్‌కు చెప్పండి. అక్కడున్న పిల్లలతో మాట్లాడండి. వారితో కాసేపు ఆడితే వాళ్లే మీతో మనసు విప్పి వాళ్ల ఫీలింగ్స్ చెబుతారు. మీరు చేయదగ్గ హెల్ప్ చేయండి. వారిలో బాగా చదువుతున్నవారు, స్పోర్ట్స్‌లో షైన్ అవుతున్నవారెవరో తెలుసుకోండి. బుక్స్, షూస్, స్పోర్ట్స్ కిట్స్... ఫండ్స్ రైజ్ చేసి తెచ్చిస్తానని చెప్పండి. వాళ్లెంత సంతోషపడతారో గమనించండి. అలాంటి పిల్లలను కలిస్తే మీ మనసు ఎప్పుడూ హెల్ప్ చేయడం గురించే ఆలోచిస్తుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్: పిల్లలూ... ఇంట్లో అమ్మమ్మను, నానమ్మను చూసి ఉంటారు కదా. కాని అందరు అమ్మమ్మలకూ అలా ఇల్లు ఉండదు. వాళ్లు ఉండే చోటు ఉంటుంది. అలాంటి చోటుతో మీ అమ్మా నాన్నలతో వెళ్లండి. తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, బామ్మలు, అవ్వలు అక్కడ చాలామంది ఉంటారు. వారికి మీలాంటి చిన్న పిల్లలను చూస్తే చాలా సంతోషం. వారిని తాతా, అమ్మమ్మా అని పలకరించండి. చాలా హ్యాపీ పీలవుతారు. కబుర్లు చెప్పండి. ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇవ్వండి. వారి దగ్గర అవసరమైన మెడిసిన్స్ ఉన్నాయా లేదా అడగండి. ఎవరికైనా అవసరం ఉంటే మీ పేరెంట్స్‌కు చెప్పి వాళ్లకు హెల్ప్ చేయండి. ఎవరికైనా హ్యాండ్ స్టిక్ ప్రెజెంట్ చేయండి. వాళ్లు హ్యాపీ ఫీలయ్యి బ్లెస్ చేస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది.బట్టలు పంచుదామాఈ సమ్మర్ హాలిడేస్‌లో మీ బంధువులను, ఫ్రెండ్స్‌ను అడిగి 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకూ వయసున్న అబ్బాయిల, అమ్మాయిల యూజ్ చేయని బట్టలు ఏమైనా ఉంటే ఇమ్మని అడగండి. చాలామంది దగ్గర ఒకటి రెండుసార్లు వేసుకొని మరి వేయకుండా మానేసిన బట్టలు కప్‌బోర్డుల్లో ఉంటాయి. అలాంటివన్నీ తెప్పించండి. అమ్మకు చెప్తే ఎవరైనా టైలర్ అంకుల్‌కు చెప్పి ఏవైనా బటన్స్, కుట్టు అవసరం అయితే చేయిస్తుంది. నాన్నకు చెప్తే ఐరన్ చేయించే ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు వాటిని చక్కగా పెయిర్స్‌గా సర్దండి. ఆ తర్వాత మీకు దగ్గరగా ఉన్న బస్తీలోని పిల్లలకు పంచండి. వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళతారు.సేవ చేయడం అంటే ఏమిటంటే మనకు ఉన్నది లేని వారితో పంచుకోవడం. మీరు బాగా చదువుతారు కదా. మీ హౌస్‌హెల్ప్ వాళ్ల పిల్లలకు రోజూ సాయంత్రం పూట ట్యూషన్ చెప్పినా సేవే. పలక ఇచ్చినా సేవే. నోట్స్ కొనిచ్చినా సేవే. సేవను అలవాటు చేసుకొని ఈ సమ్మర్‌ను మీనింగ్‌ఫుల్ చేసుకోండి. (చదవండి: ఈ సమ్మర్లో సరదా సరదాగా ఈ పనులు నేర్చుకోండి..! )
ఫొటోలు
అంతర్జాతీయం

మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలో తమ సైనిక సిబ్బందిలో కేవలం 11 మంది చనిపోయారని పాకిస్తాన్ మంగళవారం ప్రకటించింది. వీరిలో స్క్వాడ్రాన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ సైతం ఉన్నట్లు పేర్కొంది. భారత వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడుల్లో సాయుధ బల గాలకు సంబంధించి 78 మంది గాయపడ్డారని పాకిస్తాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మే ఆరో తేదీ అర్ధరాత్రి తర్వాత భారత్ జరిపిన దాడుల్లో 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 121 మంది పౌరులు గాయపడ్డారని తెలిపింది. చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ సైతం ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీళ్లంతా ఏ పరిస్థితుల్లో మరణించారో, మరణానికి కారణాలను పాకిస్తాన్ బయటపెట్టలేదు. ఒక యుద్ధవిమానం పాక్షికంగా ధ్వంసమైందని తెలిపింది.అయితే అది ఏ సంస్థ తయారీ, ఏ రకానికి చెందినది అనే వివరాలనూ పాక్స్తాన్ వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా ‘మర్కా–ఇ–హక్ (ఘన విజయం)’ లక్ష్యంగా ‘ఆపరేషన్ బుని యాన్ అల్ మర్సుస్’ను చేపట్టామని ఆ ప్రకటన తెలిపింది. గాయపడిన సైనికులు, పౌరులను పరామర్శించేందుకు సోమవారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని సందర్శించడం తెల్సిందే. గాయపడిన సైనికాధికారులు, జవాన్లను ఓదార్చేందుకు లాహోర్‌లోని కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రిని పంజాబ్ మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ సందర్శించారు.

బద్దలైన బేస్‌లు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోయాయని స్పష్టమైంది. తాజాగా విడుదలైన శాటిలైట్ ఉపగ్రహాల స్పష్టమైన ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా 11 మిలటరీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వైమానిక స్థావరాల్లోని విమాన రన్వేలు, విమానాలను నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఈ శాటిలైట్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఒక ప్రైవేట్ వాణిజ్య ఉపగ్రహ సంస్థ ఈ హై–రెజల్యూషన్ ఫొటోలను తీసింది. ఏమాత్రం అటూఇటూగా కాకుండా, గురిచూసి సరిగ్గా వాయుసేన స్థావరాల మీదనే బాంబులు పడేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. భారత్‌పై మరింతగా దాడులకు తెగిస్తే ఆకాస్త స్థావరాలనూ పూర్తిగా నేలమట్టం చేస్తారనే భయంతోనే మూడ్రోజులకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచి్చందనే వాదనకు పూర్తి బలం చేకూర్చేలా ఫొటోలు ఉన్నాయి. మాక్సార్ అనే శాటిలైట్ సంస్థ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు జాతీయమీడియాలో మంగళవారం ప్రత్యక్షమయ్యాయి. సింధ్‌లోని సిక్కూర్, రావర్పిండిలోని నూర్ ఖాన్, దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీం యార్ ఖాన్, సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సిం«ద్‌లోని జకోబాబాద్, ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైన తీరు ఫొటోలో వివరంగా తెలుస్తోంది. దాడి తర్వాత కీలక మిలటరీ బేస్‌లలో రన్‌వేలపై భారీ గొయ్యి, కార్యనిర్వాహక భవనాలు, నిల్వ కేంద్రాల పైకప్పులకు పెద్ద రంధ్రాలు పడటం, భవంతుల గోడలు కూలి శిథిలాలు, శకలాలు సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిన వివరాలు ఫొటోల్లో తెలుస్తున్నాయి. పస్రూర్, సియాల్కోట్లోని రాడార్ కేంద్రాలు క్షిపణుల దెబ్బకు పేలిపోయాయి. సుక్కూ ర్ ఎయిర్‌బేస్‌లో రెండు విమాన షెల్టర్లు కూలిపోయాయి. చక్లాలాలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో భారీ సైనిక, సరకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బతిన్నాయి. రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఒక్కటే రన్‌వే ఉంది.దానిపై బాంబులేయడంతో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్‌వే పాక్షికంగా ధ్వంసమైంది. ముషాఫ్ ఎయిర్‌బేస్ రన్‌వేపై రెండు పేద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి 10, మరోటి 15 అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు ఆగిపోయాయి. సమీప రవాణా వాహనాలూ దెబ్బతిన్నా యి. జకోబాబాద్‌లోని షాబాజ్ ఎయిర్‌బేస్‌తోపాటు భోలారీ ఎయిర్‌బేస్‌లో చెరో విమాన హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. హ్యాంగర్‌లో నిలిపిఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

బంగ్లా మాజీ అధ్యక్షుడు హమీద్ పరార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్(Mohammed Abdul Hamid)(81) ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా దేశం విడిచి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్ ఎయిర్వేస్ విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి నుంచి చక్రాల కురీ్చలో వెళ్లే సమయంలో ఆయన ఒంటిపై లుంగీ మాత్రమే ఉండడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను బలవంతంగా అణచివేసిన కేసులో మొహమ్మద్ అబ్దుల్ హమీద్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఆయనపై హత్య కేసు సైతం నమోదైంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంచలనాత్మకంగా మారింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వ్యవహారం పట్ల బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన పారిపోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల మండిపడింది. కొందరు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసింది.మరికొందరికి బదిలీ వేటు వేసింది. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ పరారీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సలహాదారు సి.ఆర్.అబ్రార్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. హమీద్ 2013 నుంచి 2023 మధ్యలో రెండుసార్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2024లో షేక్ హసీనాతోపాటు ఆమె అనుచరులపై నమోదైన హత్య కేసులో ఆయన సహ నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 14న కిశోర్‌గంజ్ సదర్ పోలీసు స్టేషన్లో ఆయనపై హత్య కేసు నమోదైంది. వైద్యం కోసమేనా? కేవలం వైద్యం కోసమే హమీద్ థాయ్‌లాండ్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనతోపాటు సోదరుడు, బావమరిది కూడా వెళ్లినట్లు తెలిపారు. అయితే, దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే దేశం నుంచి హమీద్ పరారైనట్లు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పారీ్టలో హమీద్ చురుగ్గా వ్యవహరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అవామీ లీగ్ విద్యార్థి విభాగమైన ఛాత్రా లీగ్ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఛాత్రా లీగ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటిని ఇస్లామిక్ రాడికల్స్ కూల్చివేశారు.

కాశ్మీర్ అంశంపై మా విధానంలో మార్పు లేదు: విదేశాంగ శాఖ
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. పహల్గాం ఘటన తరువాత సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ అమెరికా నాయకులు మాట్లాడారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'రంధీర్ జైస్వాల్' పేర్కొన్నారు.కాల్పుల విరమణకు కోసం పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంపై రెండు దేశాల DGMOల మధ్య అవగాహనా కుదిరింది. సింధూ నదీ జలాల రద్దు ఒప్పందం కొనసాగుతుంది. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తాం. ఈ అంశంపై మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైన చర్చలు ఉంటాయి. టీఆర్ఎఫ్ లష్కరితోయోబా సంస్థ. దీనిపైన అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య.. అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడం. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిచిపెట్టడం అనేది పరిష్కారం కాని విషయం' అని జైస్వాల్ అన్నారు.
జాతీయం

సోఫియా ఖురేషీ అత్తింటిపై దాడి అంటూ వదంతులు
సాక్షి బెంగళూరు: కల్నల్ సోఫియా ఖురేషీ అత్తవారింటిపై ఆర్ఎస్ఎస్ వర్గాలు దాడి చేశాయని ‘ఎక్స్’లో వదంతులు వ్యాపించాయి. కర్ణాటకలోని బెళగావిలో సోఫియా భర్త ఇంటిపై దాడి జరిగినట్లుగా వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ బీమా శంకర్ స్పష్టంచేశారు. సోఫియా భర్త ఇంటిపై ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు దాడి చేసినట్లుగా ధ్వంసమైన ఒక ఇంటిని ఫోటోను అనీస్ ఉద్దీన్ అనే పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. అది ఫేక్ పోస్టు అని పోలీసులు తేల్చారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

పాక్ సిబ్బందితో భారత్‌కు నౌక
పారాదీప్: సింగపూర్ మీదుగా దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చిన చమురు రవాణా నౌకలో మొత్తం సిబ్బందిలో 21 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు తేలడంతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరస్పర సైనిక చర్యలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ వ్యతిరేక వర్గాలు నౌకాశ్రయానికి చేరుకుని ఆందోళన చేపట్టకుండా ఉండేందుకు పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్ ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇమిగ్రేషన్శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్ పోలీస్‌కు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చేరవేశామని మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్ ఆయిల్ అన్లోడింగ్ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్సింగ్పూర్ ఎస్పీ భవానీశంకర్ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్ సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు.

చైనా పత్రికలపై భారత్
న్యూఢిల్లీ: చైనా పాల్పడుతున్న భారత వ్యతిరేక ప్రచారంపై కేంద్రం కన్నెర్రజేసింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు గ్లోబల్ టైమ్స్, జిన్హువా పత్రికల ఎక్స్ ఖాతాలను నిషేధించింది. అవి రెండూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కరపత్రాల వంటివి. భారత ప్రభుత్వం ధ్రువీకరించని విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న చైనా మీడియాకు మన రాయబార కార్యాలయం గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది. అయినా అదే ధోరణి కొనసాగడంతో తాజా చర్యలు తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మూడు భారత యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇలా పచ్చి అబద్ధాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని, జర్నలిజం విలువలకు విరుద్ధమని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్–పాక్ ఉద్రిక్తతలపై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయడంపై ఆగ్రహించింది. అయితే గ్లోబల్ టైమ్స్పై నిషేధాన్ని బుధవారం అర్ధరాత్రి ఎత్తేసింది.

నోరు పారేసుకున్న మంత్రిపై ఎఫ్ఐఆర్
జబల్పూర్: పాకిస్తాన్ ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’గురించి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, దేశ ప్రజలకు ఎప్పుకప్పుడు సమాచారం అందించిన మహిళా సైనికాధికారి, కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహిళా అధికారిని కించపర్చేలా మాట్లాడిన విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. మంత్రి వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. బుధవారం సాయంత్రం 6 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ విషయం తమకు తెలియజేయాలని పేర్కొంది. తదుపరి విచారణను గురువారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది. అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్ షా మంగళవారం ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు. అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పారీ్టలకు అతీతంగా అందరూ ఖండిస్తున్నారు. మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రివర్గం నుంచి తొలగించాలివిజయ్ షాను తక్షణమే మధ్యప్రదేశ్ మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు. విజయ్ షా వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. ఆయనొక మూర్ఖుడు అని మండిపడ్డారు. బుద్ధిజ్ఞానం లేకుండా మాట్లాడడం కొందరికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయ్ షా అభ్యంతకర వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత మాయావతి సైతం ఖండించారు. మహిళా అధికారి గురించి అలా మాట్లాడడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాజా వివాదంపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కార్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపర్చేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. యూనిఫాంలో విధులు నిర్వర్తించే మహిళా అధికారులను గౌరవించాలని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ అనుచితంగా మాట్లాడడాన్ని సహించబోమని హెచ్చరించారు. పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం: విజయ్ షా తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతుండడంతో విజయ్ షా బుధవారం స్పందించారు. ఎవరైనా బాధపడి ఉంటే ఒకటి కాదు పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషిని తన సోదరి కంటే ఎక్కువగా గౌరవిస్తున్నానని చెప్పారు.
ఎన్ఆర్ఐ

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.

పహల్గామ్ విషాదం, ఎన్ఆర్ఐల శాంతి ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.
క్రైమ్

చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది
తగరపువలస(విశాఖపట్నం): వాష్‌రూమ్‌లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్ ఉద్యోగి జనార్థన్ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం జనార్థన్ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనార్థన్‌కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మహిళ ఆత్మహత్య
నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్(29)కు ఎల్బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెండెం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్ కొన్నాళ్లకే జాస్మిన్ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజశేఖర్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం ఆఫీస్‌కు వెళ్లిన రాజశేఖర్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. దీంతో అతను ఎల్బీనగర్ పోలీసులు, జాస్మిన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆగని ‘రక్తచరిత్ర’.. ఎదురొస్తే ఎవరినీ వదలం
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ దాషీ్టకాలతో నియోజకవర్గంలోని రామగిరి మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తారో, ఏ పరిణామాలు ఎవరి ప్రాణాలు తీస్తాయో.. అని వణికిపోతున్నారు. బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం,అవసరమైతే దాడులు చేయడం రామగిరి మండలంలో టీడీపీ గూండాలకు పరిపాటిగా మారింది. ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో ‘రక్తచరిత్ర’ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చిలో జరగాల్సిన ఎంపీపీ ఉప ఎన్నికను టీడీపీ గూండాల దౌర్జన్యాలతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీటీసీ సభ్యులను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు హతమార్చారు. పరామర్శించడానికి వచి్చన మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్సీపీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఎంపీపీ స్థానానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ వాళ్లు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారోనని వైఎస్సార్సీపీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు. బలవంతంగా టీడీపీలో చేర్చుకుని.. ఈ నెల 19వ తేదీన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా వేసి పా ర్టీలో చేరినట్లు పరిటాల సునీత, శ్రీరామ్ ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వారు దు్రష్పచారం చేశారు. వారి ప్రచారాన్ని భారతి ఖండిస్తూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బుధవారం వీడియో విడుదల చేశారు. ఇంటిపై దాడి... పట్టించుకోని పోలీసులు టీడీపీలో చేరిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని ఎక్కడ దాచారో చెప్పాలంటూ కొత్తపల్లి గ్రామంలో కురుబ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన మాదాపురం శంకర్‌తోపాటు మరికొంతమంది రౌడీలు దాడి చేశారు. ఈ ఘటన గురించి బుధవారం ఉదయం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసులపై నమ్మకం పోయిందని, ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఉంటే టీడీపీ గూండాలు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను హత్య చేసిన తరహాలోనే దారుణానికి ఒడిగడతారని కొత్తపల్లి గ్రామస్తులు భయపడుతున్నారు.ఎంపీపీ ఇస్తామన్నారు ‘టీడీపీ నేతలు నన్ను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారు. పరిటాల సునీత, శ్రీరామ్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. నాకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారు. ఆ తర్వాత మా గ్రామంలో వదిలారు. అక్కడ ఉంటే రక్షణ ఉండదని భావించి బంధువుల ఇంటికి వచ్చాను. నాకు టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరుకాలేను. ఈ నెల 20 తర్వాత గ్రామానికి వస్తాను. – భారతి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు, పేరూరు–2ఎన్నికను బహిష్కరిస్తున్నాం ‘రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తోంది. మార్చి 27న జరగాల్సిన ఎన్నిక టీడీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కురుబ లింగమయ్యను కోల్పోయాం. మరోసారి ఇంకొందరు కార్యకర్తలను కోల్పోలేం. అందుకే ఎన్నికకు దూరంగా ఉంటాం. రామగిరి పోలీసులపై నమ్మకం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తేనే సరైన రక్షణ కల్పించలేకపోయారు.’ – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే