
రికార్డులు పరిశీలిస్తున్న ఆర్ జేడీ సత్యనారాయణ
● ఆర్ జేడీ సత్యనారాయణ
బజార్‌హత్నూర్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆర్‌జేడీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కస్తూర్భా బాలికల ఆశ్రమ పాఠశాల, పిప్రి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసనను మెరుగు పరుచుటకు తరగతి గదుల్లో నిర్వహిస్తున్న ఉన్నతి కార్యక్రమం పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు చదవడం, రాయడంలో ఉపాధ్యాయులు చొరువ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భూమేష్, విద్యాసాగర్, కౌసల్య , రాజేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment