
సామాజిక సేవ అభినందనీయం
ఆదిలాబాద్‌టౌన్: డెంటల్ అసోసియేషన్ సభ్యులు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు సాయిరాం, కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకా రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రా మాల్లో వైద్యసేవలు అందించేలా కృషి చే యాలని సూచించారు. అలాగే అసోసియే షన్ అందిస్తున్న సామాజిక సేవా కార్యక్ర మాలను కొనసాగించాలన్నారు. ఇందులో వైద్యులు కళ్యాణ్‌రెడ్డి, ప్రకాశ్, ప్రమోద్ రెడ్డి, సమీయోద్దిన్, ఐడీఏ కోశాధికారి సంజీవ్‌కుమార్, ఉపాధ్యక్షులు స్వప్నిల్,రత్న,సంయు క్త కార్యదర్శి నిఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment