
● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి విన్నవించి దరఖాస్తులు అందజేశారు. అర్జీలను స్వీకరించిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇందులో ఆర్డీవో వినోద్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆయా సమస్యలపై ఈ వారం మొత్తం 77 అర్జీలు అందాయి. ఇందులో కొందరి నివేదన..
అర్జీలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, పక్కన ఆర్డీవో వినోద్‌కుమార్ తదితరులు
ఉద్యోగ భద్రత కల్పించండి
మేమంతా జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా కార్మికులం. 2012 నుంచి వివిధ కేటగిరీల్లో 75 మందిమి పనిచేస్తున్నాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన మార్పుల కారణంగా కాంట్రాక్టర్ 65 మందినే కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో మిగతా వారికి అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని అర్జీ సమర్పించాం.
బోర్‌వెల్ సౌకర్యం కల్పించాలి
జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన మేము దళితబస్తీ లబ్ధిదారులం. గ్రామంలోని 40 మందికి గత ప్రభుత్వం మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేసింది. అందులో విద్యుత్ సౌకర్యంతో పాటు బోర్‌బావులు తవ్విస్తామని అధికారులు తెలిపారు. సర్వే కూడా చేశారు. ఏడాది గడుస్తున్నా పురోగతి లేదు. మాకు న్యాయం చేయాలని కోరాం.
భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి
మేమంతా గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన విశ్మకర్మసంఘ సభ్యులం. గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మంద్రస్వామి ఆలయానికి ఓ దాత విరాళంగా అందజేసిన స్థలాన్ని ఆలయ వెనుకభాగంలో నివసిస్తున్న ఆనంద్ ఆక్రమించుకున్నాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విన్నవించాం.
ఉద్యోగాలు కల్పించండి
మేము ఉట్నూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెందిన ఆదివాసీలం. ఏడేళ్ల క్రితం స్టాఫ్ నర్సు కోర్సు పూర్తి చేశాం. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పోస్టులకు పలుమార్లు దరఖాస్తు చేసినా మాకెందుకో ఇవ్వడం లేదు. ఏ పీహెచ్‌సీకి పోస్టింగ్ ఇచ్చినా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.
విచారణ జరిపించండి
డీఎస్సీలో స్పెషల్ ఎస్జీటీగా ఎంపికై న సౌజన్య ఒకే విద్యాసంవత్సరంలో రెండు రెగ్యులర్‌కోర్సులు కలిగి ఉన్నారు. 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యాసంస్థల్లో రెండు రెగ్యులర్ కోర్సుల తరగతులకు హాజరవ్వడం ఎలా సాధ్యపడింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – కె.నవీన్‌కుమార్, తాంసి

● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్

● ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment