ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధి లో మంగళవారం డయల్ యువర్ డీఎం కా ర్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ కల్పన ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, సలహాలు, సూచనలు చేయవచ్చని పే ర్కొన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే కార్యక్రమానికి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇచ్చేవారు 9959226002 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పత్తి కొనుగోళ్ల నిలిపివేత
కైలాస్‌నగర్: ఆధార్ సర్వర్‌డౌన్ కారణంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో సీసీఐ ద్వారా చేపడుతున్న పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి మధుకర్ ప్రకటనలో తెలి పారు. రైతులు విషయాన్ని గమనించి యా ర్డుకు పత్తిని తీసుకురావద్దని సూచించారు. సర్వర్ పునరుద్ధరణ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించే సమాచారం తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్ కమిటీకి సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment