● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల డేటా ఎంట్రీ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కొన్నిచోట్ల ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని, నిర్లక్ష్యం వహించే తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించా రు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలతో పాటు పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణపై సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంక్షే మ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డుసభల్లో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ గడువులోపు పూర్తి చేయాలన్నారు. పైలట్ ప్రజావాణిలో భా గంగా గాదిగూడ, నార్నూర్, తాంసి, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్‌లో మంగళవారం బహిరంగ విచారణ ఉంటుందన్నారు. జిల్లాలో మండల స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు తక్షణ పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment