భైంసారూరల్: చేపలవేటకు వెళ్లి చెక్‌డ్యాంలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మాలిక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య (45) సోమవారం చేపలు పట్టేందుకు మాటేగాం స మీపంలోని చెక్‌డ్యాంకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి తిరిగిరాకపోవంతో మంగళవారం కు టుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా గజ ఈతగాళ్లలో గాలించి మృతదేహా న్ని బయటకు తీయించారు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ పర్యటన
లక్ష్మణచాంద: టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించారు. లక్ష్మ ణచాంద మండలంలోని తిర్పెల్లి రైస్‌మిల్లులో సోమవారం సివిల్ సప్లయ్ అధికారులు, పోలీ సులు సంయుక్తగా దాడులు నిర్వహించగా 3,011 మెట్రిక్ టన్నుల వరిధాన్యం గోల్‌మాల్ అయినట్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. తిర్పెల్లి, లక్ష్మణచాంద, పొట్టపెల్లి, రాచాపూర్, వడ్యాల్, కనకాపూర్ గ్రామాల్లోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. అనంతరం సోన్ మండలంలోని కూచన్‌పెల్లిలో రేషన్‌షాపును తనిఖీ చేశారు. నిర్మల్ మండలంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌రావు, ఎన్‌ఫోర్స్‌మె ట్‌డీటీ కార్తీక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment