
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ● రూ.7.48 లక్షల విలువైన 208
అక్రమార్కులపై కఠిన చర్యలు●
ఆసిఫాబాద్: అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని కుమురంభీం జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు. మంగళవారం సిర్పూర్(టి)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అందిన పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి హుడ్కిలి చెక్‌పోస్ట్ ప్రాంతంలో ఐచర్ వ్యాన్‌ను తనిఖీ చేయగా 108 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు తెలిపారు. డ్రైవర్ ఇషాక్ అహ్మద్‌ను విచారించగా తన యజమాని మహ్మద్ రజాక్ రహెమాన్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని వీరూర్ గ్రామానికి చెందిన ఉప్పరె సంతోష్ వద్దకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. సంఘటన స్థలానికి కిలోమీటర్ దూరంలో ఒక రెడ్ కలర్ మినీ మహింద్రా వాహనాన్ని తనిఖీ చేయగా 42 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు తెలిపారు. డ్రైవర్ మహ్మద్ కలీంను విచారించగా మహారాష్ట్రలోని వీరూర్ గ్రామానికి చెందిన ఉప్పరె సంతోష్ వద్దకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. ఈ రెండు వాహనాలకు ఒకరే యజమాని అని గుర్తించామన్నారు. మధ్యాహ్నం సమయంలో వచ్చిన సమాచారం మేరకు ఇటికల పహడ్ గ్రామానికి వెళ్తున్న దారిలో గ్రౌండ్ వద్ద చెట్ల పొదల్లో ఒక మినీ మహీంద్రా వ్యాన్ గుర్తించామన్నారు. అక్కడికి వెళ్లి చూడగా మరో వాహనం కనిపించిందన్నారు. అందులోనూ 58 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించామన్నారు. కాగజ్‌నగర్‌లోని తైబానగర్‌కు చెందిన సయ్యద్ ఆరిఫ్ ఆ వాహనం తనదేనని, తానే డ్రైవర్, యజమాని అని ఒప్పుకున్నాడు. ఈబియ్యం మహారాష్ట్రలోని వీరూర్ గ్రామానికి చెందిన ఉప్పరె సంతోష్‌కు అప్పగించేందుకు వెళ్తున్నట్లు తెలిపాడు. వాహనాల యజమాని మహమ్మద్ రజిక్ రెహమాన్‌తో పాటు సయ్యద్ ఆరిఫ్‌లను విచారించగా అతను కూడా భీమిని మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన రాకేష్, అశోక్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. పంచనామా నిర్వహిస్తున్న క్రమంలో ఇందులోని కొన్ని బియ్యం బస్తాలు డైరెక్ట్‌గా తెలంగాణ ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న రేషన్ డీలర్ షాపులో నుంచి వచ్చినట్లుగా గుర్తించామన్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. మూడు వాహనాల్లో కలిపి 208 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. వాటి విలువ రూ.7,48,800 ఉంటుందన్నారు. మొదటి వాహన డ్రైవర్ ఇషాక్ అహెమద్, రెండో వాహన డ్రైవర్ మహమ్మద్ కలీం, మూడో వాహన డ్రైవర్, యజమాని సయ్యద్ ఆరిఫ్‌లపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై, కానిస్టేబుళ్లను ఎస్పీ
అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment