
వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం
● ‘రేషన్’ డేటా ఎంట్రీ 70 శాతం పూర్తి
కై లాస్‌నగర్: జిల్లాలో రేషన్‌కార్డు దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈనెల 12 వరకు వందశాతం పూర్తి చేయాలనే కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు ప్రక్రియ కొనసాగేలా విధులు కేటాయించారు. దీంతో నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది.
40,650 దరఖాస్తుల వివరాలు నమోదు..
కొత్త రేషన్‌కార్డులు, మార్పులు, చేర్పుల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన, వార్డు, గ్రామసభల్లో 57,800 దరఖాస్తులు అందాయి. అందులో ఇప్పటి వరకు 40,650 దరఖాస్తుల వివరాల నమోదు పూర్తయినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వాజీద్ అలీ తెలిపారు. ఇంకా 17,150 దరఖాస్తుల వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గురువారం సాయంత్రంలోగా వంద శాతం పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. ఆయా మండలాల నుంచి కార్యాలయానికి అందిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదం కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తామని ఆయన వెల్లడించారు. గడిచిన పదేళ్లలో ఇప్పటి వరకు కొత్త రేషన్‌కార్డుల కోసం కానీ, మార్పులు, చేర్పుల కోసం కానీ దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment