ప్రత్యేక తరగతులను పర్యవేక్షించాలి
కై లాస్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పదో తరగతి విద్యార్థుల కు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను నిత్యం పర్యవేక్షించాలని మండల ప్రత్యేకాధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ స మావేశ మందిరంలో సోమవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, స్నాక్స్ అందేలా దృషి సారించాలన్నారు. అలాగే వారు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులకు హాజరై విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేయాలన్నారు. అనంతరం జన్‌మన్ యోజన కింద చేపడుతున్న అంగన్‌వాడీ భవనాలకు మంజూరైన వాటి నివేదికలు త్వరగా పంపాలని డీడబ్ల్యూవోను ఆదేశించా రు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, డీఈవో ప్రణీత, డీడబ్ల్యూవో సబిత, డీఆర్డీవో రవీందర్ రాథోడ్ పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 24న నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment