● ఎస్‌హెచ్‌జీలకు విరివిగా సీ్త్రనిధి రుణాలు ● ‘బ్యాంకు
స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశం (ఫైల్)
పట్టణంలోని సంఘాలు,
రుణాల ప్రగతి వివరాలు
మొత్తం వార్డులు: 49
జనాభా : 155747
స్వయం సహాయక సంఘాలు: 2,536
అందులోని సభ్యులు: 25,722
మొత్తం రుణలక్ష్యం : రూ.26.36 కోట్లు
ఇప్పటి వరకు అందించిన రుణాలు 26.37కోట్లు
పకడ్బందీ ప్రణాళికతోనే లక్ష్యసాధన
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే రుణ లక్ష్యాలను సాధించే దిశగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. పట్టణంలోని ప్రతీ వార్డులో ఎస్‌ఎల్‌ఎఫ్‌లతో సమావేశాలు నిర్వహించి బ్యాంకు లింకేజీకి అర్హులైన ఎస్‌హెచ్‌జీల సమాచారం సేకరించాం. ఏదైనా యూనిట్ ఏర్పాటు చేయాలనుకునే వారికి అత్యవసరమైన రుణాలను సీసీఎల్ కింద అందజేశాం. టీజీబీ, యూబీఐ బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రతి నెలలో లాగిన్ డే నిర్వహించి బ్యాంకులిచ్చిన సమాచారం ప్రకారం ఎన్ని ఎస్‌హెచ్‌జీలు రికవరీకి ఉన్నాయి.. రుణాల చెల్లింపు ఎంత పూర్తయిందనే వివరాలు తెలుసుకుని లింకేజీ రుణాలు ఇప్పించాం. వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టాం. ఫలింగానే వందశాతం రుణా లక్ష్యాలను సాధించాం.
– శ్రీనివాస్, డీఎంసీ, మెప్మా
కై లాస్‌నగర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రధానంగా బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు సీ్త్ర నిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన రుణ లక్ష్యాలను వందశాతం సాధించే దిశగా మెప్మా ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను చైతన్యపరుస్తూ ఇప్పటికే సీ్త్ర నిధి రుణాలను లక్ష్యానికి మించి అందజేశారు. అలాగే బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని 98శాతం సాధించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 40 రోజుల గడువు ఉండటంతో దానిని కూడా త్వరలోనే అధిగమించేలా కృషి చేస్తున్నారు.
బ్యాంకు లింకేజీ రుణాలిలా..
బ్యాంకు లింకేజీ ద్వారా పట్టణంలోని 330 సంఘాలకు రూ.19కోట్ల 91లక్షల 15వేల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 177 సంఘాలకు గాను రూ.19కోట్ల 67లక్షల 14వేల రుణాలు అందజేశారు.98.79శాతం లక్ష్యాన్ని సాధించగా ఇంకా సమయం ఉన్నందున వీటి ప్రగతి కూడా వందశాతానికి మించి నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్వయం ఉపాధి కార్యక్రమం (సెప్–1) కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు సభ్యులకు ఆర్థిక చేయూతనందించాలని నిర్ణయించారు. దీని కింద 24 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 25 యూనిట్లకు రుణాలు అందజేసి అందులోని వందశాతం మించి ప్రగతిని సాధించారు.
మహిళాశక్తిలో తడబాటు...
బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధికి సంబంధించి వందశా తం రుణాలు అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన మెప్మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మాత్రం తడబాటుకు గురవుతోంది. ఈ పథకం కింద వ్యక్తిగత రుణాలు 144మందికి అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 96 మందికి మాత్రమే అందజేశారు. మరో 48 యూనిట్లను సాధించాల్సి ఉంది. అలాగే గ్రూపులకు 25 యూనిట్లకు రుణాలు అందించాల్సి ఉండగా 18 యూనిట్లకు అందజేసి వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. మరో ఏడు యూనిట్లను సాధించాల్సి ఉంది. అయితే ఇంకా సమయం ఉన్నందున వీటిని కూడా వందశాతం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆసక్తిగల మహిళలను ఎంపిక చేసి వారికి రుణాలందించేలా శ్రద్ధ వహిస్తున్నారు. తద్వారా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ తో పాటు టైలరింగ్, సెంట్రింగ్ వంటి తదితర వ్యా పారాలు ప్రారంభించేలా చొరవ చూపుతున్నారు.
సీ్త్రనిధి రుణాలు.. 103 శాతం
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అండగా నిలుస్తోంది. బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేస్తూ వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను సీ్త్ర నిధి రుణ లక్ష్యం రూ.6 కోట్ల 28 లక్షల 64వేలు ఉండగా ఇప్పటి వరకు రూ. 6 కోట్ల 52లక్షల 23వేలను అందించారు. లక్ష్యానికి మించి 103 శాతం రుణాలు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 150 శాతం వరకు చేరుకుంటామని మెప్మా అధికారులు చెబుతున్నారు.
● ఎస్‌హెచ్‌జీలకు విరివిగా సీ్త్రనిధి రుణాలు ● ‘బ్యాంకు
● ఎస్‌హెచ్‌జీలకు విరివిగా సీ్త్రనిధి రుణాలు ● ‘బ్యాంకు
Comments
Please login to add a commentAdd a comment