
పేదరికాన్ని జయించిన నగేశ్
తాంసి మండల కేంద్రానికి చెందిన బెల్లపు దేవి దాస్–లక్ష్మి దంపతుల కుమారుడు నగేష్ పేదరికాన్ని ఎదిరించి ప్రభుత్వ కొలువులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఓయూలో ఎమ్మెస్సీ (జువాలజీ), బీఎడ్ పూర్తి చేశాడు. 2017 నుంచి తన ప్రిపరేషన్ షురూ చేశాడు. ఈ క్రమంలో 2021లో మధ్యప్రదేశ్‌లోని సైనిక్ స్కూల్లో పీజీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తూనే ఆది లాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అధికారుల ప్రోత్సాహంతో ప్రిపరేషన్ సాగించాడు. ఫలితంగా గురుకుల పీజీటీ (బయో)లో రాష్ట్రస్థాయిలో 37వ ర్యాంకు సాధించాడు.
అలాగే జూనియర్ లెక్చరర్ (జువాలజీ)లో 3వ ర్యాంకు, డిగ్రీ లెక్చరర్‌గా 5వ ర్యాంకు సాధించాడు. 2024 జూలైలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరాడు. ఇటీవల విడుదలైన జెఎల్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంకు వచ్చింది. జిల్లాలోనే పోస్టింగ్ దక్కింది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వహిస్తున్నాడు.
సంకల్ప బలమే ఆయుధం
నేను మధ్యప్రదేశ్ సైనిక్ స్కూల్‌లో పీజీటీగా విధులు నిర్వర్తిస్తూనే ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అధికారుల ప్రోత్సాహంతో ప్ర త్యేకంగా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసు కున్నా. ఆన్‌లైన్ క్లాసులు విని సన్నద్ధత కొనసాగించా. శ్రమను నమ్ముకుంటే విజయం వరిస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. డిగ్రీలో ఉండగా కూలీ పనులకు కూడా వెళ్లాను. నిరంతర ప్రిపరేషన్‌తో సర్కారు కొలువు పెద్ద కష్టమేమికాదు. కావాల్సిందల్లా సంకల్ప బలమే. ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జువాలజీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నా. స్టడీ సర్కిల్ అధికారులు, సిబ్బంది ప్రోత్సాహం మరవలేనిది.
– నగేశ్, తాంసి
Comments
Please login to add a commentAdd a comment