
డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి
బోథ్: నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళా శాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. సోమవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో మాట్లాడారు. జనరల్ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు 70 కి.మీ దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో రూ. 10.50 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణ పనులు చేపట్టగా ప్రస్తుతం కొనసాగుతుందన్నారు. దీంతో రూ.18 కోట్లతో వంద పడకల ఆసుపత్రిగా మారుస్తూ జీవో ఇచ్చామన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు జీవోను అమలు చేయడం లేదన్నారు. వెంటనేటెండర్ల ప్రక్రియ చేపట్టాలని డిమా ండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన సొనాల, సిరికొండ, భీంపూర్ మండలాల్లో నూతన భవనాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు.
లింగన్న కుటుంబాన్ని ఆదుకోవాలి
పంట ఎండిపోయిన బాధతో ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్న తలమడుగు మండలం సుంకిడికి చెందిన రైతు కుమ్మరి లింగన్న కుటుంబాన్ని ఆదుకోవాలని అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. నీరు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో బోథ్‌ను కరువు నియోజకవర్గంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తలమడుగు మండలం టోకిగూడను పంచాయతీగా చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment