
ప్రజావాణిలో సమస్యల ని‘వేదన’
ఇళ్లమధ్యలో, కిడ్స్ బడిని ఆనుకుని మా కాలనీలో సెల్‌టవర్ నిర్మిస్తున్నారు. దీన్ని నిలిపివేసేలా చూడాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదు. కంపెనీ ప్రతినిధులు పనులు చేపడుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో తాము కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చినా పనులు ఆగడం లేదు. నిరసన తెలిపితే పోలీసులు బెదిరిస్తున్నారు. కోర్టు ఆదేశాలకనుగుణంగా పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
– జుబ్లీహిల్స్ కాలనీవాసులు, ఆదిలాబాద్
కై లాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్‌లతో కలిసి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కాగా ఈ వారం మొత్తం 99 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే..
● అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కోర్టు తీర్పుఇచ్చినా పనులు ఆపడం లేదు

ప్రజావాణిలో సమస్యల ని‘వేదన’
Comments
Please login to add a commentAdd a comment