
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్సై, సీఐ, డీఎస్పీలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌హెచ్‌ఓలు, పోలీసులు ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపర్చుకోవాలన్నారు. క్రమశిక్షణతో మెలగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. కోర్టు మానిటరింగ్ పద్ధతులను సమీక్షించి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. సిబ్బందికి వీక్లీ ఆఫ్ వచ్చేవిధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని తెలిపారు. అధికారులు సిబ్బందికి ఏవైన సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ఎస్సైలు, సీఐలు తమ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, సైబర్‌క్రైమ్, మూఢనమ్మకాలు, డయల్ 100 గురించి అవగాహన కల్పించాలన్నారు. షీటీమ్ బృందం ప్రతీ గ్రామాన్ని సందర్శించారు. అంతకుముందు సీసీ టీవీలకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. వ్యభిచారం, గంజాయి, మట్కా, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీలు శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి, సిహెచ్ నాగేందర్, సీఐలు, ఎస్సైలు, ఎస్‌హెచ్‌ఓలు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment