
ఉద్యోగాల.. ఉదయ్
బజార్‌హత్నూర్ మండలకేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్– సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్ పోటీ పరీక్షలేవైనా తన సత్తా చాటుతున్నాడు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమే గగనమైన ప్రస్తుత తరుణంలో ఏకంగా ఎనిమిది కొలువులకు ఎంపికయ్యాడు. 2019లో వీఆర్వో ఫలితాల్లో జిల్లాలో మూడో ర్యాంకు సాధించాడు. జూనియర్ పంచా యతీ కార్యదర్శి ఫలితాల్లో ఏకంగా మొదటి ర్యాంకు సాధించాడు. ఫారెస్ట్ బీట్‌ఆఫీసర్ ఫలితాల్లో ఐదోర్యాంకుతో సత్తాచాటాడు. ఎస్‌ఎస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌లో పోస్టల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. 2023లో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా సెలక్ట్ అయ్యాడు. 2024లో గ్రూప్–4 ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించి ఆదిలాబాద్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ప్రస్తుతం జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 360 మార్కులు సాధించగా, గ్రూప్–2లో రాష్ట్రస్థాయి 51వ ర్యాంకు, గ్రూప్–3లో 74వ ర్యాంకుతో సత్తా చాటాడు.
ఐఏఎస్ నా లక్ష్యం..
2015లో బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశా. 2017 నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. అదే సంవత్సరం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అప్పటి ఐఏఎస్ అధికారులు బి. గోపి, వల్లూరి క్రాంతిల చొరవతో కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి పది మందిని హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు. అందులో నేను కూడా ఉన్నాను. అక్కడ ఏడాది పాటు శిక్షణ తీసుకున్నా. అనంత రం ఇక్కడికి వచ్చా. అప్పటి నుంచి స్టడీ సర్కిల్‌లో రెగ్యులర్‌గా ప్రిపేరవుతున్నా. అధ్యాపకుల గైడెన్స్ ఉపకరించింది. గ్రూప్–1లో మెరిట్ ఉన్నా గ్రూప్ 2, గ్రూప్–3లలో తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా తదుపరి లక్ష్యం సివిల్స్. ఆ దిశగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా. – ఉదయ్
Comments
Please login to add a commentAdd a comment