
సాఫ్ట్‌వేర్ టు సర్వీసెస్.. నందిని
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుదగణ గోపాల్‌గౌడ్–అనిత దంపతుల కుమార్తె నందిని ఇటీవల విడుదలైన గ్రూప్–1, 2, 3 ఫలితాల్లో మంచి మార్కులతో సత్తా చాటారు. గ్రూప్–1లో 412 మార్కులు సాధించగా, గ్రూప్–2లో 1083 ర్యాంకు, గ్రూప్–3లో 841 ర్యాంకు సాధించారు. 2021లో బీటెక్ పూర్తి చేసిన ఈమె సుమారు రెండేళ్ల పాటు టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సాహంతో సర్వీసెస్ వైపు అడుగుపెట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2023 నుంచి ప్రిపరేషన్ ప్రారంభించారు. తాజాగా గ్రూప్స్‌లో సత్తా చాటి కొలువు ఖాయం చేసుకున్నారు.
సివిల్స్ లక్ష్యంగా ప్రిపరేషన్
బీసీ స్టడీ సర్కిల్‌లోని స్టడీహాల్‌కు నిత్యం వెళ్తూ అక్కడ నిర్వహించే మోడల్ టెస్టులు రాశాను. దీంతో పోటీ పరీక్షల సన్నద్ధతపై స్పష్టత వచ్చింది. ఇది పరీక్ష రాసే సమయంలో ఎంతో దోహద పడింది. అక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. నా ప్రిపరేషన్‌లో భాగంగా గ్రూప్–4 ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం మావల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. సివిల్ సర్వీస్ ఆఫీసర్ కావడమే నా లక్ష్యం. ఆ దిశగా సన్నద్ధమవుతున్నా.
– ఎస్.నందిని,
రవీంద్రనగర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment