
మెరుస్తున్న.. చంద్రశేఖర్
ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో తన ప్రతిభతో మెరుస్తున్నాడు జిల్లాలోని నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)కు చెందిన చాలూర్కర్ చంద్రశేఖర్. ఇప్పటికే మూడు కొలువులు సాధించాడు. ఓయూలో ఎంఏ (హిందీ) పూర్తి చేసిన ఈయన 2014లో వీఆర్వోగా ఎంపికయ్యాడు. అలాగే అదే ఏడాది పంచాయతీ కార్యదర్శిగా కూడా సెలక్ట్ అయ్యాడు. అయితే రెవెన్యూ శాఖను ఎంపిక చేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్‌ఐగా ఈ ఏడాది మార్చి 12 వరకు విధులు నిర్వహించాడు. తాజాగా జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో జెఎల్‌గా ఎంపిక అయ్యాడు. ప్రస్తుతం కుమురం భీం జిల్లా దహేగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు.
గ్రూప్–1 లక్ష్యం..
వీఆర్వో, పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై న తర్వాత కూడా నా ప్రిపరేషన్‌ను కొనసాగించా. 2016లో గ్రూప్–2 ఇంటర్వ్యూ వరకు వెళ్లా. వీలు చిక్కినప్పుడల్లా జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌కు వచ్చి ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకున్నా. ఇటీవల విడుదలైన జేఎల్ ఫలితాల్లో జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యా. నా తదుపరి లక్ష్యం గ్రూప్–1. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం మరువలేనిది. అలాగే బీసీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ అభ్యర్థుల పాలిట ఒక వరం.
– చాలూర్కర్ చంద్రశేఖర్,
కొత్తపల్లి (హెచ్), నార్నూర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment