కొనసాగుతున్న ‘పది’ పరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్‌రూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం ద్వితీయ భాష పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 52 కేంద్రాల్లో 10,039 మంది విద్యార్థులకు గాను 23 మంది గైర్హాజరయ్యారు. 99.77 హాజరు శాతం నమోదైన ట్లు అధికారులు వెల్లడించారు. ఆదిలా బాద్‌రూరల్ మండలం యాపల్‌గూడ గల జెడ్పీఎస్‌ఎస్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. అధికారులను అడిగి హాజ రుశాతం వివరాలు తెలుసుకున్నారు. ఆయ న వెంట డీఈవో ప్రణీత, తహసీల్దార్ గో వింద్, తదితరులున్నారు.
ట్రెయినీ కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు
కై లాస్‌నగర్: జిల్లాలో ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయాకు జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు ఆయన ను శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఇందులో డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీ రావు పాటిల్, సబ్ కలెక్టర్ యువరాజ్, ఆర్డీవో వినోద్‌కుమార్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment