నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడంతో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అనే కంగారు నాలో మొదలైంది. రోజులు గడుస్తున్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చిట్టిచేతులతో ఆడుకోవడం చూసి ముచ్చటపడేదాన్ని. అయితే నెలల వయసొచ్చినా తోటి వారితో పోల్చితే కదలడం, గొంతు నుంచి శబ్ధాలు రావడంలో తేడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను.
నేను భయపడినట్టే జరిగింది. అరుదగా వచ్చే జన్యు సంబంధమైన వ్యాధి కారణంగా నా బిడ్డ షాహిద్‌కి బ్రెయిన్, కండాలల్లో సమస్యలు తలెత్తుతున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని, అందిన కాడికి అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగాము. బ్రెయిన్‌కి అనేక ఆపరేషన్లు జరిగాయి. చివరకు షాహిద్ మాట్లాడుతుండటంతో మా కష్టాలు తొలగినట్టే భావించాం. కానీ ఇక్కడే మరో సమస్య ఎదురైంది.
మాటలయితే వచ్చాయి కానీ కాళ్లు కదపలేని స్థితిలోనే ఉండిపోయాడు షాహిద్. ఇప్పుడు వాడికి పదమూడేళ్లు. ఇన్నేళ్లుగా లేచి నడవడటానికి అందరిలా ఉండటానికి వాడు చేయని ప్రయత్నం లేదు. బాధపడని క్షణం లేదు. అలా చేసే ప్రయత్నంలో దెబ్బలు తగలడం నొప్పితో విలవిలాడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. బిడ్డ కష్టాలు చూడలేక మళ్లీ ఆస్పత్రుల బాట పట్టాం.
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
రకరకాల పరీక్షలు చేశారు డాక్టర్లు. వరుసగా కొన్ని సర్జరీలు చేయడం ద్వారా షాహిద్‌ను నడిపించే వీలుందని చెప్పారు. అయితే ఈ ఆపరేషన్లకు రూ.3.20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. పదమూడేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఉన్నాం. నా భర్త గఫూర్ రోజువారి పనులకు వెళ్లి తెస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగించేది. నా కొడుక్కి వాడి కాళ్ల మీద వాడు నిలబడి, అందరిలా బతికేందుకు మీ సహకారం కావాలి. షాహిద్ సర్జరీకి అవసరమైన సొమ్ము సమకూర్చేందుకు మీ వంతు సాయం చేయండి.
Comments
Please login to add a commentAdd a comment