ఆరిలోవ(విశాఖ): మహా శివరాత్రి పుణ్యస్నానాల కోసం గురువారం జోడుగుళ్లపాలెం బీచ్‌కు వచ్చిన ఓ బాలిక కెరటాల్లో చిక్కుకుంది. జీవీఎంసీ లైఫ్‌గార్డులు వెంటనే స్పందించి ఆమెను ప్రాణాలతో రక్షించారు. వివరాలివీ.. ద్వారకానగర్ ప్రాంతం నుంచి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు జోడుగుళ్లపాలెం బీచ్‌కు గురువారం మధ్యాహ్న సమయంలో సముద్ర స్నానాలకు వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తుండగా.. అతని కుమార్తె కెరటాలలో చిక్కుకుని లోపలకు వెళ్లిపోయింది. ఇది గమనించిన సుబ్రహ్మణ్యం, అతని కుటుంబ సభ్యులు బాలికను రక్షించడానికి లోపలకు వెళ్లగా.. వారు కూడా కెరటాల మధ్యలో చిక్కుకున్నారు. దీంతో వారంతా పెద్ద కేకలు పెట్టడంతో అక్కడే ఉన్న జీవీఎంసీ లైఫ్‌గార్డులు రమేష్, రాజు, లక్ష్మణ్, సాయి వెంటనే స్పందించి ఆ బాలికతో పాటు కుటుంబ సభ్యులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. విషయం తెలుసుకున్న ఆరిలోవ ఎస్‌ఐ కృష్ణ, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని వారికి వైద్య పరీక్షలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment