దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ
చింతూరు: బ్రేకులు ఫెయిల్ కావడంతో రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి లారీ దూసుకెళ్లిన సంఘటన మండలంలోని పోతనపల్లిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తెలంగాణలోని కోదాడ నుంచి సిమెంటు లోడుతో సీలేరు వెళ్లిన లారీ తిరుగు ప్రయాణంలో పోతనపల్లి వద్దకు రాగానే బ్రేకుల ఫెయిలయ్యాయి. దీంతో రహదారి పక్కనేవున్న చిన్నపాటి కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడేనికి చెందిన డ్రైవర్ నారుమల్లి రాఘవకు తీవ్రగాయాలై క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతనిని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చింతూరు ఎస్‌ఐ రమేష్ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment