మారేడుమిల్లి : జీఎం వలస గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.కృష్ణప్రసాద్‌పై వచ్చిన ఆరోపణలపై గురువారం విచారణ నిర్వహించినట్లు ఎంపీడీవో శ్రీనివాసు విశ్వనాథ్ తెలిపారు. కృష్ణప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉండరని, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని, పీసా గ్రామసభలు సక్రమంగా నిర్వహించడం లేదని, గ్రామ సచివాలయానికి వస్తున్న గిరిజనులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని వచ్చిన పలు ఆరోపణలపై గ్రామ సర్పంచ్ కారం లక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యదర్శి కృష్ణప్రసాద్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరపమని డీపీవో డివిజినల్ అధికారి నరసింహరావును విచారణ అధికారిగా నియమించారు. గతంలో కృష్ణప్రసాద్ వై.రామవరం మండలం బొడ్డగంటి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం, సత్ప్రవర్తన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారని, జీఎంవలస కార్యదర్శిగా బదిలీ చేసినా ఆయన తీరు మారలేదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment