భవిత పాఠశాలల అభివృద్ధి కృషి
రంపచోడవరం: భవిత పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఒక్కో భవిత పాఠశాలలో ఉన్న పరికరాలు, మౌలిక సదుపాయాలు, పిల్లల సంఖ్య తదితర వివరాలను తెలుసుకున్నారు. మానసిక దివ్యాంగ పిల్లలతో పాటు ఇతర దివ్యాంగులను గుర్తించేందుకు ప్రతి గ్రామంలో సర్వే చేసి, నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వేలో అంగన్‌వాడీ కార్యకర్తలు భాగస్వామ్యులు కావాలన్నారు. సర్వేను ఏజెన్సీ డీఈవో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మానసిక దివ్యాంగ చిన్నారికి ఐడీ క్రియేట్ చేయాలని తెలిపారు. భవిత పాఠశాలల నిర్వహణపై ఆరా తీశారు. ప్రతి గ్రామంలో పోలియోపై అవగహన కల్పించాలని ఆదేశించారు. ఆసక్తి ఉన్న దివ్యాంగులకు పెయింటింగ్, మోకానిజంలో శిక్షణ అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, సీడీపీవో సంధ్యారాణి, ఎస్‌ఏ అర్చన రమణి, భవిత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం
Comments
Please login to add a commentAdd a comment