అటవీశాఖాధికారుల తీరుపై ధ్వజం
కొయ్యూరు: గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అటవీశాఖ మోకాలడ్డుతుందని, ఇది తగదని ఎంపీపీ బడుగు రమేష్ చెప్పారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రమేష్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. సమావేశంలో ముందుగా ఇటీవల మృతి చెందిన శరభన్నపాలెం ఎంపీటీసీ సోమాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ రమేష్ మాట్లాడుతూ గత కలెక్టర్ సుమిత్ కుమార్ అటవీశాఖకు సంబంధించిన రహదారులకు క్లియరెన్స్ ఇచ్చినా అవి చెల్లవని పెదవలస రేంజర్ చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో కలెక్టర్ కంటే పెద్ద అధికారి ఎవరున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గతంలో రోడ్లు వేసి వాటి మధ్య కల్వర్టుల నిర్మాణాలు చేస్తుంటే వాటికి అనుమతులు లేవని రేంజర్ బూదరాళ్ల పంచాయతీలో పనులు అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిపై తీర్మాణం చేస్తున్నామన్నారు. అధికారుల తీరు మారకుంటే వారిపై చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. ఉపాధి హామీ ఏపీవో అప్పలరాజు, కంప్యూటర్ ఆపరేటర్ నానిలు కలిసి తమకు నచ్చని మేట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే వారిపై విచారణ చేయాలని లేనిపక్షంలో కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వివిధ శాఖల అధికారులు చేపట్టిన పనులను. వివరించారు. ఎంపీడీవో ప్రసాద్, ఏవో బాలమురళీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment