వైభవంగా గంగమ్మతల్లి ఉత్సవాలు
ముంచంగిపుట్టు: మండలంలోని కిలగాడ,పెదగూడ పంచాయతీ కేంద్రాల్లో గంగమ్మతల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అఽధిక సంఖ్యలో భక్తులు కిలగాడలో శతకం పట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు ఘటాలను మోసుకొని వెళ్లి సమర్పించారు.రాత్రి గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం బుడియాలు సందడి చేశారు.సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తి , మొక్కులను తీర్చుకున్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెదగూడలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నర్సింగ్‌రావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.పెదగూడ ఉత్సవ కమిటీ సభ్యులు,గ్రామస్తులు ఎమ్మెల్యే మత్స్యలింగంకు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ జగబంధు,వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, సర్పంచులు, ఎంపీటీసీలు,నేతలు పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
ప్రత్యేక పూజలు చేసిన అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం
Comments
Please login to add a commentAdd a comment