పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
వి.ఆర్.పురం: పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షం సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమనికి మండలంలోని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఆదివాసీ సంఘాలు, వివిధ నిర్వాసిత గ్రామల ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న గ్రామాలో నిర్వాసితుల ప్యాకేజీపై పోరాడుతామన్నారు. నిర్వాసితులెవ్వరికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రాలేదన్నారు. నిర్వాసితుల జాబితా సక్రమంగా లేదని, 2022 వరదలను ప్రామాణికంగా తీసుకొని రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. రేఖపల్లి ఎస్సీకాలనీ, వీఆర్ పురం బిసీ కాలనీ, నూతిగూడెం, గుర్రంపేట, మొద్దులగూడెంలను ముంపు ప్రాంత జాబితాలో చేర్చాలన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమానికి సర్పంచ్ పులి సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్ధ అధినేత గాంధీబాబు, సర్పంచ్‌లు రామారావు, నర్సమ్మ వైఎస్‌స్సార్‌సిపి మండల కన్వీనర్ సత్తిబాబు, మండల ఉపాధ్యక్షుడు బాలకృష్ణ సత్యనారాయణ, కాంగ్రెస్ మండల కన్వీనర్ లీలాకృష్ణ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు రామారావు, సూర్యప్రకాశరావు, సారయ్య రాంబాబు, రత్తయ్య,మల్లయ్య, అంజనరావు, రాజులు, చినబాబు, గిరిజన సంఘం నాయకులు, పీసా చట్టం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment