ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
మోతుగూడెం: చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో వనదుర్గమ్మ ఆలయం వద్ద మంగళవారం జరిగిన ఆటో బోల్తా సంఘటనలో దేవీపట్నం మండలం బడిగుంట గ్రామానికి చెందిన మజ్జిగ బాబూరావు(42) మృతి చెందారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ ఎ.శివన్నారాయణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతూరు మండలంలోని కొండపల్లి గ్రామంలో ఓ కార్యక్రమానికి బడిగుంట గ్రామానికి చెందిన పది మంది ఆటోలో బయలుదేరారు. చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని వన దుర్గమ్మ దేవాలయం సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మందికి చిన్న చిన్న గాయాలు కాగా , బడిగుంట గ్రామానికి చెందిన బాబూరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతని చింతూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని చింతూరు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఎస్‌ఐ ఎ.శివన్నారాయణ సంఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment