భూసార పరీక్షలపై అవగాహన
రాజవొమ్మంగి: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం భూసార పరీక్షలపై రైతులకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. అగ్నికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అకాడమీ (ఆత్మ) బీటీఎం నీలి బాబూరావు మాట్లాడుతు భూసార పరీక్షల వల్ల రైతులు భూమిలో ఏఏ పోషకాలు ఎంత మోతాదులో ఉందనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చన్నారు. తద్వారా అవసరం మేరకు మాత్రమే రసాయన ఎరువులను వాడుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడ్డతీగల ఏడీఏ కంకిపాటి సావిత్రి మాట్లాడుతు భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు ఆకళింపు చేసుకొని వారి తల్లిదండ్రులకు, గ్రామాల్లో రైతులకు వివరించాలని కోరారు. రైతులు సేంద్రియ ఎరువులను ఉపయోగించుకోవాలని సూచించారు. పలువురు రైతులకు భూసారపరీక్షా ఫలితాలకు చెందిన పత్రాలను అందజేశారు. మండల వ్యవసాయాధికారి చక్రధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment