గిరిజన చట్టాలకు ‘కూటమి’తో పొంచి ఉన్న ముప్పు
● ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మన్నపడాల్, బాలదేవ్
పాడేరు రూరల్: గిరిజన చట్టాలకు కూటమి ప్రభుత్వంతో ముప్పు పొంచి ఉందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధర్మన్నపడాల్, పొద్దు బాలదేవ్‌లు ఆరోపించారు. మంగళవారం వారు మాట్లాడుతూ గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని అసెంబ్లీలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి కోరడం విడ్డూరంగా ఉందని, తక్షణం ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.1/70 చట్టం నిర్వీర్యానికి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ సాక్షిగా గిరిజనేతరులకు పక్క గృహాల నిర్మాణానికి అనుమతులివ్వాలని శిరీషాదేవి కోరడం సిగ్గుచేటన్నారు. గిరిజనులపై కూటమి ప్రభు త్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే గుణపాఠం తప్పదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment