ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా
● హైవే అధికారులపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆగ్రహం
జి.మాడుగుల: లంబసింగి నుంచి జి.మాడుగుల మీదుగా పాడేరు వరకు జరుగుతున్న ఎన్‌హెచ్ 516ఇ నిర్మాణ పనుల వల్ల ఎగురుతున్న దుమ్ము, ధూళి కారణంగా వాహనచోదకులకు రోడ్డు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా అని హైవే అధికారులపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధూళి వల్ల హైవే పక్కన గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికార్లు,కాంట్రాక్టర్లకు ఇప్పటికే చాలాసార్లు తెలియజేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డును నీటితో తడిపితే దుమ్మురేగకుండా ఉంటుందన్నారు. హైవే అథారిటీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఈప్రాంత ప్రజలతో కలసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తా మని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎస్‌ఐ షణ్ముఖరావు, కుంబిడిసింగి సర్పంచ్ కృష్ణమూర్తి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment