ఆకాశమే హద్దు
పాడేరు: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థినులు హాజరయ్యారు. పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్, డిస్ట్రిక్ట్ క్రైం రికార్డు బ్యూరో, క్లూస్ విభాగం, ఎన్‌డీపీఎస్, సైబర్ క్రైం, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల పనితీరును విద్యార్థినులకు ఎస్పీ అమిత్ బర్దర్ వివరించారు. విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచే అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలికలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేంత వరకు వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. మంచి ఉద్యోగాలతో ఉన్నత రంగాల్లో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ధీరాజ్, సీఐలు బి.అప్పలనాయుడు, సంజీవరావు, ప్రసాద్, ముక్తేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పురుషులతో సమానంగా రాణించాలి
అతివలు అద్భుతాలు సృష్టించాలి
పోలీస్ ఓపెన్ హౌస్‌లో ఎస్పీ అమిత్ బర్దర్
Comments
Please login to add a commentAdd a comment