డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలకు తుది మెరుగులు
● రానున్న విద్యా సంవత్సరంలో తీరనున్న విద్యార్థుల కష్టాలు ● నిర్మాణ పనులను పరిశీలించిన పీవో అభిషేక్ గౌడ
డుంబ్రిగుడ: కొత్త భవనాలను త్వరగా సిద్ధం చేసి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి డుంబ్రిగుడలో నిర్వహిస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ చెప్పారు. డుంబ్రిగుడలో విద్యాలయం ప్రాంగణ నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి వసతి, తరగతి, సిబ్బంది, ప్రిన్సిపాల్ గదుల నిర్మాణంతోపాటు ప్రహరీ పనులను క్షుణంగా పరిశీలించారు. డుంబ్రిగుడ పాఠశాలను అరకులోయలో చాలీచాలని గదులలో నిర్వహించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, డుంబ్రిగుడలో పాఠశాల భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి భూములిచ్చిన గిరిజనులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. పాఠశాల ప్రారంభానికి ముందే ఉపాధి కల్పిస్తామన్నారు. గిరిజన విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా మానవతా దృక్పథంతో ఆందోళన విరమించాలని కోరారు. తహసీల్దార్ నుంచి పూర్తి నివేదికను తెప్పించుకొని ఉపాఽ ది కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అంతకు ముందు కించుమండలో నిర్మి స్తున్న సంపంగి గెడ్డ వంతెనను పీవో పరిశీలించా రు. ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ జి.కోటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment