పార్టీ అధినేతను కలిసిన అరకు ఎంపీ
పాడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజారాణి, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్ గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఆదివాసీల చట్టాలు, హక్కుల అమలుతోపాటు గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలను ప్రస్తావించిన తీరుపై ఎంపీ తనూజారాణిను అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, విధివిధానాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఏజెన్సీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు సూచించారని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment