పాడేరు రూరల్: పీఎం ఇంటర్న్ షిప్ పథకానికి ఈ నెల 12వ తేదీలోగా నమోదు చేసుకోవాలని కార్మికశాఖ జిల్లా అధికారి టి.సుజాత శుక్రవారం తెలిపారు. 12 నెలల పాటు శిక్షణ ఇస్తూ నెలవారీ సహాయం కింద రూ.5వేల చొప్పున, మరో రూ. 6వేలు ఒకేసారి అందించనున్నట్టు పేర్కొన్నారు. పీఎం ఇంటర్న్ షిప్ స్కీం నమో దుకు అర్హులైన ప్రతి ఒక్కరూ pmintern rhipmca.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యావంతులు అర్హులని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment