చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
రంపచోడవరం: గిరిజన మహిళలు, యువతులు అన్ని రంగాల్లో రాణించాలని రంపచోడవరం ఐటీడీ ఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పీవో మాట్లాడుతూ మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు.
సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ మాట్లాడుతూ గిరిజన యువతులు ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు వాలీబాల్, ఖోఖో తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు పీవో, సబ్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్, పీవోలను ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వసుధ, అధ్యాపకులు, విద్యార్థినులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు కల్యాణి, చంద్రిక, న్యాయవాది పద్మావతి, అధ్యాపకులు రవికుమార్, వెంటేష్, చక్రవర్తి, సునీత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment