టాయిలెట్లను సద్వినియోగం చేసుకోవాలి
– కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కోల్‌కత్తాకు చెందిన విజువిస్ అనే సంస్థ నిర్మించిన బయో టాయిలెట్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. పట్టణంలోని తలార్‌సింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్మించిన రెండు బయో టాయిలెట్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీఎస్సార్ నిధుల కింద జిల్లాలో మరిన్ని పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంత్రి సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ గణేష్, ధనలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment